సహాయం:విజువల్ ఎడిటరుతో బొమ్మల పరిచయం/2
పరిచయం
బొమ్మలు ఎక్కించడం
బొమ్మలను చేర్చడం
వివరాలను సవరించడం
గ్యాలరీలు
సారాంశం
|
![]() ![]() బొమ్మలను వికీమీడియా కామన్స్‌లో భద్రపరుస్తారు. వీటిని వివిధ భాషల వికీపీడియాల్లో వాడుకోవచ్చు. వికీపీడియా సోదర ప్రాజెక్టుల్లో కూడా వాడుకోవచ్చు.
![]() "ఎక్కించు" ట్యాబును నొక్కి మీ కంప్యూటరు లోని బొమ్మను ఎంచుకోండి (దస్త్రం పేరును టైపించండి లేదా బొమ్మను లాగి ఇక్కడీ పెట్టెలో పడెయ్యండి).
![]() దానికి వివరణను చేర్చండి. మరెవరైనా ఆ బొమ్మను వేరే ఏదైనా పేజీలో వాడదలిస్తే ఆ బొమ్మ దేని గురించో వాళ్లకు తెలుస్తుంది. ఇక్కడ మీరిచ్చే వివరణ కామన్సులో బొమ్మతో పాటు భద్రమౌతుంది కాబట్టి, ఈ బొమ్మను చేర్చిన వ్యాసంలో రాసే వివరణ కంటే విపులంగా ఇక్కడి వివరణ ఉండవచ్చు. ఈ బొమ్మకు వర్గాలను కూడా చేర్చవచ్చు. తద్వారా ఇతర వాడుకరులు దీన్ని కనుక్కోవడం తేలికౌతుంది.
ముఖ్యమైన ఆటంకం: వికీమీడియా కామన్సు లోకి ఎక్కించే బొమ్మలపై ఎక్కించే వారికి కాకుండా మరెవరికీ కాపీహక్కులు ఉండరాదు. ఎక్కించగానే, వాటిని ఎవరైనా వాడుకునేలా (Creative commons license) స్వేచ్ఛ పొందుతాయి. ఒకవేళ బొమ్మ కాపీహక్కుల స్వంతదారు మీరు కాని పక్షంలో, ఆ బొమ్మను వాడుకోవడం 'సదుపయోగం' కిందకు వస్తుందని మీరు భావిస్తే, ఆ బొమ్మను వికీపీడియా లోనే ఎక్కింపు విజార్డు ద్వారా భద్రపరచవచ్చు. అంతేగానీ, కామన్సు లోకి ఎక్కించరాదు. మరింత సమాచారం కోసం, Help:Introduction to images with Wiki Markup చూడండి.
|