Jump to content

సీతారామపురంలో

వికీపీడియా నుండి
సీతారామపురంలో ఒక ప్రేమ జంట
దర్శకత్వంఎమ్‌.వినయ్ బాబు
రచనఎమ్‌.వినయ్ బాబు
నిర్మాతబీసు చందర్‌ గౌడ్‌
తారాగణంరణధీర్‌
నందిని రెడ్డి
సుమన్‌
అమిత్ తివారి
సూర్య
ఛాయాగ్రహణంవిజయ్ కుమార్.ఎ
కూర్పునంద‌మూరి హ‌రి
సంగీతంఎస్‌.ఎస్ నివాస్
నిర్మాణ
సంస్థ
శ్రీ ధనలక్ష్మి మూవీస్‌
విడుదల తేదీ
2022 నవంబర్ 18
దేశం భారతదేశం
భాషతెలుగు

సీతారామపురంలో ఒక ప్రేమ జంట 2022లో విడుదలకానున్న తెలుగు సినిమా.[1] శ్రీ ధనలక్ష్మి మూవీస్‌ బ్యానర్‌పై బీసు చందర్‌ గౌడ్‌ నిర్మించిన ఈ సినిమాకు ఎమ్‌.వినయ్ బాబు దర్శకత్వం వహించాడు. రణధీర్‌, నందిని రెడ్డి, సుమన్‌, సూర్య, అమిత్‌ తివారీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ని మంత్రి వి. శ్రీనివాస్‌ గౌడ్‌ 2022 జూన్ 23న[2],ట్రైలర్‌ను అక్టోబర్ 2న నిర్మాత దిల్ రాజు విడుదల చేయగా[3] సినిమా నవంబర్ 18న విడుదల కానుంది.[4]

సీతారామ పురం గ్రామ స‌ర్పంచ్ ప‌టేల్ (సుమ‌న్‌)కి కూతురు నందు (నందిని) ఉంటుంది. అదే ఊరిలో మాజీ స‌ర్పంచ్ న‌ర్సింహ గౌడ్ (సూర్య‌) కొడుకు శివ (ర‌ణ‌ధీర్‌), నందు ఇద్ద‌రు చిన్ననాటి స్నేహితులు. ఈ క్రమంలో వారిద్దరూ ప్రేమించుకుంటారు, కానీ ప‌టేల్ తన కూతురుని నందుకి తన మేన‌బావ (అమిత్‌) కి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. ఈ క్ర‌మంలో నందు, శివల ప్రేమ సంగతి వారి పెద్ద‌ల‌కు తెలుస్తుంది, దీంతో వారిద్దరూ పారిపోయి పెళ్ళి చేసుకోవాలని లేచిపోతారు. అమిత్ వారిద్దరిని వెతికి ప‌ట్టుకుంటాడు. వీళ్ళని పట్టుకున్న తరువాత వారిని ఏమి చేశారు? తరువాత ఏమి జరిగింది అనేదే మిగతా సినిమా కథ.

నటీనటులు

[మార్చు]


సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: శ్రీ ధనలక్ష్మి మూవీస్‌
  • నిర్మాత: బీసు చందర్‌ గౌడ్‌
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎమ్‌.వినయ్ బాబు
  • సంగీతం: ఎస్‌.ఎస్ నివాస్
  • సినిమాటోగ్రఫీ: విజయ్ కుమార్.ఎ
  • ఎడిటింగ్: నంద‌మూరి హ‌రి
  • ఫైట్స్: రామ్ సుంక‌ర‌
  • కొరియోగ్ర‌ఫీ: గ‌ణేష్ మాస్ట‌ర్‌, అజ‌య్ శివ శంక‌ర్‌
  • పాట‌లు: సుద్దాల అశోక్ తేజ, అభినయ శ్రీనివాస్

మూలాలు

[మార్చు]
  1. Eenadu (28 January 2022). "సీతారామపురంలో.. ఓ ప్రేమకథ". Archived from the original on 6 November 2022. Retrieved 6 November 2022.
  2. NTV Telugu (23 June 2022). "'సీతారామ‌పురంలో ఒక ప్రేమ జంట' టీజ‌ర్ విడుదల". Archived from the original on 6 November 2022. Retrieved 6 November 2022.
  3. Sakshi (3 October 2022). "'సీతారామపురంలో ఒక ప్రేమ జంట' ట్రైలర్‌ రిలీజ్". Archived from the original on 6 November 2022. Retrieved 6 November 2022.
  4. Namasthe Telangana (15 November 2022). "సీతారామపురంలో ప్రేమకథ". Retrieved 18 November 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)