Jump to content

సాల్బాయ్ సంధి

వికీపీడియా నుండి

 

సాల్బాయ్ సంధి
సందర్భంమొదటి ఆంగ్ల మరాఠా యుద్ధం
సంతకించిన తేదీ17 May 1782 (1782-05-17)
స్థలంగ్వాలియర్
సంతకీయులు
కక్షిదారులు
భాషలుఇంగ్లీషు, మరాఠీ
సాల్బాయ్ సంధి at Wikisource

వారెన్ హేస్టింగ్స్, మహదాజీ షిందే మధ్య జరిగిన మొదటి ఆంగ్లో-మరాఠా యుద్ధ ఫలితాన్ని పరిష్కరించేందుకు సుదీర్ఘ చర్చల తర్వాత మరాఠా కాన్ఫెడరసీ, ఈస్టిండియా కంపెనీల ప్రతినిధులు 1782 మే 17 న సాల్బాయ్ ఒప్పందంపై సంతకం చేశారు. దాని నిబంధనల ప్రకారం, కంపెనీకి సాల్సెట్, బ్రోచ్‌పై నియంత్రణ చేకూరింది. మరాఠాల నుండి, మైసూర్‌కు చెందిన హైదర్ అలీని ఓడించి కర్ణాటకలోని భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకుంటారని హామీ పొందింది. ఫ్రెంచ్ వారిని తమ భూభాగాల్లో స్థిరనివాసాలు ఏర్పాటు చేయకుండా నిషేధిస్తామని కూడా మరాఠాలు హామీ ఇచ్చారు. ప్రతిగా, బ్రిటిషు వారు తమ ఆశ్రితుడైన రఘునాథ రావుకు పెన్షన్ ఇచ్చేందుకు అంగీకరించారు. మాధవరావు IIను మరాఠా సామ్రాజ్యపు పీష్వాగా అంగీకరించారు. బ్రిటిషు వారు జమ్నా నదికి పశ్చిమాన మహద్జీ షిండే కి చెందునట్లుగా గుర్తించారు. పురందర్ ఒప్పందం తర్వాత బ్రిటిషు వారు ఆక్రమించిన అన్ని భూభాగాలను తిరిగి మరాఠాలకు ఇచ్చారు.

1802 లో రెండవ ఆంగ్లో-మరాఠా యుద్ధం ప్రారంభమయ్యే వరకు, మరాఠా సమాఖ్య [1] ఈస్టిండియా కంపెనీల మధ్య శాంతి నెలకొనడానికి సాల్బాయ్ ఒప్పందం తోడ్పడింది. ఈస్టిండియా కంపెనీ తరపున డేవిడ్ ఆండర్సన్, సాల్బాయ్ ఒప్పందాన్ని కుదిర్చాడు.[2]

సాల్బాయ్ ఒప్పందంపై సంతకం చేయడాన్ని వర్ణించే కుడ్యచిత్రం

మూలాలు

[మార్చు]
  1. Olson and Shadle, p. 706.
  2. Proceedings of the session. Volume 12. Indian Historical Records Commission. 1930.p. 115