సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి
Sukhdev Singh Gogamedi
1వ శ్రీ రాష్ట్ర రాజ్‌పుత్ కర్ణి సేన[1]
In office
సెప్టెంబరు 2018 – 2023 డిసెంబరు 5
వ్యక్తిగత వివరాలు
జననం(1970-02-20)1970 ఫిబ్రవరి 20
గోగమేడి, హనుమాన్‌గఢ్ జిల్లా, రాజస్థాన్, భారతదేశం
మరణం2023 డిసెంబరు 5(2023-12-05) (వయసు 53) time 13:21:23
శ్యామ్ నగర్, జైపూర్ జిల్లా, రాజస్థాన్, భారతదేశం
జాతీయతభారతీయుడు

సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి (1970 ఫిబ్రవరి 20 - 2023 డిసెంబరు 5) భారతీయ సామాజిక కార్యకర్త, ఆయన రైట్-వింగ్ గ్రూప్ అయిన రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణి సేన అధ్యక్షుడు.

రాజ్‌పుత్‌లకు కుల ఆధారిత రిజర్వేషన్లను సమర్ధిస్తూ 2006లో ఏర్పడిన శ్రీ రాజ్‌పుత్ కర్ణి సేన వ్యవస్థాపకుడు లోకేంద్ర సింగ్ కల్వితో విభేదాల కారణంగా బహిష్కరించబడిన తర్వాత 2015లో, ఆయన రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణి సేనను స్థాపించాడు.

రాజ్‌పుత్ కమ్యూనిటీకి సంబంధించిన చారిత్రక వాస్తవాలను వక్రీకరించారని ఆరోపిస్తూ 2018లో దీపికా పదుకొనే నటించిన పద్మావత్‌పై ఈ రెండు సంస్థలు నిరసన వ్యక్తం చేశాయి.

2008లో అశుతోష్ గోవారికర్ బాలీవుడ్ చిత్రం జోధా అక్బర్‌ను వ్యతిరేకించిన తర్వాత కర్ణి సేన మొదటిసారిగా దృష్టిని ఆకర్షించింది, ఈ సినిమా రాజస్థాన్‌లో విడుదల కాలేదు.

మరణం[మార్చు]

సుఖ్‌దేవ్ సింగ్ గోగమేది రాజస్థాన్‌లోని జైపూర్‌లో 2023 డిసెంబర్ 5న ఆయన నివాసంలో ఇద్దరు అనుచరులతో కలిసి ఉన్న సుఖ్‌దేవ్ సింగ్‌పై బైకు మీద వచ్చిన ఇద్దరు దుండ‌గులు ఒక్కసారిగా కాల్పులు జరపడంతో ఆయన అక్కడికక్కడే మరణించాడు.[2] గోల్డీ బ్రార్ గ్యాంగ్ సభ్యుడు, రోహిత్ గోదార కపురిస్ర్ ఈ హత్యకు బాధ్యత వహించాడు.ఫేస్‌బుక్ పోస్ట్‌లో, "సుఖ్‌దేవ్ గోగమేడి హత్యకు మేము పూర్తి బాధ్యత వహిస్తాము" అని రాశారు.[3]

మూలాలు[మార్చు]

  1. "One-upmanship behind rise of various Karni Senas". The Times of India. 22 January 2018.
  2. "కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి దారుణ హత్య | Karni Sena President Sukhdev Singh Gogamedi Shot Dead In Jaipur - Sakshi". web.archive.org. 2023-12-10. Archived from the original on 2023-12-10. Retrieved 2023-12-10.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. Desk, DH Web. "Who was Rashtriya Rajput Karni Sena chief Sukhdev Singh Gogamedi?". Deccan Herald (in ఇంగ్లీష్). Retrieved 2023-12-10.