సీతా దేవి (చిత్రకారిణి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సీతా దేవి
జననం1914
సహర్సా, బీహార్, బ్రిటిషు భారతదేశం
మరణం2005 (aged 90–91)
జిత్వార్‌పూర్, మధుబని జిల్లా, బీహార్
వృత్తిచిత్రకారిణి, సామాజిక కార్యకర్త
పురస్కారాలుపద్మశ్రీ (1981)

సీతా దేవి (1914–2005) మధుబని శైలి చిత్రకళలో నైపుణ్యం కలిగిన భారతీయ కళాకారిణి. ఆమె అత్యంత ప్రసిద్ధి చెందిన భారతదేశ మధుబని కళాకారులలో ఒకరు. ఈ చిత్రకళకు గాను 1981 లో పద్మశ్రీ, 1984 లో బీహార్ రత్న సమ్మాన్‌లతో సహా అనేక జాతీయ స్థాయి పురస్కారాలు సాధించి ఈ కళారూపానికి జాతీయ గుర్తింపు పొందింది. ఆమె బీహార్ రాష్ట్రంలోని జిత్వార్‌పూర్ గ్రామం అభివృద్ధి కోసం కృషి చేసింది. ఆర్థిక స్థిరత్వాన్ని ప్రోత్సహించే ప్రయత్నంలో స్థానిక నివాసితులకు, ముఖ్యంగా మహిళలకు మధుబని కళను నేర్పింది. ఆమె చిత్రాలు ఆమె శైలికి, ప్రత్యేకించి ఆమె రంగుల ఉపయోగానికి గాను పలు ప్రశంసలు పొందాయి. భారతదేశంలోను, ఫ్రాన్స్, యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్, జపాన్‌లోని మ్యూజియంల లోనూ వీటిని ప్రదర్శించారు.

జీవిత చరిత్ర

[మార్చు]

సీతాదేవి 1914 లో బీహార్ రాష్ట్రంలోని సహర్సా సమీపంలోని ఒక గ్రామంలో జన్మించింది. పెళ్ళి తర్వాత ఆమె జిత్వార్‌పూర్ గ్రామానికి మారింది.[1] ఆమె మహాపాత్ర బ్రాహ్మణ కుటుంబానికి చెందినది.[1] ఆమె నిరక్షరాస్యురాలు. కానీ స్థానిక కుమ్మరుల వద్ద మిగిలిపోయిన పెయింటును వాడుకుంటూ స్థానిక సాంప్రదాయ మధుబని శైలిలో తన ఇంటి గోడలపై పెయింటింగ్ చేసి చిన్నతనంలోనే పెయింట్ చేయడం నేర్చుకుంది.[1] ఆమె 2005 లో మధుబనిలో మరణించింది. [2]

కెరీర్

[మార్చు]

సీతా దేవి సాంప్రదాయ మధుబని జానపద కళా శైలిలో చిత్రించడం నేర్చుకుంది. గోడలపై కుడ్యచిత్రాలను చిత్రించే సాంస్కృతిక అభ్యాసం నుండి కాగితంపై పని చేయడం ద్వారా మధుబని చిత్రాలను విక్రయించడానికి వీలు కల్పించిన మొదటి కళాకారులలో ఆమె ఒకరు.[3] ప్రభుత్వ అధికారుల ప్రోత్సాహంతో ఇది జరిగింది. ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ సూచనల మేరకు బీహార్‌లోని స్థానిక నివాసితులను రాష్ట్రవ్యాప్త కరువు ఆర్థిక ప్రభావాన్ని ఎదుర్కోవడానికి వారు వేసిన చిత్రాలను విక్రయించమని ప్రోత్సహించారు. ఆమె బీహార్ రాష్ట్రంలో ఉద్భవించిన మధుబని కళను భారతదేశంలో జాతీయ దృష్టికి తీసుకురావడంలో అగ్రభాగాన ఉంది. 1969 లో కళలకు ఆమె చేసిన కృషికి బీహార్ ప్రభుత్వం ఆమెను రాష్ట్ర పురస్కారంతో సత్కరించింది. ఆమె భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మశ్రీతో సహా అనేక ఇతర పురస్కారాలను గెలుచుకుంది.[2]

1960 -70 దశకంలో సీతాదేవి, తోటి కళాకారులు గంగా దేవి, బౌవా దేవిలతో కలిసి భారతదేశంలో మధుబని కళా శైలిలో అత్యంత ప్రసిద్ధి చెందారు. ముఖ్యంగా ఆమె మధుబని కళ లోని భర్ణి (నిండిన) రూపాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చింది.[4] ఆమె చిత్రాలు సాంప్రదాయ మిథిలా / మధుబని మూలాంశాల నుండి తీసుకోబడ్డాయి/ ఇందులో పురాణాలు, సహజ ప్రపంచం నుండి బొమ్మలు ఉన్నాయి. ఆ తరువాత, తాను దర్శించిన ప్రదేశాలను - వరల్డ్ ట్రేడ్ సెంటర్, ఆర్లింగ్టన్ నేషనల్ స్మశానవాటిక, న్యూయార్క్ నగరంలోని స్కైలైన్‌లతో సహా దృశ్యాలను తన చిత్రాలలో పొందుపరచింది.[4] 1981 లో జపనీస్ క్యూరేటర్, టోకియో హసెగావా ఆహ్వానం మేరకు, తోకమాచిలో మిథిలా మ్యూజియంను చిత్రించడానికి, స్థాపించడానికి జపాన్ సందర్శించిన అనేకమంది మధుబని కళాకారులలో ఆమె ఒకరు. ఈ సందర్శన సమయంలో తన కళలో జపనీస్ ప్రకృతి దృశ్యాలను చేర్చింది.[3][5][6]

