Jump to content

సిడిమ్రాను

వికీపీడియా నుండి

విజయనగర సామ్రాజ్య కాలంలో సిడి అనే ఉత్సవం జరిగేది. భక్త్యావేశంలో తమను తాము హింసించుకుంటూ, మొక్కుబడులు చెల్లించేందుకు భక్తులు ఈ ఉత్సవం చేసేవారు. ఒక పెద్ద గడ (పొడవాటి, లావాటి కర్ర) కొనకు ఒక ఇనుప కొక్కెం (Hook) కట్టేవారు. ఆ కొక్కెం గడ చుట్టూ తిరిగే ఏర్పాటు ఉండేది. భక్తులు ఆ కొండిని తమ వీపు చర్మానికి గుచ్చుకుని, వేళ్ళాడేవారు. అలా వేళ్ళాడుతుండగా గడను గిరగిరా తిప్పేవారు. పురుషులే కాక స్త్రీలు కూడా ఇలా వేళ్ళాడేవారు. ఈ సిడిని సిడిమ్రాను అని కూడా అంటారు.[1] మ్రాను అంటే చెట్టు, కాండము, గడ అని అర్థాలున్నాయి.

తెనాలి రామకృష్ణుడు తన పాండురంగ మాహాత్మ్యము కావ్యంలో సిడిని ఇలా వర్ణించాడు:

అంబోధరము కింద నసియాడు, నైరావ
తియుబోలె సిడి వ్రేలె తెరవయోర్తు
జార్జి కైట్లన్ చిత్రీకరించిన సియోవన్ తెగ యొక్క సూర్యనృత్యం

దాదాపు ఇదే పద్ధతిలో ప్రస్తుత కాలంలో ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా విజయనగరం పట్టణంలో సిరిమాను పేరుతో ఒక ఉత్సవం ప్రతి ఏటా జరుగుతుంది. సిడి ఉత్సవానికి, అమెరికా ఆదివాసీ జాతులు జరుపుకునే సన్ డాన్స్ (సూర్య నృత్యం) కి సారూప్యం ఉండటం విశేషం.

మూలాలు, వనరులు

[మార్చు]
  1. సురవరం ప్రతాపరెడ్డి రచించిన ఆంధ్రుల సాంఘిక చరిత్ర పుస్తకం లోని 257 పేజీ. ఈ పుస్తకాన్ని మిలియన్ బుక్స్ సైటు నుండి డౌనులోడు చేసుకోవచ్చు.