సీతానగరం (తాడేపల్లి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సీతానగరం
—  రెవెన్యూయేతర గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం తాడేపల్లి
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

సీతానగరo తాడేపల్లి మండలంలో తాడేపల్లి పట్టణ పరిధిలో ఉన్న రెవెన్యూయేతర గ్రామం.

గ్రామ చరిత్ర[మార్చు]

సీతానగరం అంటే దొంగలకు ప్రసిద్ధి. బ్రిటీషు వాళ్ళు దొంగలుగా గుర్తించిన జాతుల వాళ్ళను ఇక్కడ సెటిల్ చేశారు. 1911 సంవత్సరం 3 నెంబర్ క్రిమినల్ ట్రైబ్స్ ఆక్టు సెక్షన్ 16 ప్రకారం ఈ ప్రాంతంలో బ్రిటీష్ వారు నేరజాతులుగా ముద్రవేసిన కొన్ని కుటుంబాలకు సెటిల్మెంటుగా ఏర్పరిచారు. బ్రిటీష్ కాలంలో ఆ చట్టం సదరు జాతుల్లో జన్మించిన వారికి జామీను తీసుకునే హక్కు కూడా ఇవ్వలేదు. ఆ చట్టంలోని సెక్షన్ 10బి ప్రకారం ఆయా జాతులవారు కుటుంబాలతో సహా ఎవరెవరు ఎక్కడ నివసిస్తున్నదీ, ఏయే ప్రాంతాలకు తమ నివాసాలు మార్చుకుంటున్నది, అందుకు గల కారణాలు, వారి కొత్త నివాసాలు స్థానిక పోలీసు అధికారులకు తెలియజేయాల్సివుండేది. చివరకు వారు ఊరు విడిచి కొద్దిరోజులు వెళ్ళాలన్నా ఆ గైర్హాజరు సమయానికి ముందుగా తెలియపరిచి అనుమతి పొందాల్సివుండేది. ఈ అతికఠినమైన చట్టాన్ని అమలుచేసేందుకు ఏర్పరిచిన సెటిల్మెంట్లలో ఇదీ ఒకటి.[1] కాలక్రమేణా చారిత్రికంగా ఎన్నో మార్పులు వచ్చి, స్థితిగతుల్లో ఎంతో అభివృద్ధి చెందినా సీతానగరానికి ఏర్పడిన ముద్ర వల్ల, ఆపేరుతో పిలుచుకోవటం ఇష్టం లేక సుందరయ్య నగర్ను ఏర్పాటు చేసుకున్నారు. సుందరయ్య నగర్ అంటే తాడేపల్లి పంచాయతీ శివారు గ్రామం సీతానగరంలో కొత్తగా ఏర్పడిన కాలనీ. కనకదుర్గ వారధి నుండి సుందరయ్య నగర్ మీదుగా ఉండవల్లి కూడలి (సెంటర్) వరకు కృష్ణానది కరకట్టపై ఫ్లై ఓవర్ నిర్మాణానికి ఏర్పాటుజరుగుతోంది.

బ్రిటిషు వారి పాలనలో అడవులను ఆక్రమించి అక్కడి వారికి జీవన భృతి లేకుండా చేసారు. వారు చివరికి దొంగలుగా మారారు. బ్రిటిషు ప్రభుత్వం వివిధ ప్రదేశాల్లో వీరికి ప్రత్యేకంగా ఆవాసం కల్పించింది. 1913 లో అటువంటిదే ఒక స్థావరం మంగళగిరి వద్ద కృష్ణానదికి బకింగ్‌హాం కాలువకు మధ్య సీతానగరంలో ఏర్పాటు చేసారు. వీరంతా ఎరుకల కులస్తులుగా నేడు స్థిరపడి మంచి చదువులతో పదవులలో ఉన్నారు. అప్పటినుండి 1932 వరకు సాల్వేషను ఆర్మీ అనే సంస్థ దీనిని నిర్వహించేది. 1932 నుండి 1956 వరకు పోలీసు శాఖ నిర్వహణలో ఉండేది. 1956 లో సాంఘిక సంక్షేమ శాఖ అధీనంలోకి వచ్చింది. 1962 లో ప్రభుత్వం వారికి నేరస్తులనే ముద్రను తొలగించి, వారికి జీవనార్ధమై 156 ఎకరాల భూమిని పంచింది.

