Jump to content

జల కన్యలు

వికీపీడియా నుండి
(సాగరకన్య నుండి దారిమార్పు చెందింది)
సాగర కన్య

జల కన్య లేక మత్స్య కన్య ప్రపంచంలోని అనేక సంస్కృతులకు చెందిన పురాణాల్లో వర్ణించబడిన జీవులు. అనగా నీటిలో నివసించే ఒక రకమైన జీవులు. ఇవి సగం మానవ రూపాన్ని సగం మత్స్య రూపాన్ని కలిగి ఉంటాయి , అనగా తలనుండి నడుము వరకు మనిషి రూపాన్ని నడుము నుండి చేప వలె తోక ఉంటుంది. వీటిలో జాతి విభేదము కూడా ఉంటుంది. సాధారణంగా ఇటువంటి జలచరాలను స్త్రీరూపంలోనే చిత్రిస్తారు. 2004 లో వచ్చిన సునామీలో అట్టడు సముద్ర గర్భంలోదాగి ఉన్న చేపలలో కొన్ని వాటికి మత్స్య కన్యల వలెనే రూపం ఉన్నట్లు ఒక అధ్యయనంలో తేలింది.[ఆధారం చూపాలి] [1] ఇటువంటి జీవులు సముద్ర గర్భంలో మాత్రమే తిరుగాడుతూ ఉంటాయని ఊహ. వాస్తవానికి జలకన్యలు పురాణ సంబంధమైన జీవులు మాత్రమే. సాహస వీరుడు-సాగరకన్య అను తెలుగు సినిమాలో శిల్పా కుంద్రా జలకన్యగా నటించింది.

కంబోడియా, థాయిలాండ్ రామాయణాల్లో సువన్నమచ్చ (బంగారు మత్స్య కన్య) అనే రావణుని కూతురు పాత్ర కనిపిస్తుంది. ఈ మత్స్య రాకుమారి హనుమంతుడు లంకకు వారధి కట్టకుండా ఆపేందుకు విఫలయత్నం చేస్తుంది కానీ చివరికి హనుమంతుని ప్రేమలో పడుతుంది. థాయ్ జానపదంలో ఈ పాత్ర చాలా ప్రాచుర్యం పొందింది.[2]

దర్శనాలు

[మార్చు]

1493లో అమెరికా ఖండపు తీరంలో సముద్రంపై ప్రయాణిస్తుండగా, క్రిస్టఫర్ కొలంబస్ సముద్రం నుండి మూడు స్త్రీరూపం కలిగిన జీవులు సముద్రం నుండి పైకి ఎగసిపడ్డాయని, కాకపోతే అవి అందరూ వర్ణించినంత అందంగా ఏమీలేవని నివేదించారు. శివ మోర్చా గారు [3][4]

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ఆధారం Archived 2014-07-13 at the Wayback Machine, అదనపు పాఠ్యం.
  2. Sastri, Satyavrat (1982). Studies in Sanskrit and Indian culture in Thailand. Parimal Publications. p. 63. Retrieved 24 July 2012.
  3. Klein, Karin (2012-07-05). "No mermaids, no zombies, feds say. Who's next – Tinkerbell?". Los Angeles Times. Archived from the original on 2012-07-21. Retrieved 2012-07-21.
  4. Walker, Sally M. (1999). Manatees. Minneapolis: Carolrhoda Books. p. 7. ISBN 1-57505-299-7.

యితర లింకులు

[మార్చు]
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.
"https://te.wikipedia.org/w/index.php?title=జల_కన్యలు&oldid=4072416" నుండి వెలికితీశారు