Jump to content

సాత్నాల ప్రాజెక్టు

అక్షాంశ రేఖాంశాలు: 19°26′0″N 79°13′26″E / 19.43333°N 79.22389°E / 19.43333; 79.22389
వికీపీడియా నుండి

సాత్నాల ప్రాజెక్టు (ఆంగ్లం Sathnala Project) తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మండలంలోని కంప్పా (మేడిగూడ) గ్రామ సమీపంలోని పెన్ గంగ నదికి ఉపనది అయిన సాత్నాల వాగు పై నిర్మించబడిన మధ్యస్థ నీటిపారుదల ప్రాజెక్టు.[1] సాత్నాల అంటే ఏడు వాగుల సముహమని అర్థం.1976లో ఈ ప్రాజెక్టు నిర్మిణమునకు శంకుస్థాపన చేశారు[2][3][4].

సాత్నాల ప్రాజెక్టు
సాత్నాల ప్రాజెక్ట్
Sathnala Project
సాత్నాల ప్రాజెక్టు is located in Telangana
సాత్నాల ప్రాజెక్టు
Telangana లో సాత్నాల ప్రాజెక్టు స్థానం
సాత్నాల ప్రాజెక్టు is located in India
సాత్నాల ప్రాజెక్టు
సాత్నాల ప్రాజెక్టు (India)
అధికార నామంసాత్నాల ప్రాజెక్ట్
Sathnala Project
ప్రదేశంకంప్పా గ్రామం, జైనాథ్ మండలం, ఆదిలాబాద్ జిల్లా,తెలంగాణ,ఇండియా
అక్షాంశ,రేఖాంశాలు19°26′0″N 79°13′26″E / 19.43333°N 79.22389°E / 19.43333; 79.22389
ప్రారంభ తేదీడిసెంబర్ 17, 1976
నిర్మాణ వ్యయం3,22 లక్షల కోట్లు
ఆనకట్ట - స్రావణ మార్గాలు
నిర్మించిన జలవనరుసాత్నాల వాగు (నది)
Height18 మీటర్లు (59 అడుగులు)
పొడవు1,012 మీటర్లు (3,320 అడుగులు)
జలాశయం
సృష్టించేదిసాత్నాల జలాశయం

చరిత్ర

[మార్చు]

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదిలాబాదు జిల్లా రైతుల పోలములకు నీరందించ డానికి 17 డిసెంబరు 1976లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ఆదిలాబాదు తాలుకా లోని సాత్నాల వాగు పై ప్రాజెక్టు నిర్మాణమునకు శంకుస్థాపన చేశారు. నిర్మాణమునకు ఇంజనీర్లతో ₹=3,22,00,000 వ్యయమను అంచనా వేసి 19 వేల ఎకరాల భూమిని నీరు అందించేందుకు ధ్యేయంగా ప్రణాళికను రుపొందించారు. సకాలంలో ప్రాజెక్టు పూర్తి చేయకపోవడం వలన వ్యయపు అంచనాలు తారుమారైనవి.1999లో 25 కోట్ల రూపాయల వ్యయముతో పూర్తి అయినది.ఈ ప్రాజెక్టుతో 24 వేల ఎకరాల భూమికి నీటి సరఫరాకు అవకాశం ఉంది. 1987 లో 3700 ఎకరములు,1989లో 6500 ఎకరములు నీటి సరఫరాకు గాను, 20 డిసెంబరు 1988 లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు ప్రాజెక్టు నీటి విడుదల ప్రారంభించారు[5].

ప్రాజెక్టు వివరాలు

[మార్చు]

ఈ సాత్నాల ప్రాజెక్టు జైనాథ్ మండలంలోని కంపా (మెడిగూడ) గ్రామ సమీపంలో ఉంది. ఇది మండల కేంద్రమైన జైనాథ్ నుండి 9 కి.మీ. దూరం లోను, జిల్లా కేంద్రం ఆదిలాబాదుకు 25 కి.మీ. దూరంలోనూ ఉంది. ఈ ప్రాజెక్టు పైన్ గంగానదికి ఉపనది యైన సాత్నాల వాగు (నది) పై మట్టి,రాతి కట్టడంతో నిర్మించారు. కుడికాలువ పొడవు 36కి.మీటర్లు ఈ కాలువ డిస్ట్రిబ్యూటర్లు కలిగి 20,650 ఎకరములకు నీరు అందించే స్థితిలో ఉంది. ఎడుమ కాలువ 64 కి.మీటర్లు నిడివి కల్గి ఉంది. 3350 ఎకరములకు నీరు అందించే సామర్థ్యంను కలిగి ఉంది[6].

నీటి మట్టం

[మార్చు]

ఈ ప్రాజెక్టు మధ్యస్థ సాగునీటి ప్రాజెక్టు 24000 వేల ఎకరాలకు సాగునీటిని అందిస్తుంది. ఆదిలాబాద్ జిల్లా లోని జైనాథ్,బేల మండలంలోని 35 గ్రామాలు కుడి ఎడమ కాలువ నీటిని వినియోగించి లాభం చేకు ర్చుతుంది. మొత్తం నాల్గు గేట్లతో ఉంది.ప్రస్తుతం 284‌.60 మీటర్ల ఎత్తులో 0.834 టీఎంసీ నీటి నిల్వ ఉన్నాయి[7].

మూలాలు

[మార్చు]
  1. ABN (2021-06-26). "సాత్నాల ప్రాజెక్టుకు జలకళ". Andhrajyothy Telugu News. Retrieved 2024-07-28.
  2. Today, Telangana (2024-04-09). "Water levels in irrigation projects dip drastically in erstwhile Adilabad". Telangana Today (in ఇంగ్లీష్). Retrieved 2024-07-28.
  3. telugu, NT News. "Satnala Project Latest News in Telugu, Satnala Project News, Satnala Project Online News Live, Satnala Project Updates | Namasthe Telangana". www.ntnews.com. Retrieved 2024-07-28.
  4. "Shathanala Project DAM". Monuments (in ఇంగ్లీష్). 2017-01-28. Retrieved 2024-07-28.
  5. India, The Hans (2015-03-09). "Ryots root for completion of Satnala project work". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2024-07-28.
  6. "Shathanala Project DAM". Monuments (in ఇంగ్లీష్). 2017-01-28. Retrieved 2024-07-28.
  7. "Adilabad: ప్రాజెక్టులకు జల కళ.. ఉధృతంగా ప్రవహిస్తున్న నదులు." News18 తెలుగు. 2021-07-25. Retrieved 2024-07-28.