సారిక(నటి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సారిక

2010లో సారిక
జననం (1960-12-05) 1960 డిసెంబరు 5 (వయసు 63)
క్రియాశీలక సంవత్సరాలు 1967—ప్రస్తుతం
భార్య/భర్త
(m. 1988; div. 2004)
పిల్లలు శృతి హాసన్
అక్షర హాసన్

సారిక (జననం 1960 డిసెంబరు 5) భారతీయ నటి. ఆమె కమల్ హాసన్ మొదటి భార్య, శృతి హాసన్ కు తల్లి. ఆమె అసలు పేరు సారికా ఠాకూర్.

తొలినాళ్ళ జీవితం[మార్చు]

సారిక ఢిల్లీలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు మరాఠీ,  రాజపుత్ర  వంశాలకు చెందినవారు.[1] సారిక చిన్నతనంలోనే ఆమె  తండ్రి వారి కుటుంబాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. దానితో కుటుంబాన్ని పోషించేందుకు ఆమె పని చేయక తప్పలేదు. ఆమె అసలు పాఠశాలకే వెళ్ళలేదు. 

కెరీర్[మార్చు]

సారిక తన 4వ ఏటనే సినిమాల్లో బాలనటిగా మారింది.[2] 1960ల్లో బాలీవుడ్ సినిమాల్లో బాలనటిగా కెరీర్ మొదలు పెట్టింది ఆమె. 1967లో ఆమె బాల్య నటిగా నటించిన హంరాజ్ సినిమా మంచి విజయవంతమైంది. ఆ సినిమాలో ఆమె నటి విమీ కూతురుగా నటించింది. ఆమె ఎన్నో బాలల చిత్రాల్లో (ఆశీర్వాద్) నటించింది. ఆ తరువాత ఆమె రాజశ్రీ ప్రొడక్షన్స్ లో ఎన్నో సినిమాల్లో నటించింది. నటుడు సచిన్సరసన ఎన్నో హిందీ, మరాఠీ సినిమాల్లో నటించింది. వారిద్దరూ కొంత  కాలం డేటింగ్ కూడా చేశారు. సచిన్ తో విడిపోయాకా, నటుడు, మోడల్  అయిన దీపక్ ప్రశార్ తో కొన్నాళ్ళు డేటింగ్ చేసింది. సారికకు కరిష్మా  సినిమా ద్వారా కమల్ హాసన్ పరిచయం అయిన, వారిద్దరూ  సన్నిహితం అయ్యారు.

మూలాలు[మార్చు]

  1. "I get devastated at the idea of marriage: Shruti Haasan". Retrieved 18 January 2014.
  2. "Times of India". Times of India. p. 6. Retrieved 31 March 2014.