సప్త సాగరాలు దాటి- సైడ్ ఎ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సప్త సాగరాలు దాటి- సైడ్ ఎ
దర్శకత్వంహేమంత్ ఎం. రావు
రచనగుండు శెట్టి
హేమంత్ ఎం. రావు
నిర్మాతరక్షిత్ శెట్టి
తారాగణంరక్షిత్ శెట్టి
రుక్మిణి వసంత్
పవిత్రా లోకేష్
అచ్యుత్ కుమార్
ఛాయాగ్రహణంఅద్వైత గురుమూర్తి
కూర్పుసునీల్ ఎస్. భరద్వాజ్
హేమంత్ ఎం. రావు
సంగీతంచరణ్ రాజ్
విడుదల తేదీs
2023 సెప్టెంబరు 22 (2023-09-22)(థియేటర్)
2023 సెప్టెంబరు 28 (2023-09-28)( అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో)
సినిమా నిడివి
142 నిముషాలు
దేశంభారతదేశం

సప్త సాగరాలు దాటి- సైడ్ ఎ 2023లో విడుదలైన తెలుగు సినిమా. కన్నడంలో సెప్టెంబర్ 1న 'సప్త సాగర దాచే ఎల్లో' పేరుతో హేమంత్.ఎం.రావు దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమాను తెలుగులో సెప్టెంబర్ 22న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, రక్షిత్ శెట్టి విడుదల చేశారు.[1] రక్షిత్ శెట్టి, రుక్మిణీ వసంత్, పవిత్రా లోకేష్, అచ్యుత్ కుమార్, శరత్ లోహితస్వా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను సెప్టెంబర్ 19న విడుదల చేశారు.[2] సప్త సాగరాలు దాటి సినిమా థియేటర్లలో సెప్టెంబర్‌ 22న విడుదలై,సెప్టెంబర్‌ 29న  నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో విడుదలైంది.[3]

నటీనటులు[మార్చు]

కథ[మార్చు]

మను (రక్షిత్ శెట్టి), ప్రియ (రుక్మిణి వసంత్) ఇద్దరు ప్రేమించుకుంటారు. పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించాలని అనుకుంటారు. అయితే ప్రియకు ఒక కోరిక ఉంది, ఆ కోరికను ఎలాగైనా తీర్చాలనుకొని మను తొందరగా జీవితంలో స్థిరపడిపోవచ్చు అన్న ఆశతో ఎవరో చేసిన యాక్సిడెంట్ కేసుని డబ్బుల కోసం చెయ్యని తప్పుకు మను జైలుకు వెళతాడు. కానీ కేసు ఒప్పుకోమని ఇచ్చిన శంకర్ గౌడ (అవినాష్) చనిపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో మను, ప్రియా ఉంటారు. కేసు ఇచ్చిన శంకర్ గౌడ చనిపోతే హీరో కేసుని ఎవరు వాదించారు? మను జైలులో ఎలాంటి కష్టాలు పడ్డాడు? ఈ కేసు నుండి మను బయటకి వచ్చాడా? లేదా అనేదే మిగతా సినిమా కథ.[4]

మూలాలు[మార్చు]

  1. ETV Bharat News (15 September 2023). "'సప్త సాగరాలు దాటి' తెలుగులోకి.. కన్నడలో సూపర్​ హిట్​.. మరి ఇక్కడో?". Archived from the original on 22 September 2023. Retrieved 22 September 2023. {{cite news}}: zero width space character in |title= at position 47 (help)
  2. Mana Telangana (19 September 2023). "'సప్త సాగరాలు దాటి' సినిమా నుంచి థియేట్రికల్ ట్రైలర్". Archived from the original on 22 September 2023. Retrieved 22 September 2023.
  3. TV9 Telugu (29 September 2023). "వారం రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చిన బ్లాక్‌ బస్టర్‌ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?". Archived from the original on 29 September 2023. Retrieved 29 September 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Andhra Jyothy (22 September 2023). "'సప్త సాగరాలు దాటి' సినిమా రివ్యూ : కన్నడ బ్లాక్ బస్టర్ తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందా?". Archived from the original on 23 September 2023. Retrieved 23 September 2023.

బయటి లింకులు[మార్చు]