సీఆర్‌డీఏ[మార్చు]

సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.[2]

గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు[మార్చు]

తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

  1. శ్రీ మద్వీరాంజనేయ సమేత శ్రీ కోదండరామస్వామివారి ఆలయం:- తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం గ్రామంలోని ఈ ఆలయం, విజయవాడ కనకదుర్గ దేవాలయానికి దత్తత దేవాలయం.ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించెదరు.
  2. శ్రీ సోమేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయం కృష్ణా నదీ తీరంలో ఉంది. పుస్కరాల సమయంలో భక్తులు ఇక్కడ స్నానాలుచేసి ప్రక్కనే ఉన్న శ్రీ సోమేశ్వరస్వామివారిని దర్శించుకుంటారు.
  3. శ్రీ రాజరాజేశ్వరీ దేవి ఆలయం.
  4. శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం:- కృషానదీతీరంలో ఉన్న ఈ ఆలయం ప్రక్కనే ఒక పుష్కర ఘాట్ ఉంది.
  5. విజయకీలాద్రి:- ఇక్కడ ఆలయ ప్రతిష్ఠా మహోత్సవాలు, 2017,ఫిబ్రవరి-1వతేదీ బుధవారం నుండి 6వతేదీ సోమవారం వరకు భక్తుల కోలాహలం మధ్య అత్యంత వైభవంగా నిర్వహించారు.
  6. బోధిశిరి హిల్ పార్క్:- సీతానగరం కొండపైన, 47 ఎకారాల విస్తీర్ణంలో, కృష్ణాతీరం వైపు, రు. 73.12 కోట్లతో, 60 అడుగుల ఎత్తయిన బుద్ధుని విగ్రహాన్ని ఏర్పాటు చేయుటకై, ఈ ప్రాజెక్టుకు 2013,జనవరి-19వ తేదీనాడు, శంకుస్థాపన చేసారు. ఈ ప్రాజెక్టులో భాగంగా, మొదటి దశలో కొండపైకి రహదారి, ఇతర సదుపాయాలకు రు. 13.62 కోట్లను కేటాయించారు. రెండవ దశలో ఆరోగ్యపరంగా నాచురోపతి, వినోదకార్యక్రమాలు, ఇతర సదుపాయాలకు రు. 52 కోట్లు కేటాయించారు. మూడవదశలో 600 మందికి సరిపోయే విధంగా, 20 మీటర్ల విస్తీర్ణంలో, రు. ఏడున్నర కోట్లతో రివాల్వింగ్ రెష్టారెంట్ ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ఇందులో అత్యాధునిక సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించారు. ప్రకాశం బ్యారేజీకి 30 అడుగుల ఎత్తులో, ఆహ్లాదకరమైన కృష్ణాతీర వాతావరణంతో, ఈ బోధిశిరి హిల్ పార్క్ ని, కృష్ణా, గుంటూరు జిల్లలవారికే గాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలవారికి, ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. కానీ ఈ ప్రాజెక్టు ఇంత వరకూ, శంకుస్థాపన దశ దాటి ముందుకు పోలేదు.
  7. జీయర్ ఆశ్రమం.

మూలాలు[మార్చు]

  1. ఏలేశ్వరపు, రామచంద్రశాస్త్రి (1916). చెన్నపట్టణం రాజధానిలో నేరములు చేయు జాతుల చరిత్రములు (PDF). విజయవాడ: బి.కె.స్వామి. Archived from the original (PDF) on 4 మార్చి 2016. Retrieved 11 April 2015.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-18.