Jump to content

కానిస్టేబుల్ కిష్టయ్య

వికీపీడియా నుండి
కానిస్టేబుల్ కిష్టయ్య
జననంపుట్టకొక్కుల కిష్టయ్య
1972
శివాయిపల్లి గ్రామం, రాజంపేట్ మండలం, కామారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రం
మరణం1 డిసెంబర్ 2009
కామారెడ్డి, తెలంగాణ
మరణ కారణంఆత్మాహుతి
వృత్తిపోలీస్
మతంహిందూ
భార్య / భర్తపద్మావతి
పిల్లలురాహుల్, ప్రియాంక
తల్లిదండ్రులులక్ష్మమ్మ

పుట్టకొక్కుల కిష్టయ్య ముదిరాజ్‌ తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రత్యేక రాష్ట్ర కోసం అమరుడయ్యాడు. ఆయన 1 డిసెంబర్ 2009న కామారెడ్డి పట్టణం నడుబొడ్డున తుపాకీతో కాల్చుకుని తెలంగాణ కోసం అమరుడయ్యాడు.[1][2]

కుటుంబ నేపథ్యం

[మార్చు]

కిష్టయ్య తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లా, రాజంపేట్ మండలం, శివాయిపల్లి గ్రామంలో జన్మించాడు. ఆయనకు భార్య పద్మ, కొడుకు రాహుల్, కూతురు ప్రియాంక[3] ఉన్నారు.

కానిస్టేబుల్ కిష్టయ్య బిడ్డ ప్రియాంకకు వైద్య విద్య కోసం చెల్లించాల్సిన ఫీజుకు సంబందించిన చెక్కును అందజేసిన మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

ఉద్యమంలో పాత్ర, ఆత్మాహుతి

[మార్చు]

కానిస్టేబుల్ కిష్టయ్య తెలంగాణ మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో నిజామాబాద్‌ జిల్లా, కామారెడ్డిలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కిష్టయ్యకు విద్యార్థి దశ నుండే తెలంగాణ అంటే పడిచచ్చేవాడు. కానిస్టేబుల్ కిష్టయ్య సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలకు తీవ్ర ఆవేదన చెందాడు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 9 నవంబరు 2009న కేసీఆర్ ఆమరణ దీక్షకు కూర్చున్న సందర్భంలో ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసింది. కిష్టయ్య ఆ మరుసటి రోజే తెలంగాణ రాష్ట్రంలోనే తమ బతుకులు మారుతాయని పేర్కొంటూ మరణ వాంగ్మూలం రాసుకుని కామారెడ్డి పట్టణంలోని బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్‌ ఎక్కి 1 డిసెంబర్ 2009న సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మార్పణం చేసుకున్నాడు.[4][5]

కుటుంబానికి ప్రభుత్వ అండ

[మార్చు]

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డా తరువాత కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆయన కుటుంబానికి అండగా ఉంటూ ఇంటి స్థలంతో పాటు ఆయన భార్య పద్మ, కొడుకు రాహుల్ కు ప్రభుత్వ ఉద్యొగాలతో పాటు., కూతురు ప్రియాంక మెడిసిన్ (ఎంబీబీఎస్‌) చదవడం కోసం ఏడాదికి ఐదు లక్షల రూపాయల ఫీజును టీఆర్ఎస్ పార్టీ చెల్లించింది.[6]

ప్రియాంక ఎంబీబీఎస్‌ పూర్తి చేసి కరీంనగర్ బస్తీ దవాఖానలో వైద్యురాలిగా పని చేస్తూనే ఇంతటితో సంతృప్తి చెందక మెడిసిన్‌లో పీజీ చదలవాలన్న తన కోరికను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లగా మెడిసిన్‌లో పీజీ చదవడానికయ్యే ఖర్చు భరిస్తానని హామీ ఇవ్వగా ఆమె నీట్‌లో పీజీ ఎంట్రెన్స్‌లో బీ క్యాటగిరీ మేనేజ్‌మెంట్‌ కోటాలో జనరల్‌ సర్జన్‌ సీటు సంపాదించగా కరీంనగర్‌లోని చల్మెడ ఆనందరావు మెడికల్‌ కళాశాలలో పీజీలో అడ్మిషన్‌ పొందింది. ప్రియాంక పీజీ చదివేందుకు ఖర్చయ్యే రూ. 24 లక్షలు సిఎం కెసిఆర్‌ చెల్లించాడు.[7]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (30 November 2014). "అమరుడవయ్యా కిష్టయ్యా". Archived from the original on 16 December 2021. Retrieved 16 December 2021.
  2. Sakshi (2 June 2014). "మీ త్యాగఫలమే." Archived from the original on 16 December 2021. Retrieved 16 December 2021.
  3. Namasthe Telangana (7 May 2023). "కానిస్టేబుల్‌ కిష్టయ్య కూతురు డాక్టరైంది.. సీఎం కేసీఆర్‌ లేకుంటే ఏమైపోయేవాళ్లమో: డాక్టర్‌ ప్రియాంక". Archived from the original on 7 May 2023. Retrieved 7 May 2023.
  4. The New Indian Express (2 December 2009). "Cop commits suicide in support of Telangana". Archived from the original on 16 December 2021. Retrieved 16 December 2021.
  5. The Times of India (2 December 2009). "Cop kills self over T state" (in ఇంగ్లీష్). Archived from the original on 16 December 2021. Retrieved 16 December 2021.
  6. BBC News తెలుగు (3 December 2018). "తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్యలు ఆశించిన లక్ష్యాలను సాధించాయా?". Archived from the original on 16 December 2021. Retrieved 16 December 2021.
  7. Mana Telangana (15 October 2023). "కానిస్టేబుల్‌ కిష్టయ్య కూతురుకు మెడిసిన్‌ పీజీలో సీటు." Archived from the original on 15 October 2023. Retrieved 15 October 2023.