సహాయం:మెరుగైన ఇటీవలి మార్పులు
ఇటీవలి మార్పులు పేజీని మెరుగుపరచి, మెరుగైన ఇటీవలి మార్పులను చూపించే విధంగా అభిరుచులు పేజీలో నిర్దేశించుకోవచ్చు.. అది ఇటీవలి మార్పులను వ్యాసాల వారీగా, రోజువారీగా గుంపుగా చేస్తుంది. ప్రతి రోజుకు, ఆ రోజు జరిగిన మార్పు చేర్పులను వ్యాసాల వారీగా గుది గుచ్చి, కొత్త మార్పు నుండి పాత మార్పు వరకు వరుసగా పేర్చి, వ్యాసం పేరుతో చూపిస్తుంది. అన్నిటి కంటే కొత్త మార్పును చూపించి మిగతా వాటిని దాస్తుంది. అయితే వ్యాసం పేరు పక్కన ఉన్న నీలం బాణం గుర్తును నొక్కినపుడు మార్పుచేర్పులన్నీ కనిపిస్తాయి. ఇది పనిచెయ్యాలంటే జావాస్క్రిప్టు ఉండాలి. జావాస్క్రిప్టు సౌకర్యం లేని బ్రౌజర్లలో పనిచెయ్యదు.
ఈ విశేషం సంబంధిత మార్పులు, మెరుగైన వీక్షణ జాబితా లకు కూడా వర్తిస్తుంది.
ఒక్కో వరుసలో ఏమేముంటాయి
[మార్చు]ఒకే మార్పు ఉన్న పేజీలు
[మార్చు]వరుసలో ఇవి ఉంటాయి:
- సమయం (తేదీ కనిపించదు, అది శీర్షంలో ఉంటుంది)
- పేజీ ప్రస్తుత కూర్పుకు లింకు ఇస్తూ పేజీ పేరు
- ప్రస్తుత దిద్దుబాటుకు లింకుతో "ప్రస్తు"
- పేజీ చరితం కు లింకుతో "చరితం"
- తన వాడుకరి పేజీకి లింకుతో వాడుకరిపేరు
- వాడుకరి చర్చ పేజీకి లింకుతో "చర్చ"
- దిద్దుబాటు సారాంశం
బహు మార్పులు ఉన్న పేజీలు
[మార్చు]బాణం గుర్తును నొక్కక ముందు కనిపించే ఒకే వరుసలో ఇవి ఉంటాయి:
- సమయం
- ప్రస్తుత కూర్పుకు లింకుతో పేజీ పేరు
- ఆ రోజున జరిగిన దిద్దుబాట్ల సంఖ్య
- జరిగిన మొత్తం మార్పుచేర్పులకు లింకుతో మార్పులు
- పేజీ చరితం లింకు
- తమ తమ వాడుకరి పేజీకి లింకులతో వాడుకరుల పేర్లు
బాణం గుర్తు నొక్కిన తరువాత కనిపించే దిద్దుబాటు వరుసల్లో ఒక్కోదానిలో ఇవి ఉంటాయి:
- సమయం, సదరు దిద్దుబాటు జరిగిన సమయానికి ఉన్న పేజీ కూర్పుకు లింకుతో
- సదరు దిద్దుబాటుకు లింకుతో ప్రస్తు
- సదరు దిద్దుబాటు యొక్క గత లింకు
- సదరు దిద్దుబాటు చేసిన వాడుకరిపేరు, తన వాడుకరి పేజీకి లింకుతో
- వాడుకరి చర్చ పేజీకి లింకుతో చర్చ
- దిద్దుబాటు సారాంశం