Jump to content

సి. జగన్నాథరావు

వికీపీడియా నుండి
(సి. జగన్నాథ రావు నుండి దారిమార్పు చెందింది)
సి. జగన్నాథ రావు

ఉప ముఖ్యమంత్రి
ఆంధ్రప్రదేశ్
పదవీ కాలం
1982 – 1983

హోం మంత్రి
ఆంధ్రప్రదేశ్
పదవీ కాలం
1980 – 1983

ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్
ఆంధ్రప్రదేశ్
పదవీ కాలం
28.03.1972 – 18.03.1974

వ్యక్తిగత వివరాలు

జననం 6 మే 1932
నర్సాపూర్ , మెదక్ జిల్లా , తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
మరణం 23 జనవరి 2012
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి వనమాల
సంతానం ఒక కుమారుడు శ్రీనివాస్, ఇద్దరు కూతుళ్లు శైలజ, నీరజ
నివాసం పద్మారావునగర్ , సికింద్రాబాద్

చౌటి జగన్నాథ రావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశాడు.[1]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

సి. జగన్నాథ రావు 1932 మే 6లో మెదక్ జిల్లా, నర్సాపూర్ గ్రామంలో జన్మించాడు. ఉస్మానియా యూనివర్సిటీ నుండి బి.ఏ; లా పూర్తి చేసి కొంతకాలం న్యాయవాదిగా పనిచేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

సి. జగన్నాథ రావు 1947లో జరిగిన క్విట్ హైదరాబాద్ ఉద్యమంలో పాల్గొన్ని 1948 వరకు జైలు జీవితం గడిపాడు. ఆయన 1959 నుండి 1964 వరకు నర్సాపూర్ గ్రామ సర్పంచ్‌గా పనిచేశాడు. ఆయన 1967లో నర్సాపూర్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి తొలిసారిగా ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. జగన్నాథ రావు 1969లో వచ్చిన తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ప్రభుత్వం అతనిని తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి మండలి చైర్మన్‌గా నియమించింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకరుగా 1972 మార్చి 28 నుండి 1974 మార్చి 18 వరకు పనిచేశాడు. 1974లో తెలంగాణ ప్రణాళిక, అభివృద్ధి కమిటీ చైర్మన్‌గా పనిచేశాడు. సి. జగన్నాథ రావు 1978, 1983లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

సి. జగన్నాథ రావు 1980లో టంగుటూరి అంజయ్య మంత్రివర్గంలో హోం, ఎక్సైజ్ శాఖ మంత్రిగా, 1982లో భవనం వెంకట్రామ్ మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా, హోం, రవాణా శాఖ మంత్రిగా, కోట్ల విజయభాస్కర రెడ్డి మంత్రివర్గంలో పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశాడు.[1]

మరణం

[మార్చు]

సి. జగన్నాథ రావు 2012 జనవరి 23లో గుండెపోటు రావడంతో సికింద్రాబాద్ లోని పద్మారావునగర్ లోని అతని నివాసంలో మరణించాడు. భార్య వనమాల, ఒక కుమారుడు శ్రీనివాస్, ఇద్దరు కూతుళ్లు శైలజ, నీరజ ఉన్నారు.[2][3][4]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Eenadu (29 October 2023). "అంచెలంచెలుగా.. అత్యున్నతంగా." Archived from the original on 29 October 2023. Retrieved 29 October 2023.
  2. The New Indian Express (24 January 2012). "Ex-Deputy CM Jagannath Rao dead". Archived from the original on 26 జూలై 2021. Retrieved 26 July 2021.
  3. The Hindu (24 January 2012). "Jagannatha Rao passes away". Archived from the original on 26 జూలై 2021. Retrieved 26 July 2021.
  4. "CM TO UNVEIL C JAGANNATHA RAO'S STATUE AT NARSAPUR". ipr.ap.nic.in. Retrieved 2019-07-05.