సి.ఎ. భవాని దేవి
భవాని దేవి (చదలవాడ ఆనంద సుందర రామన్ భవాని దేవి. జననం: 1993 ఆగస్టు 27) భారతీయ ఫెన్సింగ్ క్రీడాకారిణి. 2018 లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో, ఫెన్సింగ్‌లో వ్యక్తిగత విభాగంలో బంగారు పతకం సాధించింది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలు ఆమె. రాహుల్ ద్రవిడ్ అథ్లెట్ మెంటర్‌షిప్ ప్రోగ్రాం ద్వారా ఆమెకు గోస్పోర్ట్స్ ఫౌండేషన్ మద్దతు ఇచ్చింది.
వ్యక్తిగత జీవితం, నేపధ్యం
[మార్చు]భవాని తమిళనాడులోని చెన్నైలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి ఒక పూజారి, తల్లి గృహిణి. [1] ఆమె చెన్నైలోని మురుగ ధనుష్కోడి గర్ల్స్ హయ్యర్ సెకండరీలో పాఠశాల విద్యను అభ్యసించింది .ఆ తరువాత చెన్నైలోని సెయింట్ జోసెఫ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో చదివింది. 2004 లో, తమిళనాడు పాఠశాలల్లో ఫెన్సింగ్‌ను ఓ క్రీడగా ప్రవేశ పెట్టినప్పుడు తొలిసారి ఆమెకు ఫెన్సింగ్ క్రీడ పరిచయమయ్యింది. 10 వ తరగతి పూర్తి చేసిన తరువాత ఆమె ఇండియన్ ఫెన్సింగ్ కోచ్ సాగర్ లాగు దగ్గర చేరి కేరళ లోని తలసేరీలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) సెంటర్‌లో చదువు కొనసాగించింది. టర్కీలో జరిగిన అంతర్జాతీయ టోర్నమెంట్‌లో 14 ఏళ్ల వయస్సులో తొలిసారి అడుగుపెట్టినప్పటికీ మూడు నిమిషాల ఆలస్యమైనందుకు ఆమెకు బ్లాక్ కార్డ్ ఇచ్చారు. ఆ ఘటన తనకు సమయపాలన విషయంలో ఎప్పటికీ మరచిపోలేని ముఖ్యమైన పాఠాన్ని నేర్పించిందని ఆమె చెప్పింది.
భవానీ ఫెన్సింగ్ క్రీడ పట్ల ఆసక్తి ఉన్న వారికి నిధుల కొరత పెద్ద అడ్డంకిగా మారిందన్న విషయాన్ని పదే పదే తన ఇంటర్వ్యూలలో చెప్పింది. తన క్రీడా జీవితంపై కూడా అది తీవ్ర ప్రభావం చూపింది. ఫలితంగా భవాని చాలా సవాళ్లను ఎదుర్కొంది. తన కెరీర్‌లో కొనసాగేందుకు అవసరమైన స్పాన్సర్లను సంపాదించడంలో తన తల్లి పాత్ర అత్యంత కీలకమని చెప్పింది ఆమె.[2]
వృత్తిపరమైన విజయాలు
[మార్చు]టీం ఈవెంట్లలో పతకాలు సాధించడం ద్వారా తన ప్రయాణాన్ని ప్రారంభించింది భవాని. 2009లో మలేషియాలో జరిగిన జూనియర్ కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్, 2010లో థాయ్‌లాండ్‌లో జరిగిన ఇంటర్నేషనల్ ఓపెన్, 2010లో ఫిలిప్పీన్స్‌లో జరిగిన క్యాడెట్ ఏషియన్ ఛాంపియన్‌షిప్‌లలో భారత ఫెన్సింగ్ జట్టు కాంస్య పతకాలను గెలుచుకుంది.
