సుందర్ సీ
సుందర్ సీ | |
|---|---|
సుందర్ సీ | |
| జననం | సుందరవేల్ చిదంబరం పిళ్ళై 1968 జనవరి 21 |
| వృత్తి | నటులు, చలనచిత్ర దర్శకులు |
| క్రియాశీలక సంవత్సరాలు | 1995 – ఇప్పటి వరకు |
| భాగస్వామి | కుష్బూ |
| Parent(s) | చిదంబరం పిళ్ళై దెయివానై అమ్మాళ్ |
సుందర్ సీ తమిళ చలనచిత్ర దర్శకులు, నటుడు. వీరు తమిళనాడులోని ఈరోడు జిల్లాలో జన్మించారు, తమిళంలో 24 సినిమాలకు దర్శకత్వం వహించారు. "తలై నగరం" చిత్రముతో హీరోగా మారారు.[1] తొలి నాళ్ళలో, మణివణ్ణన్ గారి దగ్గర సహాయకులుగా ఉన్న వీరు ముఱై మామన్ అనే హాస్యరసప్రధాన చిత్రముతో మొదటిసారి దర్శకులురా మారారు. వీరి తెరకెక్కించిన కొన్ని చిత్రములలో హీరోయిన్ పాత్ర పేరు "ఇందు" అనబడుతుంది .
సినీరంగప్రవేశం
[మార్చు]దర్శకులుగా
[మార్చు]1995-వ సంవత్సరం ముఱై మామన్ అనే హాస్యరసప్రధాన చిత్రముతో సుందర్ సీ మొదటిసారి దర్శకులురా మారారు, ఆ తర్వాత ముఱైమాప్పిళ్ళై, అని నటుడు విజయకుమార్ తనయుడు అరుణ్ విజయ్ మొదటి సినిమాకు దర్శకత్వం వహించారు. రజనీకాంత్ గారితో అరుణాచలం, కమల్ హాసన్తో శివం మాత్రమే కాక మరికొందరి నటులతో అనగా కార్తీక్, ప్రశాంత్, అర్జున్, శరత్ కుమార్, అజీత్ కుమార్ మొదలైనవారి చిత్రములకు దర్శకత్వం వహించారు.ఇయన తెలుగులో నేరుగా దర్శకత్వం వహించిన చిత్రం సమ్ థింగ్ సమ్ థింగ్ .
నటుడిగా
[మార్చు]2006-వ సంవత్సరం అతని దర్శకత్వపు వృత్తిని విరమించి,తలై నగరం చిత్రముతో హీరోగా మారారు. ఆరంభ దశలో పరాజయం పొందినప్పటికీ తదుపరి ఘన విజయాలను సొంతం చేసుకున్నారు. 2007-వ సంవత్సరం విడుదలైన వీరాప్పు సినిమానూ, 2008-వ సంవత్సరం విడుదలైన శండై సినిమానూ విజయం పొందాయి.[2]
బుల్లి తెర ప్రవేశం
[మార్చు]2017-వ సంవత్సరం దక్షిణ భారత నాలుగు భాషలలో ఏకకాలంలో నందిని అనే దారవాహికను స్వయంగా తన సతీమణి కుష్బూ గారితో కలిసి నిర్మించారు.చలనచిత్రాన్ని తలపించేలా ఆ దారవాహికను రూపుదిద్ది ప్రముఖుల మన్ననలు అందుకున్నారు.అంతేకాక, ఈ దారవాహికకు పాక్షికంగా కథనందించారు.
