సి.కె. బాబు
| సి.కె. జయచంద్రా రెడ్డి (బాబు) | |||
ఎమ్మెల్యే | |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 1989, 1994, 1999, 2009 | |||
| నియోజకవర్గం | చిత్తూరు నియోజకవర్గం | ||
|---|---|---|---|
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1960 చిత్తూరు, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
| జాతీయత | భారతీయుడు | ||
| రాజకీయ పార్టీ | |||
| ఇతర రాజకీయ పార్టీలు |
| ||
| జీవిత భాగస్వామి | లావణ్య | ||
| సంతానం | 2 | ||
సి.కె.జయచంద్ర రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. అయన చిత్తూరు నియోజకవర్గం నుండి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.
రాజకీయ జీవితం
[మార్చు]సికె బాబు చిత్తూరు మున్సిపాలిటీ కౌన్సిలర్‌గా, మున్సిపల్ వైస్ చైర్మన్‌గా పని చేసి 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూరు నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్ధిగా గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. అయన తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరాడు. సికె బాబు 1994, 1999లో వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ సాధించాడు.అయన 2004లో ఓడిపోయి తిరిగి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిచాడు.
సికె బాబు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 9 ఏప్రిల్ 2014న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[1][2] ఆయన 2014 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో కొంతకాలం ప్రత్యక్ష రాజకీయలకు దూరంగా ఉండి తర్వాత 2017లో అమిత్ షా సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరాడు.[3] ఆయన 2019 ఎన్నికల్లో బీజేపీ నుండి చిత్తూరు సీటు ఆశించిన దక్కకపోవడంతో బీజేపీకి దూరమై 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (9 April 2014). "వైఎస్ఆర్ సీపీలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే సీకే బాబు!". ఒరిజినల్ నుండి 8 January 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 8 January 2022.
- ↑ Sakshi (10 April 2014). "వైఎస్సార్‌సీపీలో చేరిన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు". ఒరిజినల్ నుండి 8 January 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 8 January 2022.
- ↑ The New Indian Express (8 November 2017). "Former Cong MLA CK Babu joins BJP". ఒరిజినల్ నుండి 8 January 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 8 January 2022.
- ↑ 10TV (16 September 2020). "వైఎస్ఆర్ ఉన్నంతకాలం ఓ వెలుగు వెలిగిన ఆయన, మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారు, చిత్తూరు జిల్లాలో ఇప్పుడిదే సంచలనం ck babu". ఒరిజినల్ నుండి 8 January 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 8 January 2022.
{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)