సింధు లోయ నాగరికతకు చెందిన ఆవిష్కరణల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ జాబితా ప్రధానంగా సింధులోయ నాగరికతకు సంబంధించిన శాస్త్ర సాంకేతిక, నాగరికతపరమైన ఆవిష్కరణలను గురించి తెలుపుతుంది. ఈ నాగరికత చాలా ప్రాచీనమైనది, ప్రస్తుత పాకిస్తాన్, వాయవ్య భారతదేశంలోని ప్రాంతాల్లో విలసిల్లింది. ఈ నాగరికతకు ఘాగ్ర-హక్కర్ నాగరికత, హరప్పా నాగరికత అని కూడా పేర్లున్నాయి.

నూతన కల్పనలు[మార్చు]

  • కొందరు నిపుణుల ప్రకారం ప్రజాస్వామ్య వ్యవస్థ, న్యాయ పరిపాలన ఈ నాగరికత లోనే మొదలయ్యాయని, ఇది గ్రీకు నాగరికతకన్నా పాతదని గుర్తిస్తున్నారు.
  • గుండి/బొత్తం, అలంకరణకు వాడే బొత్తాలు : గవ్వలతో తయారు చేసిన బొత్తాలను సింధు లోయ నాగరికత కాలపు ప్రజలు క్రీ.పూ. 2000 నాటికే వాడేవారు. కొన్ని బొత్తాలు వివిధ జ్యామితీయ ఆకృతులలో ఉండేవి, వాటిని బట్టలకు కుట్టి ఉంచే విధంగా బొత్తాలకు రంధ్రాఉ కూడా ఉండేవి. ఇయాన్ మెక్నీల్ ప్రకారం గుండీలను కట్టి ఉంచే ఉపకరణం కన్నా ఎక్కువగా ఆభరణంగా వాడేవారు. వీటిలో అత్యంత పురాతనమైనవి మొహెంజో దారోలో లభ్యమయ్యాయి, అవి గుండ్రటి గవ్వలతో తయారై, 5000 సంవత్సరాలు పాతవని ఒక నిర్ధారణ జరిగింది. [1]
  • కొలబద్ద : నేటి వరకు కనుగొన్నవాటిలో అత్యంత పురాతన కొలబద్ద రాగి మిశ్రలోహంతో తయారయింది. దీనిని జెర్మనీకి చెందిన పురాశాస్త్రవేత్త ఎకర్డ్ ఉంగెర్ నిప్పూర్ లో జరిగిన తవ్వకాలలో కనుగొన్నారు. ఇది క్రీ.పూ. 2650 కి చెందినది. ఉంగెర్ ఇది ఒక కొలమానంగా వాడబడిందని చెబుతారు. [2]
  • మెట్లబావి : పాకిస్తాన్ లోని మొహెంజొదారోలో, భారతదేశంలోని ధోలవీరలో తొలినాటి మెట్లబావి మూలాలు స్పష్టంగా లభిస్తున్నాయి. సామాన్య శక పూర్వం" (సా.పూ లేదా సా.శ.పూ ). 2500 నాటికే నిర్మానుష్యమైన ఈ మెట్లబావిలో భారతదేశంలో సాధారణంగా మెట్లబావిల వద్ద కనిపించే మూడు విశేషాలు ఉన్నాయి. అవి స్నానం చేసేందుకు వీలుగా ఉండటం, నీటి వరకు చేరేందుకు మెట్ల వ్యవస్థ, మతపరమైన చిహ్నాలు/బొమ్మలు ఉండటం. సామాన్య శక పూర్వం" (సా.పూ లేదా సా.శ.పూ )నకు ముందే బౌద్ధ, జైన మతాల వారు తమ కట్టడాలలో మెట్లబావులకు ప్రత్యేక స్థానాన్ని కలిగించారు. కొండను తొలిచి ఏర్పరిచిన మెట్లబావులు సామాన్య శక పూర్వం" (సా.పూ లేదా సా.శ.పూ ). 200-400 నాటివిగా గుర్తించారు. బౌద్ధ మతం వలన మెట్లబావులు, తత్సంబంధిత మతపరమైన పుణ్యస్నానాల సంప్రదాయం ప్రపంచవ్యాప్తమయింది. ఆ తరువాత, ధాంక్(550-625 సామాన్య శక పూర్వం" (సా.పూ లేదా సా.శ.పూ.) వద్ద బావులు, భిన్మల్(సామాన్య శక పూర్వం" (సా.పూ లేదా సా.శ.పూ. 850-950) వద్ద మెట్ల చెరువులు నిర్మించబడ్డాయి.[3]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]