ఫిల్మోగ్రఫీ
[మార్చు]సినిమాలు
[మార్చు]| † (**) | ఇంకా విడుదల కాని సినిమా లేదా టీవీ నిర్మాణాలను సూచిస్తుంది. |
నటుడిగా
[మార్చు]| సంవత్సరం | పేరు | పాత్ర | గమనికలు | మూ |
|---|---|---|---|---|
| 1990 | వాఝ్కై చక్రం | కానిస్టేబుల్ | కామియో | |
| 1993 | మూంద్రవధు కన్ | స్టూడియో అసిస్టెంట్ | ||
| 1995 | మురై మామన్ | గ్రామస్థుడు | ||
| 1997 | అరుణాచలం | రిపోర్టర్ | ||
| 2006 | తలై నగరం | సుబ్రమణ్యం "రైట్" | ప్రధాన అరంగేట్రం | |
| 2007 | వీరప్పు | పులిప్పండి | ||
| 2008 | సండై | కతిరేసన్ "కత్తి" | ||
| ఆయుధం సెయివోమ్ | సైదై సత్య | |||
| 2009 | పెరుమాళ్ | పెరుమాళ్ | ||
| థీ | ACP సారథి "సామి" | |||
| అయింతం పడై | ప్రభాకరన్ | |||
| 2010 | గురు శిష్యన్ | ఈటి | ||
| వాడ | వెట్రివేల్ | |||
| నగరం మారుపక్కం | సెల్వం | |||
| 2012 | మురట్టు కాలై | కాలైయన్ | ||
| 2014 | నినైతతు యారో | అతనే | కామియో | |
| అరణ్మనై | న్యాయవాది రవి | |||
| 2016 | అరణ్మనై 2 | రవి | ||
| ముత్తిన కాతిరికై | ముత్తుపండి | |||
| 2019 | యాక్షన్ | బాటసారుడు | కామియో | |
| ఇరుట్టు | ఇన్స్పెక్టర్ చెజియన్ | |||
| 2021 | అరణ్మనై 3 | రవి | ||
| 2022 | పట్టంపూచి | ఇన్స్పెక్టర్ కుమరన్ | ||
| 2023 | తలైనగరం 2 | కుడి | ||
| 2024 | అరణ్మనై 4 | న్యాయవాది శరవణన్ | ||
| 2025 | వల్లన్ | ఇన్స్పెక్టర్ దివాకర్ | ||
| గ్యాంగర్స్ | శరవణన్ | |||
| టిబిఎ | ఒకటి 2 ఒకటి † | టిబిఎ | చిత్రీకరణ |
దర్శకుడిగా
[మార్చు]| సంవత్సరం | పేరు | గమనికలు | మూ |
|---|---|---|---|
| 1995 | మురై మామన్ | ||
| మురై మాపిల్లై | |||
| 1996 | ఉల్లతై అల్లిత | ||
| మెట్టుకుడి | |||
| 1997 | అరుణాచలం | ||
| జానకిరామన్ | |||
| 1998 | నామ్ ఇరువర్ నమక్కు ఇరువర్ | ||
| 1999 | ఉన్నై తేడి | ||
| సుయంవరం | 14 మంది దర్శకులు దర్శకత్వం వహించారు | ||
| ఉనక్కగ ఎల్లం ఉనక్కగ | |||
| 2000 సంవత్సరం | అళగర్సామి | ||
| కన్నన్ వరువాన్ | |||
| ఉన్నై కన్ తేడుతే | |||
| 2001 | ఉల్లం కొల్లై పోగుతే | ||
| రిషి | |||
| అళగన నాట్కల్ | |||
| 2003 | అన్బే శివం | ||
| విజేత | |||
| 2004 | గిరి | ||
| 2005 | లండన్ | ||
| థకా థిమి థా | |||
| చిన్నా | |||
| 2006 | రెండు | ||
| 2010 | నగరం మారుపక్కం | ||
| 2012 | కలకలప్పు | ||
| 2013 | థీయ వేలై సెయ్యనుం కుమారు | తెలుగులో సమ్‌థింగ్ సమ్‌థింగ్‌గా పాక్షికంగా తిరిగి చిత్రీకరించబడింది. | |
| 2014 | అరణ్మనై | ||
| 2015 | అంబాలా | ||
| 2016 | అరణ్మనై 2 | ||
| 2018 | కలకలప్పు 2 | ||
| 2019 | వంత రాజవతాన్ వరువేన్ | ||
| యాక్షన్ | |||
| 2021 | అరణ్మనై 3 | ||
