సరఫరా గొలుసు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వ్యాపారం, ఫైనాన్స్‌లో, సరఫరా గొలుసు అనేది వినియోగదారులకు ఉత్పత్తి లేదా సేవను సరఫరా చేయడంలో పాల్గొనే సంస్థలు, వ్యక్తులు, కార్యకలాపాలు, సమాచారం, వనరుల వ్యవస్థ. సహజ వనరులు, ముడి పదార్థాలు, విడిభాగాలు మొదలైనవాటికి తగు పరిణామాలు చేర్చి తుది ఉత్పత్తిగా మార్చి వినియోగదారునికి అందించడం సరఫరా గొలుసు కార్యకలాపాలు. [1]

అధునాతన సరఫరా గొలుసు వ్యవస్థలలో, ఉపయోగించిన ఉత్పత్తుల అవశేష విలువలో ఇంకా పనికొచ్చేది ఉంటే వాటిని ఏ సమయంలోనైనా తిరిగి సరఫరా గొలుసు లోకి ప్రవేశ పెట్టవచ్చు.

ఇంటర్నెట్‌లో, వినియోగదారులు నేరుగా పంపిణీదారులను సంప్రదించే వీలుంది. దీనివలన మధ్యవర్తులు తగ్గిపోయి గొలుసు పొడవు కొంతవరకు తగ్గింది.

స్థూలంగా[మార్చు]

సహజ వనరులపై పర్యావరణ, జీవ, రాజకీయ నియంత్రణతో ఒక సాధారణ సరఫరా గొలుసు ప్రారంభమవుతుంది, తరువాత ముడి పదార్థాలను మానవులు సేకరించడం, అనేక ఉత్పత్తి దశలు (ఉదా., విడిభాగాల నిర్మాణం, కృపు, విలీనం మొదలైనవి), అ తరువాత అనేక దశల్లో నిల్వ చెయ్యడం ఉంటాయి. ఈ నిల్వ దశలు పెరిగే కొద్దీ, పరిమాణాలు తగ్గుతూ భౌగోళికంగా నిల్వ చేసే స్థలాలు విస్తరిస్తూ పోయి, చివరకు వినియోగదారుని చేరతాయి.

తాము నైతిక పద్ధతులను అనుసరిస్తున్నామని తెలియజెప్పే ప్రయత్నాల్లో భాగంగా, చాలా పెద్ద కంపెనీలూ, గ్లోబల్ బ్రాండ్లు తమ సంస్థాగత సంస్కృతి, నిర్వహణ వ్యవస్థల్లోకి ప్రవర్తనా నియమావళిని, మార్గదర్శకాలనూ అనుసంధానిస్తున్నాయి. సంస్థలు, తమ సరఫరాదారులు (సౌకర్యాలు, పొలాలు, శుభ్రపరచడం, క్యాంటీన్, భద్రత మొదలైన ఉప కాంట్రాక్ట్ సేవలు) తమకు ఆవశ్యకమైన ప్రమాణాలకు లోబడి ఉండాలని డిమాండ్లు చేస్తున్నాయి, అలా ఉన్నారో లేదో సామాజిక ఆడిట్ ద్వారా ధ్రువీకరించుకుంటున్నాయి. సరఫరా గొలుసులో పారదర్శకత లేకపోవడాన్ని మిస్టిఫికేషన్ అంటారు. దీనివలన వినియోగదారులకు తాము కొనుగోలు చేసే ఉతపత్తులు ఎక్కడ ఉద్భవించాయో తెలియకుండా పోతుంది. సామాజికంగా బాధ్యతా రహితమైన పద్ధతులకు ఇది ఊతమిస్తుంది. సరఫరా-గొలుసు నిర్వాహకులు వారి వనరులకు ఉత్తమమైన ధరను పొందుతున్నారో లేదోనని వారి చర్యలు నిరంతరం నిశిత పరిశీలనలో ఉంటాయి. దినికితోడు పారదర్శకత లేకపోతే ఇది కష్టతరమౌతుంది. పరిశ్రమలో పోటీ ధరలను గుర్తించాలంటే కాస్ట్ బెంచ్‌మార్కింగ్ అనేది ఒక మంచి పద్ధతి. ఇది సంధానకర్తలు తమ వ్యూహాన్ని రూపొందించుకోడానికీ, మొత్తం ఖర్చును తగ్గించడానికీ ఒక బలమైన పునాదిని ఇస్తుంది.

మూలాలు[మార్చు]

  1. "సరకులకెళ్తే... బె'ధరా'ల్సిందే". www.eenadu.net. Retrieved 2020-05-15.