Jump to content

సమీర్ కునావర్

వికీపీడియా నుండి
సమీర్ కునావర్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2014
ముందు అశోక్ షిండే
నియోజకవర్గం హింగన్‌ఘాట్

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

సమీర్ త్రయంబక్రరావు కునావర్‌ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు హింగన్‌ఘాట్ శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

సమీర్ కునావర్‌ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2009 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో హింగన్‌ఘాట్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి ఆ తరువాత 2014 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీఎస్‌పీ అభ్యర్థి తెలాంగ్ ప్రళయ్ భౌరావ్ పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1] ఆయన 2019 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్‌సీపీ అభ్యర్థి మోహన్ వాసుదేవరావు తిమాండేపై 50,455 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2]

ఆయన 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్‌సీపీ - ఎస్‌పీ అభ్యర్థి అతుల్ నామ్‌దేవరావు వండిలేపై 30,094 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4]

మూలాలు

[మార్చు]
  1. India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  2. The Indian Express (24 October 2019). "Maharashtra election result 2019: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
  3. Election Commission of India (23 November 2024). "Maharastra Assembly Election Results 2024 - Hinganghat". Archived from the original on 5 December 2024. Retrieved 5 December 2024.
  4. The Times of India (23 November 2024). "Maharashtra election results 2024: Constituency-wise full winners list and key highlights". Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.