సరోజ్ ఖాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సరోజ్ అహ్మద్ ఖాన్
సరోజ్ ఖాన్
జననం
నిర్మల నాగ్‌పాల్‌

(1948-11-22)1948 నవంబరు 22
మరణం2020 జూలై 3(2020-07-03) (వయసు 71)
వృత్తినృత్య దర్శకురాలు
క్రియాశీల సంవత్సరాలు1958–2020
జీవిత భాగస్వామిబి. సోహన్ లాల్ (1961-1965), సర్దార్ రోషన్ ఖాన్ (1975-)
పిల్లలు4

సరోజ్ ఖాన్ (నవంబరు 22, 1948 - జూలై 3, 2020) భారతీయ నృత్య దర్శకురాలు. ఎక్కువగా బాలీవుడ్ సినిమాలకు పనిచేశారు. ఆమె అసలు పేరు నిర్మల కిషన్ చంద్ సధు సింగ్ నాగ్ పాల్. దాదాపు 2000కు పైగా సినిమాలకు నృత్య దర్శకత్వం చేశారు సరోజ్. ఆమె తల్లిదండ్రులు కిషన్ చంద్ సధు సింగ్, నోని సధు సింగ్.

కెరీర్

[మార్చు]

ఆమె పుట్టిన కొద్ది రోజులకే భారత విభజన జరగడంతో వీరి కుటుంబం భారతదేశంలో స్థిరపడిపోయారు. నజరానా సినిమాలో శ్యామ అనే పాత్రతో బాల నటిగా తెరంగేట్రం చేశారు ఆమె.[1] నిర్మల గా జన్మించిన , ఆమె తల్లిదండ్రులు భారత విభజన అనంతరం భారతదేశానికి వలస వచ్చారు. ఆమె బాలనటిగా 1950ల చివరలో బాలనటిగా, నేపథ్య నృత్యకారిణిగా నటించిన నజరానా చిత్రంలో మూడు సంవత్సరాల వయసులో బాలనటిగా కెరీర్ ను ప్రారంభించింది. ఆమె సినిమా కొరియోగ్రాఫర్ బి.సోహన్ లాల్ ఆధ్వర్యంలో పని చేస్తుండగా డ్యాన్స్ నేర్చుకుంది. తరువాత ఆమె స్వయంగా కొరియోగ్రఫీకి మారింది, మొదట సహాయ కొరియోగ్రాఫర్ గా, తరువాత స్వతంత్ర కొరియోగ్రాఫర్ గా ఆమె బ్రేక్ ను పొందగా, గీతా మేరా నం (1974)తో కలిసి ఆమె నృత్యదర్శకత్వం లో చేరింది. అయితే, శ్రీ దేవితో కలిసి తన పనితో వచ్చిన ప్రశంసలను అందుకోవడానికి ఆమె చాలా సంవత్సరాలు వేచి ఉండవలసి వచ్చింది. మిస్టర్ ఇండియా (1987) లో హవా హవాయ్ , నగీనా (1986), చాందినీ (1989) తర్వాత మాధురీ దీక్షిత్ తో కలిసి తేజాబ్ (1988) లో ఏక్ దో తీన్, తామా తమ్మ లోగె (1990), బేటా (1992)లో ధక్ ధక్ కర్ణే లగా వంటి హిట్ లతో ప్రారంభమైంది. ఆ తర్వాత ఆమె అత్యంత విజయవంతమైన బాలీవుడ్ కొరియోగ్రాఫర్లలో ఒకరిగా నిలిచింది.ఎంతో మంది తారలను అశేష సినీ (పేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచేటట్లు చేశారు. సినిమాలో పాటలన్నీ ఎవరు చేసినా ఆమె చేసిన 'మార్‌ డాలా...” లాంటి ఒక్క పాటతో సినిమాకి కాసుల వర్షం కురిసేది. ఆ పాటలో 'మార్‌ డాలా' అనే పదం పాతిక మార్లకంటే ఎక్కువే పలికితే, పలికిన ప్రతిసారీ సరికొత్త అభినయాన్ని గుప్పించిన సరోజ్‌ ప్రతిభకు దాసోహమయ్యారంతా. అందుకే పురుష కొరియోగ్రాఫర్స్‌తో సమానంగానే కాదు అంతకుమించిన పారితోషకం కావాలన్నా ఒప్పుకునేవారు దర్శకనిర్మాతలు. చిన్నవయసులో సైడ్‌ డ్యాన్సర్‌గా కేవలం వెస్ట్రన్‌ నెంబర్లకే అవకాశం దొరికినా తనలో ఉన్న ప్రతిభా, నైవుణ్యాలను పట్టుతప్పకుండా ప్రదర్శించి, భారతీయ సాంప్రదాయ నృత్యాలను బాలీవుడ్‌ తెరపై వెలుగొందేలా చేసిన ఘనత ఆమెది.

పురస్కరాలు

[మార్చు]
  1. జాతీయ పురస్కారాలు - మూడుసార్లు జాతీయ పురస్కారం
  2. ఫిల్మ్‌ఫేర్‌లో హ్యాట్రిక్‌ పురస్కరాలు అందుకున్న ఏకైక నృత్య దర్శకురాలు
  3. నంది ఉత్తమ నృత్య దర్శకురాలు - ఓ మారియా ఓ మారియా (చూడాలని ఉంది, 2018)

మరణం

[మార్చు]

2020, జూన్‌ 20న శ్వాస సంబంధమైన సమస్యలతో బాంద్రాలోని గురునానక్‌ హాస్పిటల్‌లో చేరిన సరోజ్ ఖాన్ 2020, జూలై 3న గుండెపోటుతో మరణించింది.[2]

మూలాలు

[మార్చు]
  1. Gulzar; Govind Nihalani; Saibal Chatterjee (2003). Encyclopaedia Of Hindi Cinema. Popular Prakashan. p. 573. ISBN 978-81-7991-066-5. Retrieved 13 June 2013.
  2. సాక్షి, సినిమా (4 July 2020). "'మాస్టర్‌ జీ' మరి లేరు". Sakshi. Archived from the original on 5 July 2020. Retrieved 5 July 2020.