సాద్ నసిమ్
వ్యక్తిగత సమాచారం | |
---|---|
పూర్తి పేరు | హఫీజ్ సాద్ నసిమ్ |
పుట్టిన తేదీ | లాహోర్, పంజాబ్, పాకిస్తాన్ | 1990 ఏప్రిల్ 29
బ్యాటింగు | కుడిచేతి వాటం |
బౌలింగు | లెగ్ బ్రేక్ |
పాత్ర | ఆల్ రౌండర్ |
అంతర్జాతీయ జట్టు సమాచారం | |
జాతీయ జట్టు | |
తొలి వన్‌డే (క్యాప్ 201) | 2015 ఏప్రిల్ 17 - బంగ్లాదేశ్ తో |
చివరి వన్‌డే | 2015 ఏప్రిల్ 22 - బంగ్లాదేశ్ తో |
తొలి T20I (క్యాప్ 59) | 2014 అక్టోబరు 5 - ఆస్ట్రేలియా తో |
చివరి T20I | 2014 డిసెంబరు 5 - న్యూజీలాండ్ తో |
దేశీయ జట్టు సమాచారం | |
Years | Team |
2007/08–2011/12 | Lahore Ravi |
2009/10–2012/13 | WAPDA |
2008/09– | Lahore Shalimar |
2009/10–2015/16 | Lahore Lions |
2011 | Pakistan A |
2016–2017 | Quetta Gladiators (స్క్వాడ్ నం. 34) |
2018– | Peshawar Zalmi (స్క్వాడ్ నం. 34) |
2019–present | Central పంజాబ్ |
మూలం: ESPNcricinfo, 2014 సెప్టెంబరు 20 |
సాద్ నాసిమ్ (జననం 1990, ఏప్రిల్ 29) పాకిస్తాన్ కు చెందిన క్రికెట్ ఆటగాడు. కుడిచేతి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్, లెగ్‌బ్రేక్ స్పిన్ బౌలర్ గా రాణించాడు. డబ్ల్యూఎపిడిఎ క్రికెట్ జట్టు, పాకిస్తాన్ ఎ, లాహోర్ లయన్స్ కొరకు దేశీయ క్రికెట్ ఆడాడు.[1] పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో క్వెట్టా గ్లాడియేటర్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు.
క్రికెట్ రంగం
[మార్చు]2014 అక్టోబరులో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ తరపున ట్వంటీ20 అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.[2] 2015 ఏప్రిల్ లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ తరపున తన వన్డే అంతర్జాతీయ అరంగేట్రం చేసాడు.[3]
2017-18 క్వాయిడ్-ఎ-అజం ట్రోఫీలో లాహోర్ బ్లూస్ తరపున పది మ్యాచ్‌లలో 561 పరుగులతో అత్యధిక పరుగుల స్కోరర్‌గా నిలిచాడు.[4] ఘనీ గ్లాస్ క్రికెట్ టీమ్ తరపున కూడా ఆడాడు.
2018 ఏప్రిల్ లో 2018 పాకిస్తాన్ కప్ కోసం ఫెడరల్ ఏరియాస్ జట్టులో ఎంపికయ్యాడు.[5][6] 2018–19 క్వాయిడ్-ఎ-అజామ్ వన్ డే కప్‌లో లాహోర్ బ్లూస్ తరపున ఏడు మ్యాచ్‌లలో 316 పరుగులతో అత్యధిక పరుగుల స్కోరర్‌గా నిలిచాడు.[7] 2018-19 క్వాయిడ్-ఎ-అజం ట్రోఫీలో లాహోర్ బ్లూస్ తరపున పది మ్యాచ్‌లలో 469 పరుగులతో అత్యధిక పరుగుల స్కోరర్‌గా నిలిచాడు.[8]
2019 సెప్టెంబరులో 2019–20 క్వాయిడ్-ఇ-అజం ట్రోఫీ టోర్నమెంట్ కోసం సెంట్రల్ పంజాబ్ జట్టులో ఎంపికయ్యాడు.[9][10] 2021 జనవరిలో 2020–21 పాకిస్తాన్ కప్ కోసం సెంట్రల్ పంజాబ్ జట్టులో ఎంపికయ్యాడు.[11][12]
మూలాలు
[మార్చు]- ↑ "Profile: Saad Nasim". ESPNcricinfo. Retrieved 2023-09-02.
- ↑ "Australia tour of United Arab Emirates, Only T20I: Pakistan v Australia at Dubai (DSC), Oct 5, 2014". ESPN Cricinfo. Retrieved 2023-09-02.
- ↑ "Pakistan tour of Bangladesh, 1st ODI: Bangladesh v Pakistan at Dhaka, Apr 17, 2015". ESPN Cricinfo. Retrieved 2023-09-02.
- ↑ "Quaid-e-Azam Trophy, 2017/18: Lahore Blues Batting and bowling averages". ESPN Cricinfo. Retrieved 2023-09-02.
- ↑ "Pakistan Cup one-day tournament to begin in Faisalabad next week". Geo TV. Retrieved 2023-09-02.
- ↑ "Pakistan Cup Cricket from 25th". The News International. Retrieved 2023-09-02.
- ↑ "Quaid-e-Azam One Day Cup, 2018/19 - Lahore Blues: Batting and bowling averages". ESPN Cricinfo. Retrieved 2023-09-02.
- ↑ "Quaid-e-Azam Trophy, 2018/19 - Lahore Blues: Batting and bowling averages". Retrieved 2023-09-02.
- ↑ "PCB announces squads for 2019-20 domestic season". Pakistan Cricket Board. Retrieved 2023-09-02.
- ↑ "Sarfaraz Ahmed and Babar Azam to take charge of Pakistan domestic sides". ESPN Cricinfo. Retrieved 2023-09-02.
- ↑ "Pakistan Cup One-Day Tournament promises action-packed cricket". Pakistan Cricket Board. Retrieved 2023-09-02.
- ↑ "Pakistan Cup One-Day Tournament: Fixtures Schedule, Teams, Player Squads – All you need to Know". Cricket World. Retrieved 2023-09-02.