సహాయం:IPA for English
వికీపీడియా అంతటా, ఆంగ్ల పదాల ఉచ్ఛారణ అంతర్జాతీయ ధ్వన్యాత్మక వర్ణమాల (IPA) ద్వారా తెలీయజేయబడి ఉంది. IPA యొక్క నిర్వచణం కొరకు, en:Help:IPA/Introduction చూడండి. ముఖ్యంగా, క్రింది పట్టిక వివిధ ఆంగ్ల ధ్వనుల సంబంధిత గుర్తులను సూచిస్తుంది; మరింత పూర్తి జాబితా కోసం, en:Help:IPA చూడండి, అందులో ఆంగ్ల భాషలో ఏర్పడని ధ్వనుల కుడా ఉన్నాయి. (IPA గుర్తులు మీ బ్రౌజర్లో సరిగ్గా కనపడకుంటే, వ్యాసం క్రిందన ఉన్న లింకులను చూడండి.)
మాండలిక వైవిధ్యాలు
[మార్చు]ఈ జాబితా ప్రామాణిక జనరల్ అమెరికన్, స్వీకరించిన ఉచ్చారణ, కెనడా ఆంగ్లం, దక్షిణాఫ్రికా ఆంగ్లం, ఆస్ట్రేలియన్ ఆంగ్లం, మరియు న్యూజీలాండ్ ఆంగ్లాల ఉచ్చారణలను చూపిస్తుంది. అన్ని వ్యత్యాసాలు ఏదో ఒక మాండలికానికి మాత్రమే కలిగినవి కావు.
- ఉదాహరణకు, cot /ˈkɒt/ నూ caught /ˈkɔːt/ నూ ఒకేవిధంగా పలికినప్పుడు, వ్రాత అచ్చులు o, au లను విలక్షణం చేయనట్లే, /ɒ/ మరియు /ɔː/ గుర్తుల మధ్య తేడా పట్టించుకోనవసరం లేదు.
- చాలా మాండలికాలలో, /r/ కేవలం అచ్చు తర్వాతనే వస్తుంది; ఈ మాండలికం ఉపయోగించేవారు, /r/ పలుకుట విడిచిపెట్టవచ్చు, ఉదా: cart /ˈkɑrt/.
- మరికొన్ని మాండలికాలలో, ఒకే ఉచ్చారణలో /j/ (య) /t, d, n/ వంటి అక్షరాల తరువాత రాలేదు (ట్య, డ్య వంటివి); ఉదాహరణకు కొంతమంది అమెరికన్లు, న్యూయార్క్ లోన yaను పలుకరు, /njuː/లో ఉన్న /j/ను మరవాలి.
అదేవిధంగా, కొందరు గ్రహించగలిగే విలక్షణాలు ఈ పట్టికలో ఉండకపోవచ్చు, ఎందుకంటే వికీపీడియా వాడే నిఘంటువులలో అవి చాలా తక్కువగా వాడబడతాయి:
- స్కాటిష్ మరియు ఐరిష్ fir, fur ఇంకా fern లలో అచ్చులలో ఉన్న భేదాలు.
- బ్రిటిష్ మఱియు వెల్ష్ "pain" ఇంకా "pane" లలో అచ్చులలో ఉన్న భేదాలు.
ఇతర మాటలలో వ్యక్తిని బట్టి వివిధ అచ్చులు ఉండవచ్చు. ఉదాహరణకు Bath (స్నానం) అసలకి /æ/ అచ్చు (catలో వలె) ఉండేది, కాని నేటి జనం చాలామంది /ɑː/ అచ్చును (fatherలో వలె) వాడుతున్నారు.
జాబితా
[మార్చు](SMALL CAPITALS దస్తూరిలో ఉన్న పదాలు ప్రామాణిక నిఘంటు సమితులు. BATH మఱియు CLOTH వంటి పదాలకు రెండు పలుకులు ఉంటాయి, వరుసగా ఒకదానికి /ɑː/ ఇంకా /æ/, మరొకదానికి /ɒ/ ఇంకా /ɔː/).
|
|
~ ఉన్నవి సుమారు శబ్దాలు, లేకుంటే ఖచ్చితమైనవి. తెలుగు ఉదాహరణలలో దోషం ఉందన్నా, మరొక ఉచ్చారణ ఉదాహరణ అవసరం అని భావించినా సహాయం చర్చ:IPA for Englishలో మాట్లాడండి.
వీటిని కూడా చూడండి
[మార్చు]- ఒకవేళ మీ బ్రౌసర్ IPA గుర్తులను ప్రదర్శించకపోతే, IPA కలిగి ఉన్న ఖతులను మీరు ఇంస్టాల్ చేయవలసి ఉంది. కొన్ని ఉచిత ఖతులు: జెంటియం మఱియు చారిస్ సిల్ (ఇంకాస్త పూర్తిది); దిగుమతి లింకులు ఆయా పేజీలలో లభిస్తాయి.
- వికీపీడియా కథనాలలో పరాయిభాష ఉచ్చారణలను జోడించడం కొరకు, {{IPA}} మూసను చూడండి.
- వికీపీడియా కథనాల IPA అక్షరాలు జోడించడం సూచన కోసం, వికీపీడియా శైలి సూచనలు చూడండి.