సీతాదేవి(బరోడా మహారాణి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బరోడా మాహారాణి సీతాదేవి 1917 మే 12న మద్రాసులో తెలుగు కుటుంబంలో జన్మించింది.1989 ఫిబ్రవరి 15న పారిస్‌లో మరణించింది. [1] ఆమె " ఇండియన్‌ వాలీ సింప్సన్ " గా గుర్తింపు పొందింది.[2] ఆమె 40 సంవత్సరాల కాలం విపరీత ధోరిణిలో జీవితం గడిపిన వ్యత్యాసమైన మహిళగా గుర్తింపుపొందింది.[2] ఆమె అంతర్జాతీయ " జెట్ సెట్ " సభ్యురాలు.

జీవితచరిత్ర

[మార్చు]

సితాదేవి పిఠాపురం మహారాజు " శ్రీ రాజా రావు వెంకట కుమార మహీపతి సూర్యారావు బహదూరు ", శ్రీ రాణి చిన్నమాంబాదేవి (మిర్జాపురం) కుమార్తె.

మొదటి వివాహం

[మార్చు]

సితాదేవి మొదటిసారిగా ఎం.ఆర్. అప్పారావు బహదూర్, వుయ్యూరు జమిందార్.[2] ఆయనద్వారా ఆమెకు " ఎం.విదుత్ కుమార్ అప్పారావు " ఒక కుమారూడు.[3]

రెండవ వివాహం

[మార్చు]

ఆమె తన రెండవ భర్త " ప్రతాప్ సింఘ్ గేక్వార్డ్ " (బరోడా) ను 1943లో చెన్నైలోని హార్స్ రేసు వద్ద కలుసుకున్నది.[2] ఆసమయంలో గేక్వర్డ్ ప్రపంచంలో అత్యంత ధనవంతులలో ఒకడుగా గుర్తించబడి ఉన్నాడు. ఆయన సంపన్న భారతీయ రాకుమారులలో ఒకరుగా పేర్కొనబడ్డాడు. గేక్వర్డ్ సీతాదేవి సౌందర్యానికి మంత్రముగ్ధుడయ్యాడు.ప్రేమికులిద్దరూ వారి న్యాయవాదులతో సంప్రదింపులు జరిపారు. న్యాయావాదులు హిందువుగా ఉన్న సీతాదేవి మొహమ్మదిజంకు మతమార్పిడి చేయాలని సూచించారు[2]

మతమార్పిడి

[మార్చు]

తరువాత ఆమె జమిందారుతో వివాహబంధాన్ని భారతీయ వైవాహిక చట్టం ద్వారా రద్దు చేసుకుంది. ఆమె తరువాత ఇస్లాం మతాన్ని స్వీకరించి తరువాత తిరిగి హిందూమతానికి మారింది.1943లో గేక్వర్డ్ ఆమెను తన ద్వితీయకళత్రంగా స్వీకరించాడు. వివాహం బ్రిటిష్ ఆధిపత్యానికి ఆగ్రహం కలిగించింది. ఇది మునుపటి బరోడా గేక్వర్డ్ సంబంధిత బైగామీ చట్టానికి విరుద్ధమని బ్రిటిష్ ప్రభుత్వం వాదించింది. బ్రిటిష్ వైశ్రాయి (న్యూ ఢిల్లీ) వివాహవిషయమై గేక్వర్డుకు సమ్మన్లు జారీచేసింది. వదోపవాదాల అనంతరం గేక్వర్డ్ సీతాదేవిల వివాహం బ్రిటిష్ ప్రభుత్వం అంగీకారం పొందింది.అయినప్పటికీ బ్రిటిష్ ప్రభుత్వం సీతాదేవిని మహారాణిగా (హర్ హైనెస్) అంగీకరించలేదు.[2]

విదేశీయానం

[మార్చు]

1946లో గేక్వర్డ్ తన రెండవ భార్యను విదేశీయాత్రకు తీసుకుని వెళ్ళాడు. వారి విదేశీయాత్రా లక్ష్యం భారతదేశానికి వెలుపల నిచసించడానికి అనువైన ప్రదేశం అన్వేషించడమే.[2] వారు తమ రెండవ నివాసం కొరకు స్వతంత్ర మొనాకోరాజ్యాన్ని ఎన్నుకున్నారు. వారు మోంటేకార్లోకు పరివారాన్ని తీసుకుపోయి అక్కడ మహారాణి శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకున్నారు.[2]

నిధులు

[మార్చు]

