సప్నా చౌదరి
సప్నా చౌదరి | |
---|---|
జననం | ఢిల్లీ | 1990 సెప్టెంబరు 25
నివాస ప్రాంతం | హర్యానా |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | నర్తకి, గాయని, నటి |
క్రియాశీలక సంవత్సరాలు | 2012 - ప్రస్తుతం |
టెలివిజన్ | బిగ్ బాస్ సీజన్ 11 |
భార్య / భర్త | వీర్ సాహు |
తల్లిదండ్రులు | భూపేంద్ర చౌదరి నీలం చౌదరి |
సప్నా చౌదరి ఒక భారతీయ నృత్యకారిణి.[1] ఆమె టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ 11లో పాల్గొన్నది. ఆమె నాను కి జాను , భాంగోవర్, వీరే కి వెడ్డింగ్ వంటి కొన్ని బాలీవుడ్ చిత్రాలలో ఐటెం సాంగ్స్ చేసింది.
ప్రారంభ జీవితం
[మార్చు]సప్నా చౌదరి 1995లో ఢిల్లీలోని మహిపాల్‌పూర్‌లో జాట్ కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి భూపేంద్ర 2008లో ఆమె 14 సంవత్సరాల వయస్సులో దీర్ఘకాల అనారోగ్యంతో మరణించాడు. తన తండ్రి మరణం తరువాత, కుటుంబ బాధ్యతలను నిర్వహించడానికి, ఆమె నృత్యం, పాడటం తన వృత్తిగా ఎంచుకుంది. అదే సినిమా రంగానికి సుగమం చేసింది.
కెరీర్ సప్నా హర్యానాకు చెందిన ఆర్కెస్ట్రా బృందంతో తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆమె మొదట్లో హర్యానా, సమీప రాష్ట్రాల్లో రాగ్ని పార్టీలతో కలిసి రాగ్ని కార్యక్రమాలలో పాల్గొన్నది. ఆ తర్వాత సప్న స్టేజ్ డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. ఏక్ మోర్ మ్యూజిక్ కంపెనీ విడుదల చేసిన హర్యాన్వీ సాంగ్ 'సాలిడ్ బాడీ రాయ్'పై సప్నా డ్యాన్స్ చేసిన వీడియో హిట్ అయింది. ఆ తర్వాత హర్యానాతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ సప్నాకు గుర్తింపు వచ్చింది. 20కి పైగా పాటల్లో తన గాత్రాన్ని అందించింది. సప్నా జర్నీ ఆఫ్ భాంగోవర్‌లో ఐటెమ్ నంబర్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. దీని తర్వాత, సప్నా వీరే కి వెడ్డింగ్ చిత్రంలోని 'హత్ జా తౌ' పాటలో కనిపించింది. అభయ్ డియోల్ నటించిన నాను కి జాను చిత్రంలో సప్నా ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది. 'తేరే తుమ్కే సప్నా చౌదరి' అనే ఐటెమ్ నంబర్‌ను కూడా చేసింది.
సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | భాష |
---|---|---|
2018 | నాను కీ జాను | హిందీ |
2018 | వీరే కి వెడ్డింగ్ | హిందీ |
2017 | జర్నీ ఆఫ్ భాంగోవర్ | హిందీ |
2017 | ఏక్ తూ ఏక్ మే | హిందీ |
2017 | సప్నా చౌదరి సాంగ్ లిస్ట్ | హిందీ |
2018 | దోస్తి కే సైడ్ ఎఫెక్ట్స్ | హిందీ |
టెలివిజన్
[మార్చు]- బిగ్ బాస్ సీజన్ 11, కలర్స్ టీవీ (2017)
- లాడో - వీర్‌పూర్ కి మర్దానీ సీజన్ 2, కలర్స్ టీవీ (2018)
మూలాలు
[మార్చు]- ↑ "एक बार फिर सोशल मीडिया पर छाई सपना चौधरी, फैन्स ने वीडियो किया वायरल". लाइव हिंदुस्तान. 24 मार्च 2018.
{{cite news}}
: Check date values in:|date=
(help)