సాధ్ బెలో
సాధ్ బెలో | |
---|---|
سادھ بھيلو | |
భౌగోళికం | |
భౌగోళికాంశాలు | 27°41′37.6″N 68°52′43.5″E / 27.693778°N 68.878750°E |
దేశం | పాకిస్థాన్ |
రాష్ట్రం | సింధూ రాష్ట్రం |
జిల్లా | సుక్కుర్ |
సంస్కృతి | |
దైవం | శివుడు |
ముఖ్యమైన పర్వాలు | శివరాత్రి, బంఖండి మహారాజ్ మేళా (బంఖండి మహారాజ్ వర్ధంతి) |
వాస్తుశైలి | |
దేవాలయాల సంఖ్య | 9 |
చరిత్ర, నిర్వహణ | |
నిర్వహకులు/ధర్మకర్త | పాకిస్థాన్ హిందూ కౌన్సిల్ |
వెబ్‌సైట్ | http://www.pakistanhinducouncil.org/ |
సాధ్ బెలో (ఉర్దూ: سادھ يلو, సింధీ: ساڌ يلو) లేదా సత్ అని పిలువబడే హిందూ దేవాలయం, పాకిస్తాన్‌లోని సుక్కుర్ సమీపంలో గల సింధు నదిలో ఉన్న ఒక ద్వీప ప్రాంతంలో ఉంది. ఈ ద్వీపం అత్యంత ప్రసిద్ధి చెందిన హిందూ దేవాలయాలను కలిగి ఉంది. ఈ ద్వీపంలోని ఆలయాలు సమకాలీన ఉద్యమంతో ముడిపడి ఉన్నాయి. ఈ ద్వీపం తీరత్ ఆస్థాన్‌కు ప్రసిద్ధి చెందింది, ఇక్కడ ఉన్న దేవాలయం పాకిస్తాన్‌లోని అతిపెద్ద హిందూ దేవాలయం. ఈ సముదాయంలో ఎనిమిది ఇతర దేవాలయాలు, గ్రంథాలయం, భోజనశాలలు, ఉద్యానవనం, విహారయాత్ర కోసం వచ్చిన ప్రజలకు వసతి గదులు ఉన్నాయి.[1][2][3]
వ్యుత్పత్తి శాస్త్రం
[మార్చు]ఈ ద్వీపం ఒకప్పుడు అటవీ ద్వీపంగా ఉండేది, దీనిని మేనక్ పర్బత్ అని పిలిచేవారు. తరువాత ఒక సాధువు బాబా బంఖండి మహారాజ్ ఇక్కడ స్థిరపడ్డాడు, తద్వారా ఈ ప్రదేశం సాధు భేలోగా ప్రసిద్ధి చెందింది. సాధు బేల అనే పదానికి సాధువుల అడవులు అని అర్థం.[4]
భౌగోళికం
[మార్చు]సాద్ బెలో ద్వీపం బుక్కుర్ ద్వీపం కు దిగువన ఉంది. ఇది దాని నుండి ఒక చిన్న నది ద్వారా వేరు చేయబడుతుంది. ఇది రోహ్రి, సుక్కుర్ ద్వారా ప్రవహించే సింధు నదిపై ఉంది. ఆలయ సముదాయం రెండు పరస్పరం అనుసంధానించబడిన ద్వీపాలతో విస్తరించి ఉంది. సాద్ బేలో వంటగది, వరండా లలో అనేక దేవాలయాలు, దీన్ బెలో సమాధిలు, పార్క్, రిషి నోల్ మందిర్ లు ఉన్నాయి.[5]
మతపరమైన ప్రాముఖ్యత
[మార్చు]బాబా బంఖండి మహారాజ్, 15 ఏళ్ల ఆధ్యాత్మిక అన్వేషకుడు. ఇతను ఢిల్లీకి సమీపంలోని కేరో ఖేతార్ నుండి 1823లో సింధ్‌కు చేరుకున్నాడు. సుక్కుర్ పట్టణంలో ఇది ఉపఖండానికి ప్రధాన వ్యాపార కేంద్రంగా ఉంది. అతను అటవీ ద్వీపమైన మేనక్ పర్వత్‌లో (ఇది సాధు బేలా అసలు పేరు) స్థిరపడి, ఈ అడవుల్లో ఋషిగా ప్రసిద్ధి చెందాడు. బాంఖండి మొదట అక్కడికి వచ్చినప్పుడు ఆ ద్వీపం కేవలం చెట్ల గుట్టగానే ఉంది, కానీ అతను ఆ స్థలాన్ని ఎంతగానో ఇష్టపడి తన నివాసం ఏర్పాటు చేయడానికి దానిని ఎంచుకున్నాడు. ఒకసారి బాబా బంఖండికి కలలో అన్నపూర్ణ దేవి కనిపించి, కమండల్ అనే ఒక దీర్ఘచతురస్రాకార లోహపు వస్తువును ఇచ్చి, ఈ వస్తువు నీ దగ్గర ఉన్నంత వరకు, ఆహార ధాన్యానికి కొరత