సుగంధ శక్తి పీఠం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సుగంధ శక్తి పీఠం (బెంగాలీ: সুগন্ধা শক্তিপীঠ) బంగ్లాదేశ్ లో గల సునంద దేవత ఆలయం. ఇది బాంగ్లాదేశ్ లో బరిసాల్ కు ఉత్తరాన పది మైళ్ళ దూరంలో ఉన్న శికర్పూర్ గ్రామంలో ఉంది. ఈ హిందూ దేవాలయం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి.[1]

పండగలు[మార్చు]

ఇక్కడి ప్రధాన పండుగ శివ-చతుర్దశి. ఈ పండుగ సాధారణంగా ప్రతి సంవత్సరం మార్చి 14వ తేదీన జరువుకుంటారు.

శక్తి పీఠం - చరిత్ర[మార్చు]

పవిత్రమైన సతీ దేవి మృతదేహాన్ని శివుడు మోస్తున్న దృశ్యం

ప్రాచీన సంస్కృత సాహిత్యాన్ని రూపొందించడంలో దక్ష యాగం, సతీదేవి స్వీయ దహనం వంటి పురాణాలు కథలు అపారమైన ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఇవి భారతదేశ సంస్కృతిపై కూడా అత్యంత ప్రభావం చూపాయి. ఇటువంటి సంఘటనలే శక్తి పీఠం అనే భావనల అభివృద్ధికి దారితీసి, అక్కడ శక్తివాదాన్ని బలోపేతం చేసాయి. పురాణాలలోని అపారమైన పౌరాణిక కథలు, దక్ష యాగం వంటివి ఈ శక్తి పీఠం ఏర్పడటానికి గల మూల కారణం. ఇది శైవమతంలో సతీ దేవి స్థానంలో శ్రీ పార్వతి దేవి ఆవిర్భవించడం, శివుడిని గృహస్తాశ్రమి (గృహస్థుడు)గా చేయడం వలన గణపతి, సుబ్రహ్మణ్య స్వామిల ఆవిర్భావానికి దారితీసిన ఒక ముఖ్యమైన సంఘటన.

శక్తి పీఠాలు పార్వతీ దేవి వివిధ అవతారాల పుణ్యక్షేత్రాలు, దివ్య స్థలాలు. సతీదేవి మృతదేహాన్ని శివుడు మోసుకుని దుఃఖంతో ఆర్యవర్తం అంతటా సంచరించినప్పుడు ఆమె శరీర భాగాలు పడిపోవడం వల్ల శక్తి ఉనికితో ప్రతిష్టించబడిన ప్రదేశాలు శక్తి పీఠాలు. సంస్కృతంలోని 51 వర్ణమాలలకు 51 శక్తి పీఠాలు అనుసంధానించబడి ఉన్నాయి. ప్రతి ఆలయంలో శక్తి, కాలభైరవ దేవాలయాలు ఉన్నాయి. చాలావరకు ప్రతి ఆలయం ఆ ఆలయంలోని శక్తి, కాలభైరవులకు వేర్వేరు పేర్లను కలిగి ఉంటుంది.

పురాణ కథ[మార్చు]

సతీదేవిని, పార్వతి దేవి మొదటి అవతారంగా శివుని మొదటి భార్యగా చెబుతారు. ఆమె దక్ష రాజు, రాణి (బ్రహ్మ కుమార్తె)కి కుమార్తె. తన భర్తను తన తండ్రి అవమానించినందుకు తీవ్రంగా మనోవేదనకు గురైన ఆమె తన తండ్రి దక్షుడు చేసిన యజ్ఞ యాగం వద్ద ఆత్మాహుతి చేసుకుంది. ఆ యజ్ఞానికి దక్షుడు వారిద్దరినీ పిలవలేదు. తన భార్య మరణం గురించి విన్న తర్వాత శివుడు ఎంతగానో బాధపడ్డాడు, అతను సతీదేవి మృతదేహాన్ని తన భుజాలపై మోస్తూ తాండవ నృత్యం ("విధ్వంసక తపస్సు" లేదా విధ్వంసక నృత్యం) చేస్తూ ప్రపంచవ్యాప్తంగా నృత్యం తిరిగాడు. ఈ పరిస్థితితో కలత చెంది, శివుడిని సాధారణ స్థితికి తీసుకురావడానికి, విష్ణువు తన సుదర్శన చక్రాన్ని (అతని వేలి కొనపై ఉంచే ఆయుధం) ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు. అతను చక్రంతో సతీ శరీరాన్ని అనేక ముక్కలుగా చేసాడు, అపుడు ఆమె శరీర భాగాలు భూమిపై ఎక్కడ పడితే అక్కడ శివ దేవతలతో కూడిన దివ్యమైన పుణ్యక్షేత్రంగా శక్తి పీఠంగా ప్రతిష్టించబడ్డాయి. ఈ ప్రదేశాలు పిఠాలు లేదా శక్తి పీఠాలుగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలుగా మారాయి. భారతదేశం కాకుండా పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్‌తో సహా ఉపఖండం అంతటా చెల్లాచెదురుగా ఉన్నాయి. సతీదేవిని దేవి లేదా శక్తి అని కూడా పిలుస్తారు. విష్ణువు ఆశీర్వాదంతో ఆమె హిమవత్ లేదా హిమాలయాల కుమార్తెగా పునర్జన్మ పొందింది. అందుకే పార్వతి (పర్వతాల కుమార్తె) అని పేరు పెట్టారు. ఆమె శివరాత్రి (శివుని రాత్రి) పండుగను సూచించే మృగశిర నక్షత్రంలో ప్రకాశవంతంగా పదునాల్గ వ రోజున జన్మించింది.[2]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Explained: What is the significance of the places on PM Modi's Bangladesh itinerary?". The Indian Express (in ఇంగ్లీష్). 2021-03-20. Retrieved 2021-03-21.
  2. Kapoor, Subodh (2002). The Indian Encyclopaedia. New Delhi: Cosmo Publications. p. 6325.