సహాయం:వికీపీడియాలో ప్రయాణం గురించి పరిచయం/3
పరిచయం
పేరుబరులు
పేజీల్లో వెతకడం
దారిమార్పులూ షార్టుకట్లూ
పనికొచ్చే లింకులు
సారాంశం
|
ప్రతీపేజీ లోనూ పైన కుడి వైపున వెతుకు పెట్టె ఉంటుంది. అందులో టైపు చెయ్యడం మొదలు పెట్టగానే అది, సంబంధిత పేజీలను చూపించడం మొదలు పెడుతుంది; వాటిలో ఒకదానిపై నొక్కితే, ఆ పేజీకి నేరుగా తీసుకు వెళ్తుంది. లేదా, పేజీ పేరు పూర్తిగా టైపు చేసి, ↵ Enterకొడితే, నేరుగా ఆ పేజీకి తీసుకు వెళ్తుంది.
అన్వేషణ పేజీలో, మీ వెతుకులాటను కొన్ని పేరుబరులకు మాత్రమే పరిమితం చెయ్యవచ్చు. ముందే సెట్ చేసుకున్న వికల్పాన్ని (కంటెంటు పేజీలు, మల్టీమీడియా, అన్నీ) ఎంచుకోవచ్చు. లేదా కావాల్సిన పేరుబరులను ఎంచుకోవచ్చు.
వర్గాలుA simple category tree
పేజీలను కనుగొనడానికి మరొక పద్ధతి వర్గాలు. ఒకదానికొకటి సంబంధం ఉన్న పేజీలను సమూహాలుగా చేసే పద్ధతే వర్గీకరణ. ఈ వర్గాలు పేజీకి అడుగున ఉంటాయి. ఈ వర్గాలు - అత్యంత సామాన్యమైన స్థాయి నుండి అత్యంత ప్రత్యేకించిన స్థాయి వరకూ ఒక పారంపర్య వృక్షం లాగా ఉంటాయి. కాబట్టి పేజీల్లో అత్యంత ప్రత్యేక స్థాయి వర్గాలు మాత్రమే ఉండాలి. ఉదాహరణకు,
|