గేక్వర్డ్ మహారాణి నివాసానికి తరచుగా వెళ్ళి బసచేసేవాడు. ఆయన తన పర్యటన సమయంలో బరోడా నుండి విలువైన సంపదను మహారాణి కొరకు మొనాకో తీసుకువెళ్ళే వాడు.ఆసంపద మొత్తానికి మహారాణి సంరక్షకురాలు అయింది.[4]ఈ జంట రెండుమార్లు యునైటెడ్ స్టేట్స్ సందర్శించారు. వారు యాత్రసమయంలో అన్ని రకాల విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేసారు. వారు ఆయాత్రలలో దాదాపు 10 మిలియన్ల అమెరికన్ డాలర్లు వెచ్చించారని భావిస్తున్నారు.అధికారులు ఈ గణాంకాలను పరిశీలించిన భారతీయ అడిటర్లు గేక్వర్డ్ బరోడా ఖజానా నుండి వడ్డీరహిత ౠణాలు పెద్ద మొత్తంలో తీసుకున్నాడన్న నిర్ణయానికి వచ్చారు. వారు దానిని తిరిగి ఇవ్వమని నిర్భంధించారు. రాకుమారుడు తన వార్షిక ఆదాయమైన 8 మిలియన్ల అమెరికన్ డాలర్ల నుండి చెల్లింపులు పలు వాయిదాలలో ఇవ్వడానికి అంగీకరించాడు.[2]రాజకుటుంబ జంట బరోడా ఖజానా నుండి నిధులు పెద్దమొత్తంలో తరలించారు. అత్యంత విలువైన ఆభరణాలు, నాలుగు ముత్యాల తివాసీలు అందులో భాగంగా ఉన్నాయి. [4]

ఆభరణాలు

[మార్చు]

అమూల్యమైన బరోడా ముత్యాలతో తయారుచేయబడిన ఏడుపేటల ముత్యాల హారం, బ్రెజిలియన్ వజ్రాలతో చేయబడిన మూడుపేటల వజ్రాల హారం, ఇంగ్లీష్ డ్రెస్డెన్ వజ్రం అందులో భాగంగా ఉన్నాయి. రాజకుటుంబ జంట విలువైన ఎంప్రెస్ యూగెనీ వజ్రాన్ని స్వంతం చేసుకున్నారు. బరోడా స్వతంత్రభారతదేశంలో విలీనం చేయబడిన తరువాత భారతదేశ అధికారులు వాటిలో కొంతసంపదను స్వాధీనం చేసుకున్నారు.అయినప్పటికీ కొన్ని ఆభరణాలు, విలువైన వస్తువులు మహారాణి ఆధీనంలో ఉండిపోయాయి.

ముత్యాల తివాసి

[మార్చు]

మహారాణి మరణించిన తరువాత కొన్ని వస్తువులు కనుగొనబడ్డాయి. 1994లో ముత్యాల తివాసి స్విస్ బ్యాంక్‌లో కనుగొనబడింది. [4] అది అరబ్ రాకుమారునికి 31మిలియన్ల అమెరికన్ డాలర్లకు విక్రయించబడింది.[2] ప్రస్తుతం ఈ ముత్యాల తివాసి దోహా లోని " మ్యూజియం ఆఫ్ ఇస్లామిక్ ఆర్ట్ " లో ప్రదర్శించబడుతుంది.స్టార్ ఆఫ్ ది సౌత్, ఇతర రత్నాలు మిగిలిన ఆభరణాలు అంస్టర్డాంలో ఉన్నాయి.[2]

వారసురాలు

[మార్చు]

మహారాణి మరణించిన తరువాత ఆమె మేనకోడలు రాణి మంజులాదేవి (సిద్ధీ కుటుంబం) అనంగరేఖాదేవి వారసత్వం మార్చబడింది. అనంగరేఖాదేవి ఆమె కుటుంబంతో అస్సాంలో నివసిస్తూ ఉంది.చివరకు భారతప్రభుత్వం గేక్వర్డ్ ద్రోహం, వంచన కారణంగా గేక్వర్డ్ రాజరికపదవి నుండి తొలగించి 1951లో ఆయన మొదటి భార్య కుమారునికి రాజరికపదవీ బాధ్యతలు అప్పగించింది. అధికారికంగా వారు రాజరిక అధికారం కోల్పోయినప్పటికీ రాజదంపతులు వారి బిరుదునామాలతో కొనసాగారు.[5]

సంతానం

[మార్చు]

1945 లో సీతాదేవి ద్వారా గేక్వర్డ్‌కు ఒక కుమారుడు కలిగాడు. కుమారుని పేరు సాయాజీ రావు గేక్వర్డ్1945 మార్చి 8- 1985 మే 8). [6] ఆమెకు కుమారుడు అత్యంత ప్రీతిపాత్రుడయ్యాడు. [7] ఆమె అనేక అంతర్జాతీయ ఉత్సవాలకు హాజరు అయింది.అంతర్జాతీయ అతిధులకు ఆమె అతిధి సత్కారాలు చేసింది.[8]

ఆభరణాల అమ్మకం

[మార్చు]

1953లో మహారాణి తన విలువైన కంకణాలను హారీ వింసన్‌కు విక్రయించింది. వారి వద్ద పలు పెద్ద మరకతమణులు, వజ్రాలు ఉండేవి. వాటితో తయారు చేయబడిన అందమైన కంఠహారాన్ని " వాలెస్ సింప్సన్ " కు విక్రయించారు. డచెస్ ఈ కంఠహారాన్ని సీతాదేవి హాజరైన న్యూయార్క్ బాల్ నృత్యంలో ధరించింది. మహారాణి అవహేళనగా పలికిన మాటలకు కలత చెందిన డచెస్ దానిని తిరిగి వింస్టన్‌కు ఇచ్చింది.[9]

