సహాయం:విజువల్ ఎడిటరుతో దిద్దుబాటు చెయ్యడం పరిచయం/విషయ ప్రాముఖ్యత క్విజ్
ఎడిటరును తెరవడం
పరికరాలపట్టీ ప్రాథమిక విషయాలు
లింకులు, వికీలింకులు
మార్పులను ప్రచురించడం
కొత్త వ్యాసాల సృష్టి
సారాంశం
|
ఫలానా లిమిటెడ్ అనే సంస్థ గురించి రాసిన ఒక వ్యాసంలో కింది నాలుగు మూలాలను ఉదహరించినట్లు భావించండి: ఫలానా వారి ఉత్పత్తితో పోల్చినపుడు, ప్రత్యర్థి సంస్థ వారి ఉత్పత్తిలో లేని లక్షణాన్ని ఎత్తిచూపుతూ ఈనాడు పత్రికలో, ఒకే వాక్యంలో సంస్థ ప్రస్తావన వచ్చిన వ్యాసం; ఎకనామిక్ టైమ్స్ వారి అనుబంధ బ్లాగులో టైమ్స్ ఉద్యోగి కాని వ్యక్తి, ఫలానా లిమిటెడ్ గురించి రాసిన విస్తారమైన వ్యాసం; టెక్ ఔత్సాహికుల బ్లాగులో ఈ సంస్థ ఉత్పత్తి గురించి వచ్చిన సమీక్షా వ్యాసం; సంస్థ తమ పేటెంటును ఉల్లంఘించిందని ఆరోపిస్తూ ఒక పోటీదారు వేసిన కోర్టు కేసు. ఈ వ్యాసానికి వికీపీడియా సాధారణ విషయ ప్రాముఖ్యత మార్గదర్శకంకు అనుగుణంగా ఫలానా లిమిటెడ్ సంస్థకు తగిన ప్రాముఖ్యత ఉన్నట్లేనా?సమాధానం లేదు, దానికి విషయ ప్రాముఖ్యత లేదు. విషయ ప్రాముఖ్యత ఉండాలంటే, ప్రతీ మూలం కూడా విస్తారంగా రాసి ఉడాలి, స్వతంత్ర మూలమై ఉండాలి, విశ్వసనీయమైనదై ఉండాలి ద్వితీయ స్థాయి మూలమై ఉండాలి.
|