2012లో, జెర్సీలో జరిగిన జూనియర్ కామన్ వెల్త్ ఛాంపియన్‌షిప్‌లో; భారత జట్టు రజతం గెలుచుకోగా, భవాని తన వ్యక్తిగత విభాగంలో మొదటి కాంస్యాన్ని సాధించింది. 2014లో ఫిలిప్పీన్స్‌లో జరిగిన ఆసియా ఛాంపియన్‌షిప్‌లో రజతం సాధించన మొదటి భారతీయురాలిగా రికార్డు సృష్టించింది. [3]2014 ఆసియా ఛాంపియన్‌షిప్‌లో సాధించిన విజయాల తరువాత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అమెరికాలో శిక్షణ కోసం మూడు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించి సత్కరించింది. [4] భవాని దేవి 2014 తర్వాత ఇటలీలో జరిగిన టుస్కానీ కప్‌లో స్వర్ణం సాధించడం ద్వారా తన సత్తాను మరోసారి చాటింది. [5] 2015లో, రాహుల్ ద్రవిడ్ అథ్లెట్ మెంటర్‌షిప్ ప్రోగ్రాం కోసం 'గో స్పోర్ట్స్ ఫౌండేషన్' ఎంపిక చేసిన 15 మంది అథ్లెట్లలో ఆమె ఒక్కత్తి. [6] ఆ సంవత్సరం మంగోలియాలో జరిగిన అండర్ -23 ఆసియా ఛాంపియన్‌షిప్‌లో, బెల్జియంలో జరిగిన ఫ్లెమిష్ ఓపెన్‌లో ఆమె చెరొక కాంస్య పతకాన్ని గెలుచుకుంది.రేక్‌జావిక్‌లో జరిగిన వైకింగ్ కప్ 2016 ఐస్లాండిక్ ఇంటర్నేషనల్ సాబెర్ టోర్నమెంట్లలో ఆమె ఐదో స్థానంలో నిలిచింది. [7] 2017 లో, ఐస్లాండ్‌లో జరిగిన టూర్నోయి శాటిలైట్ డబ్ల్యుసి ఫెన్సింగ్ పోటీలో భవాని దేవి బంగారు పతకాన్ని సాధించింది. 2018 లో, అదే పోటీలో ఆమె ఒక రజతం, కాంస్య పతకాన్ని గెలుచుకుంది. అదే సంవత్సరం, సాబెర్ ఈవెంట్‌లో కాన్బెర్రాలో జరిగిన సీనియర్ కామన్వెల్త్ ఫెన్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించింది. [8]2019 లో, టూర్నోయి శాటిలైట్ ఫెన్సింగ్ పోటీ లో మహిళల సేబెర్ వ్యక్తిగత విభాగంలో రజతం, కాంస్య పతకాన్ని గెలుచుకుంది. డిసెంబర్ 2020 నాటికి, వరల్డ్ ర్యాంకిగ్స్‌లో ఆమె 45వ స్థానంలో ఉంది.[9]
విజయాల జాబితా:
- 2009లో మలేషియాలో జరిగిన కామన్‌వెల్త్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం
- 2010లో ఫిలిప్పైన్స్‌లో జరిగిన ఏషియన్ ఫెన్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం
- 2012లో జెర్సీలో జరిగిన కామన్‌వెల్త్ ఛాంపియన్‌షిప్‌లో బృందంతో కలిసి రజత పతకం, వ్యక్తిగతంగా కాంస్య పతకం
- 2014లో జరిగిన ఏషియన్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో రజతం పతకం
- 2015లో జరిగిన ఏషియన్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో కాంస్య పతకం
- 2017లో ఐస్‌ల్యాండ్‌లో జరిగిన ఫెన్సింగ్ ప్రపంచ కప్ పోటీలో స్వర్ణ పతాకం
- 2018 టోర్నోయి శాటిలైట్ ఫెన్సింగ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో రజత పతకం
- 2021 ఒలింపిక్స్‌లో రెండో రౌండ్లో ప్రపంచ మూడో ర్యాంకర్ మేనన్ బ్రూనెట్ చేతిలో 7-15 తేడాతో ఓటమి పాలయ్యింది.
మూలాలు
[మార్చు]- ↑ "Bhavani Devi - Biography". Bhavanidevi (in ఇంగ్లీష్). Retrieved 2021-02-18.
- ↑ "Will a Fencer's Sabre Strike Gold?". The New Indian Express. Retrieved 2021-02-18.
- ↑ "Sword of Bhavani Fetches Asian First". The New Indian Express. Retrieved 2021-02-18.
- ↑ January 11, P. T. I.; January 11, 2016UPDATED:; Ist, 2016 10:45. "Jaya announces sports scholarship, reward for students". India Today (in ఇంగ్లీష్). Retrieved 2021-02-18.
{{cite web}}
:|first3=
has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link) - ↑ "Achievements". Bhavanidevi (in ఇంగ్లీష్). Retrieved 2021-02-18.
- ↑ "Chennai Newz » Go Sports Foundation Selected 15 athletes for Rahul Dravid Athlete Mentorship Programme". web.archive.org. 2016-06-03. Archived from the original on 2016-06-03. Retrieved 2021-02-18.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Chennai fencer Bhavani aims for 2020 Olympics | News Today". web.archive.org. 2016-08-18. Archived from the original on 2016-08-18. Retrieved 2021-02-18.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Achievements". Bhavanidevi (in ఇంగ్లీష్). Retrieved 2021-02-18.
- ↑ "Achievements". Bhavanidevi (in ఇంగ్లీష్). Retrieved 2021-02-18.