ఆమె ఢిల్లీలోని భారతదేశ జాతీయ హస్తకళలు ,చేనేత మ్యూజియంలో ఆర్టిస్ట్-ఇన్-రెసిడెన్స్ గా ఉంది. ఆమె కృతులు రాజకీయ వర్గాల్లో - ముఖ్యంగా ఇందిరా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి వంటి మాజీ ప్రధానుల వద్ద ప్రశంసలు పొందాయి.[4] 1978 లో ఆమె న్యూ ఢిల్లీలోని అక్బర్ హోటల్‌లో కుడ్యచిత్రాల శ్రేణిని రూపొందించడానికి నియమించబడింది. ఈ ప్రాజెక్టు కోసం ఆమె ఒక సంవత్సరం పాటు గడిపింది.

జీవితకాలంలో ఆమె చేసిన కృషి భారతదేశంలోను, అంతర్జాతీయంగానూ విస్తృతంగా ప్రదర్శించబడింది. లండన్‌లోని విక్టోరియా & ఆల్బర్ట్ మ్యూజియం, [7] లాస్ ఏంజిల్స్ కౌంటీ మ్యూజియం ఆఫ్ ఆర్ట్, ఫిలడెల్ఫియా మ్యూజియం ఆఫ్ ఆర్ట్, మ్యూసీ డు మ్యూజియం, పారిస్‌లోని క్వాయ్ బ్రాన్లీ, జపాన్‌లోని మిథిలా మ్యూజియంలలో శాశ్వత సేకరణలలో భాగమయ్యాయి.[4] ఆమె కృతులకు ప్రభుత్వ, ప్రైవేట్ సేకరణలలో వాణిజ్యపరమైన డిమాండు ఉంది.[8]

క్రియాశీలత

[మార్చు]

సీతా దేవి బీహార్‌లోని స్థానిక రాజకీయాలలో, ప్రధానంగా స్థానిక మౌలిక సదుపాయాల అభివృద్ధి, కళా విద్య రంగాలలో చురుకుగా పనిచేసింది. కళాకారిణిగా ఆమె సంపాదించిన ప్రజాభిమానాన్ని ఉపయోగించుకుని, ఆమె తన గ్రామమైన జిత్వార్‌పూర్‌కు రోడ్ల నిర్మాణం, విద్యుత్ సౌకర్యం, పాఠశాలల నిర్మాణం వంటి అభివృద్ధి కోసం ఉద్యమించింది.[9] అంతేకాకుండా, ఆమె స్థానిక నివాసితులకు, ముఖ్యంగా యువతులకు మధుబని కళను నేర్పింది, నేర్పడానికి ప్రభుత్వ గ్రాంట్ కోసం లాబీయింగ్ చేసింది.

సత్కారాలు, పురస్కారాలు

[మార్చు]
  • 1969: మధుబని కళకు బీహార్ రాష్ట్ర ప్రభుత్వ అవార్డు [2] [4]
  • 1976: భారత రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ నుండి "మాస్టర్ క్రాఫ్ట్స్‌మన్" అవార్డు [10]
  • 1981: పద్మశ్రీ, భారత ప్రభుత్వం, కళ కోసం [11]
  • 1984: బీహార్ రత్న సమ్మాన్ [2] [4]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "In village where Madhubani paints, art and Nitish Kumar smile at each other". The Indian Express (in ఇంగ్లీష్). 2015-10-23. Retrieved 2022-03-01.
  2. 2.0 2.1 2.2 2.3 Dutta, Ambarish (December 14, 2005). "Madhubani art legend dead". The Tribune, Chandigarh, India - Nation. Retrieved 2022-03-01.
  3. 3.0 3.1 Tripathi, Shailaja (2013-11-22). "Madhubani beyond the living rooms". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2022-03-01.
  4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 "Sita Devi: A Legendary Mithila Artist". State of the Art (in అమెరికన్ ఇంగ్లీష్). 2013-02-11. Retrieved 2022-03-01.
  5. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; :3 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  6. "Mithila's pride". Frontline (in ఇంగ్లీష్). 10 February 2005. Retrieved 2022-03-01.
  7. Museum, Victoria and Albert. "Painting | Devi, Sita | V&A Explore The Collections". Victoria and Albert Museum: Explore the Collections (in ఇంగ్లీష్). Retrieved 2022-03-01.
  8. Iyengar, Radhika (2018-04-06). "Saffronart's forthcoming auctions feature rare finds". mint (in ఇంగ్లీష్). Retrieved 2022-03-01.
  9. Srivastava, Radhika (9 November 2005). "This Sita is the true 'Devi' of Jitwarpur". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-03-01.
  10. Chavda, Jagdish J. (1990). "The Narrative Paintings of India's Jitwarpuri Women".
  11. "Padma Awards | Interactive Dashboard". www.dashboard-padmaawards.gov.in (in ఇంగ్లీష్). Archived from the original on 2018-10-15. Retrieved 2022-03-01.