| 2022 | కాదల్ తో కాఫీ | ||
| 2024 | అరణ్మనై 4 | తెలుగులో బాక్ గా పాక్షికంగా తిరిగి చిత్రీకరించబడింది. | |
| 2025 | మధ గజ రాజా | విడుదల ఆలస్యం, 2012 లో చిత్రీకరించబడింది | |
| గ్యాంగర్స్ | |||
| 2026 | మూకుతి అమ్మన్ 2 † | చిత్రీకరణ | |
| పురుషన్ † | చిత్రీకరణ |
గాయకుడిగా
[మార్చు]| సంవత్సరం | పేరు | పాట | స్వరకర్త | గమనికలు | మూ |
|---|---|---|---|---|---|
| 2008 | సండై | "వాడీ ఎన్ కప్పకెళుంగు" | ధినా | రంగప్రవేశం | |
| 2010 | గురు శిష్యన్ | "సుబయ్య సుబయ్య" | ధినా | సత్యరాజ్ తో పాడారు. |
నిర్మాతగా
[మార్చు]ప్రధాన వ్యాసం: అవ్ని సినిమాక్స్
| సంవత్సరం | పేరు | దర్శకుడు | గమనికలు | మూ |
|---|---|---|---|---|
| 2016 | అరణ్మనై 2 | సుందర్ సి | సహ నిర్మాత | |
| 2016 | హలో నాన్ పేయ్ పెసురెన్ | ఎస్. భాస్కర్ | ||
| 2017 | మీసాయ మురుక్కు | హిప్ హాప్ తమీజా | ||
| 2019 | నాట్పే తునై | దేసింగు పార్థిబన్ | ||
| 2020 | నాన్ సిరితాల్ | రాణా | ||
| నాంగా రోంబా బిజీ | బద్రి | |||
| 2021 | అరణ్మనై 3 | సుందర్ సి | సహ నిర్మాత | |
| 2022 | పట్టంపూచి | బద్రి | ||
| 2024 | అరణ్మనై 4 | సుందర్ సి | సహ నిర్మాత | |
| 2025 | గ్యాంగర్స్ | సుందర్ సి | సహ నిర్మాత | |
| 2026 | మూకుతి అమ్మన్ 2 † | సుందర్ సి | సహ నిర్మాత |
టెలివిజన్
[మార్చు]| సంవత్సరం | సీరియల్ | విభాగం | మూ | |
|---|---|---|---|---|
| నిర్మాత | రచయిత | |||
| 2017–2018 | నందిని | [3] | ||
| 2018 | మాయ | [4] | ||
| 2018 –2020 | లక్ష్మి స్టోర్స్ | [5] | ||
| 2021 | జోతి | [6] | ||
మూలాలు
[మార్చు]- ↑ "Sundar C. is on a roll". தி இந்து. 2 October 2007. Archived from the original on 29 అక్టోబరు 2007. Retrieved 8 May 2010.
- ↑ Retrieved on 2009-02-05 Archived 2016-03-04 at the Wayback Machine. Bollywoodgate.com. Retrieved on 2012-04-19.
- ↑ Sebastian, Shilpa (31 July 2017). "Star shines on the tube". The Hindu. Archived from the original on 24 May 2021. Retrieved 26 April 2024.
- ↑ "Maya is my breakthrough in this industry: Times Fresh Face winner Madhan". Archived from the original on 7 May 2024. Retrieved 5 May 2024.
- ↑ "Tamil Tv Serial Lakshmi Stores". Archived from the original on 5 May 2024. Retrieved 5 May 2024.
- ↑ "லாக் டவுனை சமாளிக்க இதுதான் வழி: சன் டிவி களமிறக்கும் ஜோதி சீரியல்!". Archived from the original on 6 January 2023. Retrieved 5 May 2024.
బయట లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో సుందర్ సీ పేజీ