సుఖ్‌బున్స్ కౌర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సుఖ్‌బాన్స్ కౌర్ భిందర్ (1943–2006) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె గురుదాస్‌పూర్ నియోజకవర్గం నుండి ఆరుసార్లు లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికై దేశంలో ఆరుసార్లు, ఐదు సార్లు లోక్‌సభకు & రాజ్యసభకు ఒకసారి ఎంపీ అయిన ఏకైక మహిళ.[1]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

సుఖ్‌బాన్స్ 1943 సెప్టెంబర్ 14న లయల్‌పూర్‌లో (ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంది) జన్మించింది . ఆమె ముస్సోరీలోని జీసస్ అండ్ మేరీ కాన్వెంట్‌లో పాఠశాల విద్యను, తర్వాత చండీగఢ్‌లోని పంజాబ్ విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్‌తో పట్టభద్రురాలైంది. సుఖ్‌బాన్స్ మాజీ ఐపీఎస్ అధికారి ప్రీతమ్ సింగ్ భిండర్‌ను 12 అక్టోబర్ 1961న వివాహం చేసుకోగా వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

మరణం

[మార్చు]

సుఖ్‌బాన్స్ గ్యాస్ట్రిక్ వ్యాధులతో బాధపడుతూ 63 సంవత్సరాల వయస్సులో 15 డిసెంబర్ 2006న మరణించింది.[2][3]

మూలాలు

[మార్చు]
  1. "Mrs Bhinder only woman to become MP six times". news.webindia123.com. Retrieved 2017-07-29.
  2. "Former Cong leader Bhinder cremated". www.hindustantimes.com/ (in ఇంగ్లీష్). 2006-12-16. Retrieved 2017-07-29.
  3. "The Tribune, Chandigarh, India – Main News". www.tribuneindia.com. Retrieved 2017-07-29.