ఉండదని చెప్పింది. తరువాత, బాబా బాంఖండి అన్నపూర్ణ దేవి, ఆంజనేయుడు, వినాయకుడు, శంఖరుడి దేవాలయాలను, గ్రంథ్ సాహిబ్, భగవద్గీత పారాయణ స్థలాలను స్థాపించాడు. బాబా బాంఖండి 60 సంవత్సరాల వయస్సులో మరణించాడు. బాబా బాంఖండికి చాలా మంది శిష్యులు ఉన్నారు, వారు అతని తరువాత ఒక్కొక్కరుగా మహంత్ లేదా స్థల సంరక్షకుడిగా ఉన్నారు. వారిలో ప్రముఖులు స్వామి అచల్ ప్రసాద్, స్వామి మోహన్ దాస్, స్వామి హర్నరైన్ దాస్ ఉదాసిన్.[6]
దేవాలయాలు
[మార్చు]బాబా బంఖండి మహారాజ్ వార్షిక వర్ధంతిని బాబా బంఖండి మహారాజ్ మేళ అని పిలుస్తారు. దేశ విదేశాల నుండి వేలాది మంది హాజరవుతారు ఈ మేళాకు హాజరవుతారు. ఆ సమయంలో యాత్రికులకు ఉచిత వసతి, ఆహారం, నీరు అందిస్తారు. ఆ కార్యక్రామాన్ని మూడు రోజుల పండుగగా జరుపుకుంటారు. సాధు బెలో ప్రత్యేక లక్షణం ఏమిటంటే, ఈ ప్రదేశంలో పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్ భాష అయిన సింధీలో అనేక ప్రార్థనలు, గ్రంథాలు వ్రాయబడ్డాయి. భద్రతా వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది, అనుమతి లేకుండా ఎవరూ ఆలయంలోకి ప్రవేశించలేరు లేదా సందర్శించలేరు. ఈ ఆలయాన్ని సందర్శించడానికి పాకిస్తాన్ హిందూ కమిటీ నుండి అనుమతి పొందాలి. సాద్ బెలో పాకిస్తాన్‌లో అతిపెద్ద దేవాలయం కాబట్టి హిందువులు కాని వారికి, అనుమతి లేకుండా భద్రతా వ్యవస్థ ఆలయ ప్రవేశం చేయనివ్వదు. [7][8]
తరతరాలుగా ఆలయ సముదాయాన్ని నిర్వహిస్తున్న కుటుంబం 'గడ్డి నషీన్' 1947లో విభజన తర్వాత భారతదేశానికి తరలివెళ్లారు. కానీ కుటుంబ సభ్యులు ఇప్పటికీ సంవత్సరానికి ఒకసారి పాకిస్తాన్‌కు వెళ్లి అధికారికంగా జాతరను నిర్వహిస్తారు. ప్రస్తుతం, సద్ బెలో ఇవాక్వీ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డ్ కస్టడీలో ఉంది.
మూలాలు
[మార్చు]- ↑ Kothari, Rita (2007). The burden of refuge: the Sindhi Hindus of Gujarat. Orient Longman. ISBN 9788125031574.
- ↑ Thakur, U. T. (1959). Sindhi Culture. University of Bombay.
- ↑ "Sadhu Bela: Pakistan's temple island you won't forget". gulfnews.com (in ఇంగ్లీష్). Retrieved 2019-07-14.
- ↑ "Sadhu Bela: Pakistan's temple island you won't forget". Retrieved 2 March 2020.
- ↑ "Sadhu Bela the island of Sukkur". Daily Times. September 15, 2017.
- ↑ "Sadhu Bela: Pakistan's temple island you won't forget". gulfnews.com.
- ↑ "Baba Bankhandi Maharaj Mela attended by thousands of Hindus | Pakistan Today". www.pakistantoday.com.pk.
- ↑ "Hindus pay homage at Sadh Belo temple". Express Tribune. 21 June 2016. Retrieved 12 September 2017.