సాఫ్ట్‌నెట్ (మనటీవీ)
Jump to navigation
Jump to search
సాఫ్ట్‌నెట్ (మనటీవీ) | |
---|---|
![]() | |
సంస్థ వివరాలు | |
చట్టపరిధి | తెలంగాణ ప్రభుత్వం |
ప్రధానకార్యాలయం | హైదరాబాద్తెలంగాణ |
Minister responsible | కల్వకుంట్ల తారక రామారావు |
వెబ్‌సైటు | |
అధికారిక వెబ్ సైట్ |
సాఫ్ట్‌నెట్ (మనటీవీ) (సొసైటీ ఫర్ తెలంగాణ స్టేట్ నెట్‌వర్క్) అనేది తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వ సమాచార శాఖ ద్వారా నడుపబడుతున్న టీవీ ఛానల్. గ్రామీణ ప్రాంతాల్లోని వారికి సాంకేతికత పరిజ్ఞానంతో, నాణ్యమైన ప్రమాణాలతో వారికవసరమైన సమాచారాన్ని లక్ష్యంతో ఈ సాఫ్ట్‌నెట్ ను ప్రారంభించడం జరిగింది.[1]
లక్ష్యాలు[2][మార్చు]
- తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సాంకేతిక, ఉపగ్రహ సమాచార ఉపయోగించి, వారికి తగిన విజ్ఞానాన్ని అందించి విద్యావంతులను చేయడం
- ప్రతి తరగతి ఉత్తమ అధ్యాపకులను ఎంచుకొని వారి ద్వారా మానసిక స్థైర్యం, సులభ పద్ధతులు, సమకాలీన ప్రపంచ పోకడల గురించి చెప్పడం
- విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ, సరైన మార్గదర్శకత్వాలు అందించి వృత్తిలో ఎదిగేలా చేయడం
- పోటీ పరీక్షలలో, వృత్తి శిక్షణలో, నైపుణ్య అభివృద్ధి శిక్షణలో, ఉపాధి అవకాశాల గురించి చెప్పడం
- ప్రభుత్వ శాఖలు సిబ్బందికి వారివారి పనులలో శిక్షణ ఇచ్చి, ఆ పనులలో పరిపూర్ణతను తేవడం
- అవినీతి, పనుల నిర్వాహణలో జాప్య విముక్తికై ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా పనిచేయడం
- ఆరోగ్య, పరిశుభ్రత, వస్త్రాల గురించి తెలంగాణ ప్రజలకు బోధించి ఆరోగ్య పరిరక్షణను మెరుగు పరచడం
- శాంతి భద్రతల, నేరాల విషయంలో ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత తెలంగాణ నిర్మించడం
ఇతర కార్యక్రమాలు[మార్చు]
- సాఫ్ట్‌నెట్- మనటీవీ ద్వారా గ్రూప్ 2 అభ్యర్థులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాల ప్రసారం[3][4]
- మనటీవీలో ఐఐటీ, నీట్, ఎంసెట్ శిక్షణ[5]
మూలాలు[మార్చు]
- ↑ సాఫ్ట్‌నెట్ (మనటీవీ). "ABOUT US". softnet.telangana.gov.in. Retrieved 26 March 2017.
- ↑ సాఫ్ట్‌నెట్ (మనటీవీ). "Vision". softnet.telangana.gov.in. Retrieved 26 March 2017.
- ↑ సాక్షి. "6 వేల పాఠశాలల్లో డిజిటల్ క్లాసులు". Retrieved 26 March 2017.
- ↑ కెసిఆర్ అభిమాన సంఘం. "గ్రామీణ నిరుద్యోగులకు 'మనటీవీ' శిక్షణ". /kcrabhimanasangham.com. Retrieved 26 March 2017.[permanent dead link]
- ↑ kabconsultants. "మనటీవీలో ఐఐటీ, నీట్, ఎంసెట్ శిక్షణ". kabconsultants.com. Retrieved 26 March 2017.