సి.వి.నాగార్జున రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సి.వి.నాగార్జున రెడ్డి

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
30 అక్టోబర్ 2019
నియమించిన వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

హైకోర్టు న్యాయమూర్తి
పదవీ కాలం
2008 – 2019

వ్యక్తిగత వివరాలు

జననం 1956 డిసెంబర్ 5
గడికోట గ్రామం, వీరబల్లె మండలం, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
తల్లిదండ్రులు సి.శ్రీరాములురెడ్డి

సి.వి.నాగార్జున రెడ్డి భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆయన హైకోర్టు న్యాయమూర్తిగా పదవి విరమణ అనంతరం 2019, సెప్టెంబర్ 16న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఛైర్మన్‌(ఏపీఈఆర్‌సీ) ఛైర్మన్‌గా నియమితులయ్యాడు.[1]

వృత్తిరంగం[మార్చు]

సి.వి.నాగార్జున రెడ్డి న్యాయవిద్య పూర్తి చేసి 1979లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకొని తన వృత్తి జీవితాన్ని ప్రారంభించాడు. ఆయన 1989 నుండి 1996 వరకు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బోర్డు స్టాండింగ్ కౌన్సిల్‌గా, తరువాత బార్ కౌన్సిల్ సభ్యునిగా, ఏపీ హైకోర్టు, ఓఎన్‌జీసీ తదితర సంస్థలకు స్టాండింగ్ కౌన్సిల్‌గా వివిధ హోదాల్లో పని చేశాడు. సి.వి.నాగార్జున రెడ్డి 2006 సెప్టెంబర్ 11న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులై, 2008లో శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి అందుకొని 2018 డిసెంబర్ 4న న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశాడు. జస్టిస్‌ నాగార్జునరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌(ఏపీ ఈఆర్‌సీ) చైర్మన్‌గా నియమితులై, 2019 అక్టోబర్ 30న పదవి భాద్యతలు చేపట్టాడు.[2][3]

మూలాలు[మార్చు]

  1. Sakshi (16 September 2019). "ఏపీ ఈఆర్‌సీ చైర్మన్‌గా రిటైర్డ్‌ జస్టిస్‌ నాగార్జునరెడ్డి". Archived from the original on 18 February 2022. Retrieved 18 February 2022.
  2. HMTV (30 October 2019). "ఏపీఈఆర్‌సీ చైర్మన్‌గా ప్రమాణం చేసిన జస్టిస్ నాగార్జునరెడ్డి". Archived from the original on 18 February 2022. Retrieved 18 February 2022.
  3. Sakshi Education (31 October 2019). "ఏపీఈఆర్‌సీ చైర్‌పర్సన్‌గా జస్టిస్ నాగార్జునరెడ్డి". Archived from the original on 18 February 2022. Retrieved 18 February 2022.