సుడిగుండం
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
సుడిగుండం అంటే గుండ్రంగా తిరిగే ఒక నీటి ప్రవాహం. ఇవి పెద్ద నదులు, సముద్రాలలోనే కనిపిస్తాయి. చాలా వరకు సుడిగుండాలు అంత శక్తివంతమైనవిగా ఉండవు. నీరు గుండ్రంగా తిరుగుతూ దగ్గరలోని పడవలను తలక్రిందులు చేస్తాయి అనేది అపోహ మాత్రమే. అతి శక్తివంతమైన సుడిగుండాల్ని 'మేల్ స్ట్రం' (Maelstrom) అని అంటారు. చిన్న సుడిగుండాలు స్నానాల తొట్టి లేదా సింక్ నుండి నీరు త్వరగా వదిలినప్పుడు ఏర్పడతాయి. అలాగే జలపాతాల నుండి నీరు క్రిందపడే ప్రదేశంలో ఏర్పడే నీటికయ్యలలో సుడిగుండాలు ఏర్పడతాయి. శక్తివంతమైన జలపాతాల వద్ద ఇలా ఏర్పడే సుడిగుండాలు కూడా శక్తివంతమైనవిగా ఉంటాయి.
ప్రపంచంలోని ఐదు శక్తివంతమైన సుడిగుండాలలో నార్వేలో కనుగొన్నది సుమారు గంటకు 37 కి.మీ. వేగం కలిగివున్నది; మిగిలిన నాలుగు నార్వే, కెనడా, జపాన్, స్కాట్లాండ్ లలో కనిపించినవి సుమారు 27.8 నుండి 18 కి.మీ. వేగం కలిగివున్నాయి.