సహాయం:సంబంధిత మార్పులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రస్తుత పేజీకి లింకు ఉన్న అన్ని వ్యాసాల్లోను జరిగిన ఇటీవలి మార్పులను "సంబంధిత మార్పులు" అంశం చూపిస్తుంది. ఈ మార్పుల సంఖ్య మీ అభిరుచుల్లో సూచించిన అంకెను మించవు. దాని శీర్షిక పేరు "సంబంధిత మార్పులు" ఉపశీర్షిక "("---" నుండి లింకున్న పేజీలకు)".

ఇటీవలి మార్పులు, మెరుగైన ఇటీవలి మార్పులు వలెనే వీక్షణలో ఉన్న పేజీలు బొద్దుగా ఉంటాయి.

మనకు ఇష్టమైన పద్ధతిలో వీక్షణ జాబితాను తయారుచేసుకోవచ్చు. అయితే, సంబంధిత మార్పులులో చర్చాపేజీలు ఆటోమాటిగ్గా చేరవు. చర్చాపేజీలు కూడా చేఋఆలంటే సంబంధిత మార్పులు అమలవుతున్న పేజీకి ఈ చర్చాపేజీలు లింకై ఉండాలి.

వికల్పాలు[మార్చు]

అభిరుచులలో పెట్టుకోగల "స్వల్ప దిద్దుబాట్లను దాచు" అనే వికల్పం సంబంధిత మార్పులకు పనిచేస్తుంది.

స్వల్ప దిద్దుబాట్లను దాచు కూడా చూడండి.

హెచ్చరికలు[మార్చు]

దారిమార్పు పేజీలకు సంబంధించి, దారిమార్పు పేజీలో జరిగిన మార్పులను మాత్రమే చూపిస్తుంది; లక్ష్య పేజీలో జరిగిన మార్పులను కాదు. ఈ సందర్భంలో లక్ష్యపేజీకి సూటి లింకు ఉండడం మెరుగు.

"సంబంధిత మార్పులు" అంశం బొమ్మలు, ధ్వని ఫైళ్ళు, బొమ్మ వివరణ పేజీల్లో జరిగిన మార్పులను చూపించదు.

ఈ అంశాన్ని ఉపపేజీ కి అమలు చేసినపుడు, మాతృపేజీకి ఉండే ఆటోమాటిక్ లింకును పట్టించుకోదు. అంటే మాతృపేజీకి జరిగిన మార్పులు కనబడవు -మాతృపేజీకి కూడా లింకు ఉంటే తప్ప.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూస:H:f