సిరిపురం యాదయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సిరిపురం యాదయ్య
జననంసిరిపురం యాదయ్య
1991
నాగారం, మహేశ్వరం మండలం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రం
మరణం2010 ఫిబ్రవరి 20
హైదరాబాద్, తెలంగాణ
మరణ కారణంఆత్మాహుతి
వృత్తివిద్యార్థి
మతంహిందూ

సిరిపురం యాదయ్య తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రత్యేక రాష్ట్ర కోసం అమరుడయ్యాడు. ఆయన మలిదశ తెలంగాణ ఉద్యమంలో 2010 ఫిబ్రవరి 20న ఉస్మానియా యూనివర్సిటీ ఎన్‌సీసీ గేట్ వద్ద తన ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకొని తెలంగాణ కోసం అమరుడయ్యాడు.[1]

ఉద్యమంలో పాత్ర, ఆత్మాహుతి[మార్చు]

సిరిపురం యాదయ్య తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో క్రియాశీలకంగా పాల్గొన్నాడు. ఉద్యమ సమయంలో 2010 ఫిబ్రవరి 20న ఉస్మానియా విద్యార్థులు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దీంతో ఉస్మానియా విశ్వవిద్యాలయం గేటు వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసు గో బ్యాక్ అంటూ విద్యార్థులు నినాదాలు చేయడం మొదలు పెట్టారు. సమైఖ్య ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మెడలు వంచి ఎలాగైనా ప్రత్యేక రాష్ట్రం సాధించుకోవాలన్న ఉద్ధేశ్యంతో ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రవేశద్వారం ఎన్‌సీసీ గేట్ వద్ద 2010 ఫిబ్రవరి 20న యాదయ్య తన ఒంటిపై పెట్రోలు పోసుకొని నిప్పంటించుకొని తన శరీరం కాలుతున్నా జై తెలంగాణ అంటూ నినాదాలు చేశాడు, దింతో అక్కడ ఉన్న విద్యార్థులు మంటలు ఆర్పే ప్రయత్నం చేసి అతన్ని 108 వాహనంలో సైదాబాద్ డిఆర్డీఎల్ అపోలో ఆసుపత్రికి తరలించారు. యాదయ్య 85 శాతం కాలిన శరీరంతో ఆసుపత్రిలో చికిత్య పొందుతూ మరణించాడు.[2][3]

కుటుంబానికి ప్రభుత్వ అండ[మార్చు]

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డా తరువాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమంలో అమరులైన కుటుంబాలకు ఆర్థికసాయంగా రూ.10లక్షల ప్రకటించింది.[4]

ఇవి చదవండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Sakshi (2 June 2014). "విద్యార్థి వీరులారా వందనం". Archived from the original on 23 February 2022. Retrieved 23 February 2022.
  2. Telugu One (21 February 2010). "తెలంగాణ కోసం కాల్చుకున్న యాదయ్య మృతి". Archived from the original on 23 February 2022. Retrieved 23 February 2022.
  3. India TV News (21 February 2010). "Telangana Student Dies Of Self-Immolation" (in ఇంగ్లీష్). Archived from the original on 23 February 2022. Retrieved 23 February 2022.
  4. Sakshi (28 October 2014). "అమరుల కుటుంబాలకు చేయూత". Archived from the original on 23 February 2022. Retrieved 23 February 2022.