Jump to content

సదానంద్ చవాన్

వికీపీడియా నుండి
సదానంద్ చవాన్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2009 - 2019
ముందు రమేష్ భాయ్ కదమ్
తరువాత శేఖర్ గోవిందరావు నికమ్
నియోజకవర్గం చిప్లూన్

వ్యక్తిగత వివరాలు

జననం (1963-09-23) 1963 సెప్టెంబరు 23 (వయసు 61)
చిప్లూన్, మహారాష్ట్ర, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ స్వతంత్ర
ఇతర రాజకీయ పార్టీలు శివసేన
నివాసం ముంబై, మహారాష్ట్ర, భారతదేశం
వృత్తి రాజకీయ నాయకుడు

సదానంద్ చవాన్ (జననం 1963 సెప్టెంబరు 23) మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు చిప్లూన్ శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

సదానంద్ చవాన్ శివసేన ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2009 శాసనసభ ఎన్నికలలో శివసేన అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్‌సీపీ అభ్యర్థి కదం రమేష్‌భాయ్ రామచంద్రపై 18,484 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1] ఆయన 2014 ఎన్నికలలో శివసేన అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్‌సీపీ అభ్యర్థి శేఖర్ గోవిందరావు నికమ్ పై 6068 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2]

సదానంద్ చవాన్ 2019 ఎన్నికలలో శివసేన అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్‌సీపీ అభ్యర్థి చేతిలో శేఖర్ గోవిందరావు నికమ్ 29,924 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 3 September 2010.
  2. India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  3. The Times of India (23 November 2024). "Chiplun Constituency Election Results" (in ఇంగ్లీష్). Archived from the original on 1 December 2024. Retrieved 1 December 2024.