కార్లపై ఆసక్తి

[మార్చు]

మహారాణికి కార్లంటే ఆసక్తి ఎక్కువ. ఆమెకు ఆమె మెర్సిడెస్ డబల్యూ 26 అంటే మక్కువ ఎక్కువ. 1969 అస్కాట్ గోల్డ్ కప్ పోటీల సమయంలో ఆమె తన చేతికున్న నీలమణిని చూపి వారి అదృష్టాన్ని పరీక్షించుకొనమని చెప్పింది.[5]1969లో సీతాదేవి, రాకుమారుని " ఫన్ కపుల్ " అని ఎస్క్వైర్ మాగజిన్ పేర్కొన్నది. [5]

విడాకులు

[మార్చు]

1956లో సీతాదేవి గేక్వర్డ్‌కు విడాకులు ఇచ్చింది. ఆయన వెంటనే లండన్‌కు మకాం మార్చాడు.[10]వివాహరద్దు తరువాత కూడా ఆమె తన బిరుదును కొనసాగించింది. ఆమె రోల్స్ రాయిస్ ఇప్పటికీ బరోడా ఆయుధాగారంలో ఉంది. ఆమె మహారాణిగా 101 గన్ సెల్యూటులను స్వీకరించింది. సీతాదేవి, ఆమె కుమారునికి మొనాకో రాకుమారుడు " ప్రింస్ రైనర్ " మొనాకో పౌరసత్వం ఇచ్చాడు. [11] ఆమె పారిస్ అపార్ట్మెంటును చక్కగా పరామరిక చేసింది. ఆమె అత్యున్నత స్థాయి జీవితాన్ని కొనసాగించింది. మద్యపానం, ఖరీదైన ఫర్నీచర్ అమరిక నిర్వహిస్తూ విలాసవంతమైన విందులు వినోదాలను ఏర్పాటు చేస్తూ ఉండేది. ఆమె ప్రయాణించే సమయంలో ఆమె తనతో వార్డ్ రోబ్, వేలాది చీరెలు, వందల జతుల షూలు, ఆభరణాలు వెంట తీసుకుని వెళ్ళేది.[5] ఆమె సంపద క్రమంగా క్షీణించింది. 1974లో ఆమె తన ప్రియమైన ఆభరణాలను రహస్యంగా వేలం వేసింది. [11]

కుమారుని ఆత్మహత్య

[మార్చు]

1985లో మహారాణి సీతాదేవి కుమారుడు తన 40వ పుట్టినరోజు తరువాత ఆత్మహత్య చేసుకున్నాడు. రాకుమారూడు మద్యపానానికి, డ్రగ్ అలవాట్లకు బానిసై ఆత్మహత్య చేసుకున్నట్లు భావించారు.[9]

మరణం

[మార్చు]

సీతాదేవి తరువాత నాలుగు సంవత్సరాలకు మరణించింది. పరిశీలకులు ఆమె హృదయవేదనతో మరణించిందని భావించారు.

బిరుదులు

[మార్చు]
  • 1917–1935 : పిఠాపురం మహారాజకుమారి సీతాదేవి.
  • 1935–1943 : " హర్ హైనెస్ క్వీన్ " సీతాదేవి, ఉయ్యూరు రాణి.
  • 1943–1989 : హర్ హైనెస్ మహారాణి సీతాదేవి సాహిబ్ గేక్ వర్డ్, మహారాణి ఆఫ్ బరోడా,

మూలాలు

[మార్చు]
  1. Acte de décès, Mairie de Paris, Registre 531, Numéro d'acte: 423
  2. 2.00 2.01 2.02 2.03 2.04 2.05 2.06 2.07 2.08 2.09 2.10 Tribune India 13 August 2006,
  3. "baroda7". Archived from the original on 2017-01-03. Retrieved 2017-03-04.
  4. 4.0 4.1 4.2 Tribune India 18 August 2002
  5. 5.0 5.1 5.2 5.3 The Maharajahs; by John Lord 1971 Random House ISBN 0-394-46145-2
  6. The Princie Diamond was so named in his honor
  7. "Time Magazine Sept 13, 1968". Archived from the original on 2013-06-24. Retrieved 2017-03-04.
  8. "Time Magazine 21 March 1969". Archived from the original on 4 నవంబరు 2012. Retrieved 4 మార్చి 2017.
  9. 9.0 9.1 Internetstones.com[permanent dead link]
  10. "Time Magazine 26 March 1956". Archived from the original on 24 ఆగస్టు 2013. Retrieved 4 మార్చి 2017.
  11. 11.0 11.1 [1] Archived 2013-08-21 at the Wayback Machine Time Magazine 20 January 1975

వెలుపలి లింకులు

[మార్చు]