సప్తమి గౌడ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సప్తమి గౌడ
జననం (1996-06-08) 1996 జూన్ 8 (వయసు 27)
జాతీయతభారతీయురాలు
విద్యసివిల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ
వృత్తినటి, ప్రొఫెషనల్ స్విమ్మర్
క్రియాశీల సంవత్సరాలు2020 - ప్రస్తుతం
తల్లిదండ్రులుఉమేష్ ఎస్కే దొడ్డి, శాంత మాదయ్య

సప్తమి గౌడ (జననం 1996 జూన్ 8) భారతీయ చలనచిత్ర నటి, ఆమె ప్రధానంగా కన్నడ చిత్రాలలో నటిస్తుంది.

2023లో అభిషేక్‌ అంబరీష్‌ కథానాయకుడిగా సెట్స్‌పైకి వెళ్తున్న ప్రేమ కథాచిత్రం కాళిలో నాయికగా ఆమె ఎంపిక అయింది. అలాగే ప్రముఖ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కిస్తున్న బాలీవుడ్ చిత్రం ది వ్యాక్సిన్ వార్ లో కూడా ఆమెనటించనుంది.[1]

బాల్యం, విద్య[మార్చు]

సప్తమి గౌడ బెంగళూరులో 1996 జూన్ 8న జన్మించింది. ఆమె తండ్రి ఉమేష్ ఎస్కే దొడ్డి పోలీసు ఉన్నతాధికారి, తల్లి శాంత మాదయ్య గృహిణి. ఆమె చెల్లెలు ఉత్తరే గౌడ వృత్తిరీత్యా స్విమ్మర్. సప్తమి గౌడ పాఠశాల విద్య బెంగళూరులోని బాల్డ్‌విన్ బాలికల ఉన్నత పాఠశాలలో సాగింది. ఇంటర్మీడియట్ శ్రీ కుమారన్ చిల్డ్రన్స్ హోమ్ కాంపోజిట్ జూనియర్ కళాశాలలో జరిగింది. ఆ తరువాత ఆమె సివిల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీని అభ్యసించింది.

కెరీర్[మార్చు]

ఐదేళ్ల వయసులో సప్తమి గౌడ ఈత శిక్షణ పొందింది. 2006 నుంచి 2010 వరకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో పలు స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొన్న సప్తమి గౌడ ఎన్నో రజత, కాంస్య, బంగారు పతకాలను కైవసం చేసుకుంది. సప్తమి గౌడ 2020లో విడుదలైన దునియా సూరి పాప్‌కార్న్ మంకీ టైగర్ (ಪಾಪ್‌ಕಾರ್ನ್ ಮಂಕಿ ಟೈಗರ್ ) చిత్రంతో తన నటనను ప్రారంభించింది. దీనికిగాను 2021లో ఉత్తమ తొలి నటిగా సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డును గెలుచుకుంది. కన్నడ దర్శకుడు రిషభ్ శెట్టి తెరకెక్కించి, అతనే ప్రధాన పాత్రలో నటించన కాంతార (2022) చిత్రంలో ఆయనకు జోడిగా సప్తమి గౌడ నటించింది. ఇందులో ఆమె నటనకు ప్రసిద్ధి చెందింది.[2] మొదట కన్నడలో మాత్రమే విడుదలైన కాంతార చిత్రం ఆ తరువాత తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కూడా డబ్ చేసి విడుదల చేశారు. పాన్ ఇండియా స్థాయిలో కాంతార విజయఢంకా మోగిస్తోంది.[3]

మూలాలు[మార్చు]

  1. "Sapthami Gowda: క్రేజీ ఆఫర్ కొట్టేసిన 'కాంతార' బ్యూటీ | Sapthami Gowda Grabbed a chance in bollywood star director movie jay". web.archive.org. 2023-01-19. Archived from the original on 2023-01-19. Retrieved 2023-01-19.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "'కాంతార' సుందరి.. సప్తమి గౌడ". web.archive.org. 2023-01-19. Archived from the original on 2023-01-19. Retrieved 2023-01-19.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "Kantara: ఆ హద్దులేం లేవు.. దేనికైనా రెడీ అంటున్న హీరోయిన్ సప్తమి గౌడ". web.archive.org. 2022-10-18. Archived from the original on 2022-10-18. Retrieved 2023-01-19.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)