Jump to content

సుంకర వెంకట ఆదినారాయణరావు

వికీపీడియా నుండి
సుంకర వెంకట ఆదినారాయణరావు
జననం (1939-06-30) 1939 జూన్ 30 (వయసు 85)
భీమవరం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
విద్యఆంధ్ర మెడికల్ కళాశాల, విశాఖపట్నం
వృత్తిఆర్థోపెడిక్ సర్జన్
పురస్కారాలుపద్మశ్రీ (2022)[1]

సుంకర వెంకట ఆదినారాయణరావు (జననం.జూన్ 30 1939) భారతీయ ఎముకల వైద్యులు. ఆయన పేదలకు సేవలందించే వ్యక్తిగా ప్రఖ్యాతి పొందారు. ఆయన ఆశయాలు:సామాజిక న్యాయం,సామాజిక బాధ్యత అంరియు సమాజ సేవ.[2] ఆయన యొక్క గురువు ప్రొఫెసర్ చావలి వ్యాఘ్రేశ్వరుడు. ఆయన దేశంలో వివిధ ప్రాంతాలలో ఆదినారాయణ గారు జరిపే నేత్ర వైద్య శిబిరాలకు సహకారం అందిస్తుంటారు.ఆయనకు భారత ప్రభుత్వం 2022లో పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది[2].

బాల్యం, కుటుంబం

[మార్చు]

ఆయన పశ్చిమ గోదావరి జిల్లా లోని భీమవరం లో సుంకర శేషమ్మ, కనకం దంపతులకు జన్మించారు. వారి తల్లిదండ్రులు స్వాతంత్ర్య సమరయోధులు. వారు అనాథలను ఆదుకోవడం డబ్బు సంపాదించడం కంటే గొప్పదని పిల్లలకు బోధించేవారు.

ఆయన భార్య ఆర్.శశిప్రభ, కింగ్ జార్జి ఆసుపత్రిలో సూపరింటెంటెంట్ గా పనిచేస్తున్నారు. వారి సోదరుడు ప్రసిద్ధ న్యూరోసర్జన్ సుంకర బాలపరమేశ్వరరావు గారు. ఆయన సోదరుని ఆశయాల పట్ల ప్రభావితుడైనాడు.

విద్య

[మార్చు]

ఆయన ప్రారంభ, ఉన్నత విద్య భీమవరం లోని యు.ఎస్.సి.ఎం.ఉన్నత పాఠశాలలో జరిగింది. ఆయన క్రీడలు, క్షేత్ర ఆటలలో ఆసక్తి కనబరచేవాడు. పాఠశాల రోజులలో వ్యక్తిగత ఛాంపియన్ విభాగాలలో పాల్గొనేవారు.

ఆయన 1961-66 లలో విశాఖపట్నం లోని ఆంధ్రా మెడికల్ కళాశాల లో ఎం.బి.బి.ఎస్ చేసారు. 1970 లో అదే కళాశాల నుండి ఆర్థోపెడిక్ సర్జరీ లో ఎం.ఎస్.(ఆరోపెడిక్స్) ను పూర్తిచేసారు. తరువాత జర్మనీ వెళ్ళి మైక్రోవస్కులర్, హాండ్ సర్జరీ అంశాలలో శిక్షణ పొందారు. ఆయన ఆంధ్రా మెడికల్ కళాశాలలో కరిక్యులర్, నాన్ కరిక్యులర్ కార్యక్రమాలలొ ప్రధాన పాత్ర పోషించారు. ఆయన 100మీ పరుగు పందెంలో రికార్డు నెలకొల్పాదు. ఆయన విశ్వవిద్యాలయ క్రీడల పోటీలలో అనేక మెడళ్ళను పొందారు.

ఆయన ఆంధ్రా మెడికల్ కళాశాలలో ట్యూటర్,అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ గా పనిచేసారు. విశాఖపట్నంలోని కింగ్ జార్జి ఆసుపత్రిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్, సివిల్ సర్జన్ గా పనిచేసారు. రాణీ చంద్రమణి దేవి హాస్పటల్, రెహాబిలిటేషన్ సెంటర్ కు సూపరింటెండెంట్ గా పనిచేసారు. ఆయ అనేక పరిశోధనా పత్రాలను ప్రచురించారు. ఆయన త్రివేండ్రం లోని కిని మెమోరియల్ ఓరేషన్ లో ప్రసంగించారు. ఆయన "సర్జరీ ఆన్ పోలియో డిసెబిలిటీ" పుస్తక రచయిత, "ప్రిన్సిపిల్స్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ ఆర్థోపెడిక్స్" నాల్గవ ఎడిసన్-1993 కు సంపాదకులు.

ఐదున్నర దశాబ్దాల కాలంలో ఆయన 3 లక్షలకు పైగా పోలియో ఆపరేషన్లు నిర్వహించారు. దేశవ్యాప్తంగా 989 శిబిరాలు నిర్వహించారు. పోలియో ఆపరేషన్లతోపాటు ఇతర చికిత్సలు అందించేందుకు విశాఖలో ప్రేమ ఆస్పత్రిని నెలకొల్పారు. [3]

గుర్తింపు

[మార్చు]
  • జాన్సన్ అండ్ జాన్సన్ ఫెలోషిప్
  • ఇండియన్ ఆర్థోపెడిక్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ కు పూర్వపు అధ్యక్షుడు,
  • 1998లో వికలాంగుల పునరావాస రంగంలో ఆయన చేసిన ఉత్తమ సేవలకు గుర్తింపుగా జాతీయ అవార్డు.
  • ఆయన సామాజిక సేవలకు గాను దీపావళి బెన్ మోహన్‌లాల్ మెహతా అవార్డు.
  • మద్రాసు తెలుగు అకాడమీ వారిచే ఉగాది పురస్కారం
  • సామాజిక సేవా రంగంలో మానవ ప్రయత్నంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు ప్రతిష్టాత్మక భగవాన్ మహావీర్ అవార్డు.
  • దేశంలోని వివిధ రాష్ట్రాల్లో నిర్వహించిన ఉచిత పోలియో శస్త్ర చికిత్సా శిబిరాల సందర్భంగా 100 కంటే ఎక్కువ ప్రభుత్వేతర సంస్థలు సత్కరించి, విభిన్న బిరుదులను ప్రదానం చేశాయి.
  • భారత ప్రభుత్వం చే 2022 లో పద్మశ్రీ పురస్కారం.[4]

మూలాలు

[మార్చు]
  1. "పేదల డాక్టర్‌కు పద్మశ్రీ". 26 January 2022. Retrieved 28 October 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  2. 2.0 2.1 "Polio eradication is his mission in The Hindu". Archived from the original on 2011-06-06. Retrieved 2015-07-15.
  3. "డాక్టర్‌ ఆదినారాయణ రావు: నడక నేర్పిన వైద్యుడు". www.andhrajyothy.com. Retrieved 2022-01-26.
  4. Bureau, The Hindu (2022-01-25). "Full list of Padma Awards 2022". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2022-01-26.

ఇతర లింకులు

[మార్చు]