Jump to content

సర్తాజ్ సింగ్

వికీపీడియా నుండి
సర్తాజ్ సింగ్

పదవీ కాలం
1989 – 1999
ముందు హర్పాల్ సేథి
నియోజకవర్గం హోషంగాబాద్

వ్యక్తిగత వివరాలు

జననం (1940-05-26)1940 మే 26
ఉజ్జయిని, గ్వాలియర్ రాష్ట్రం, భారతదేశం
మరణం 2023 అక్టోబరు 12(2023-10-12) (వయసు 83)
భోపాల్, మధ్యప్రదేశ్, భారతదేశం
రాజకీయ పార్టీ బీజేపీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్‌ (2018 - 2020)
జీవిత భాగస్వామి గుర్మీత్ కౌర్
సంతానం 3
మూలం [1]

సర్తాజ్ సింగ్ ఛత్వాల్ (26 మే 1940 - 12 అక్టోబర్ 2023) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన హోషంగాబాద్ నియోజకవర్గం నుండి ఐదుసార్లు లోక్‌సభ సభ్యుడిగా, రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

సర్తాజ్ సింగ్ ఐదుసార్లు లోక్‌సభ సభ్యుడిగా, రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై కేంద్ర మంత్రి, మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా పని చేసి 2018లో సియోని మాల్వా నియోజకవర్గం నుండి టికెట్ ఇవ్వకపోవడంతో బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరాడు. ఆయన కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి ఆ తరువాత 2020లో తిరిగి బీజేపీలో చేరాడు.[2]

నిర్వహించిన పదవులు

[మార్చు]
  • డిసెంబర్ 18, 2008న రాజీనామా చేశాడు
  • 5 ఆగస్టు 2007 నుండి రవాణా, పర్యాటకం & సంస్కృతిపై కమిటీ సభ్యుడు
  • 25 ఆగస్ట్ 2006 నుండి , ప్రివిలేజెస్ కమిటీ సభ్యుడు
  • 1989-91: సభ్యుడు, కన్సల్టేటివ్ కమిటీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, స్పేస్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఓషన్ డెవలప్‌మెంట్ & మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ
  • 1991: 10వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యారు (2వసారి)
  • 1991-93: అంచనాల కమిటీ సభ్యుడు
  • ఆర్థిక మంత్రిత్వ శాఖ యొక్క సలహా కమిటీ సభ్యుడు
  • 1970 - 1974: హోషంగాబాద్ జిల్లా జనసంఘ్ అధ్యక్షుడు
  • 1971-72 & 1978-80: ఇటార్సీ మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్, మధ్యప్రదేశ్
  • 1980 నుండి మధ్యప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, భారతీయ జనతా పార్టీ (బిజెపి)
  • 1989: 9వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు
  • 1991-96: ఆర్థిక మంత్రిత్వ శాఖ సలహా కమిటీ సభ్యుడు
  • 1993-96 : ఆర్థిక కమిటీ సభ్యుడు
  • 1995 నుండి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు
  • 1996: 11వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యారు (3వ సారి)
  • 16 మే 1996-1 జూన్ 1996: కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి
  • 1996-97: మానవ వనరుల అభివృద్ధి కమిటీ సభ్యుడు
  • పెట్రోలియం మంత్రిత్వ శాఖలోని కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు
  • రైల్వే కన్వెన్షన్ కమిటీ సభ్యుడు ప్రభుత్వ హామీల కమిటీ సభ్యుడు అంచనాల కమిటీ సభ్యుడు
  • 1991-94: మధ్యప్రదేశ్ బీజేపీ కోశాధికారి & ఉపాధ్యక్షుడు
  • 1998: 12వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యారు (4వ సారి)
  • 1998-99: మానవ వనరుల అభివృద్ధి కమిటీ సభ్యుడు & స్మారక చిహ్నాల పరిరక్షణపై సబ్-కమిటీ-III కన్వీనర్
  • 2004: 14వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యారు (5వ సారి)
  • రవాణా, పర్యాటకం & సంస్కృతిపై కమిటీ సభ్యుడు
  • 2013 - 2018: మధ్యప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి

మరణం

[మార్చు]

సర్తాజ్ సింగ్ అనారోగ్యంతో భోపాల్‌లోని ఆసుపత్రిలో 12 అక్టోబర్ 2023న మరణించాడు.ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.[3]

మూలాలు

[మార్చు]
  1. "Hall-a-baloo". 29 March 2015. Archived from the original on 17 August 2024. Retrieved 17 August 2024.
  2. The Times of India (15 December 2020). "Madhya Pradesh: Ex-Union minister Sartaj Singh returns to BJP, calls it homecoming". Archived from the original on 2 October 2024. Retrieved 2 October 2024.
  3. The Hindu (12 October 2023). "Former Union minister Sartaj Singh passes away in Madhya Pradesh" (in Indian English). Archived from the original on 17 August 2024. Retrieved 17 August 2024.