సానివారు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆంధ్ర దేశంలో దేవ దాసీలూ, భోగం సానులూ వుండటం చాల మందికి తెలుసు. కాని మరి కొందరు సానులు కూడా జాతి జీవనంలో కళా సంస్కృతులకు దోహదం చేశారు. పూర్వకాలం నుంచీ కొన్ని కులాలలో ఆడ పిల్లలను అవివాహితలు గానే విడిచి పెట్టే ఆచారం దేశంలో ఉంది. అయితే అవివాహితలు విచ్చల విడితనం లేకుండా కట్టుబాట్లకు లోబడి సామాజిక కార్యక్రమాలను నెరవేర్చే వారు. ఆనాటి మూడ నమ్మకాలతో వున్న గ్రామీణ ప్రజలు నిర్వహించే జాతర్లలో, దేవతల కొలువుల్లో జరప వలసిన తంతును వీరే నిర్వహించేవారు. ప్రత్యేక నృత్యాలను వీరే చేసే వారు. ఈ నాటికీ జక్కుల సాని, బసివి, మాతంగి మొదలైన వారి జీవిత చరిత్రలు పరిశీలిస్తే పురాతన సాంఘిక నియమాల వల్లే సాని వారిగా ఏర్పడ్డారని తెలుస్తుంది. క్రిందటి శతాబ్దంలో జనాభా లెక్కలు తీసుకున్నప్పుడు ఆరు తెగల సానులు లెక్కకు వచ్చి నట్లు ఆరుద్ర గారు పరిశీలించారు. వారు తురక సానులూ, గొమ్మన సానులూ, భోగం సానులూ, మంగల భోగాలూ, మాదిగ భోగాలూ అనే ఆరు తెగల సానులు లెక్కకు వచ్చారు. వీరందరూ నృత్య సంప్రదాయలను పోషించిన వారే.

సూచికలు[మార్చు]

యితర లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=సానివారు&oldid=2141853" నుండి వెలికితీశారు