Jump to content

సునిధి చౌహాన్ (గాయని)

వికీపీడియా నుండి
సునిధి చౌహాన్
2015లో, ది వాయిస్ ఇండియా - ఇండియన్ టీవీ సిరీస్ ప్రారంభోత్సవంలో సునిధి చౌహాన్
జననం (1983-08-14) 1983 ఆగస్టు 14 (వయసు 41)
న్యూ ఢిల్లీ, భారతదేశం
వృత్తిగాయని
క్రియాశీల సంవత్సరాలు1996–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
బాబీ ఖాన్
(m. 2002; div. 2003)
హితేష్ సోనిక్
(m. 2012)
పిల్లలు1

సునిధి చౌహాన్ (జననం 1983 ఆగస్టు 14) భారతీయ నేపథ్య గాయని. ఆమె గాయకురాలిగా బహుముఖ ప్రజ్ఞకు ప్రసిద్ధి చెందింది.[1] ఆమె నాలుగు సంవత్సరాల వయస్సు నుంచే ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించింది. 13 సంవత్సరాల వయస్సులో శాస్త్ర (1996) చిత్రంతో కెరీర్‌ ప్రారంభించింది. అదే సంవత్సరం, మేరీ అవాజ్ సునో అనే రియాలిటీ షోను ఆమె మొదటిసారిగా నిర్వహించింది.

ఆమె మస్త్ (1999) చిత్రంలోని "రుకీ రుకీ సి జిందగీ" పాటతో మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. అంతేకాకుండా, తన సంగీత ప్రతిభకు ఫిల్మ్‌ఫేర్ ఆర్.డి బర్మన్ అవార్డును గెలుచుకుంది. ఉత్తమ నేపథ్య గాయనిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు ఆమె నామినేట్ చేయబడింది.

ప్రారంభ జీవితం

[మార్చు]

సునిధి చౌహాన్ 1983 ఆగస్టు 14న భారతదేశంలోని న్యూఢిల్లీలో జన్మించింది.[2] ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆమె తండ్రి దుష్యంత్ కుమార్ చౌహాన్ శ్రీరామ్ భారతీయ కళా కేంద్రంలో రంగస్థల కళాకారుడు.[3] ఆమె తల్లి, గృహిణి. ఆమెకు ఒక చెల్లెలు కూడా ఉంది.[4] నాలుగు సంవత్సరాల వయస్సులో, ఆమె స్థానిక సమావేశాలలో ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించింది.[5]

ఆమె గ్రీన్‌వే మోడరన్ స్కూల్‌లో చదువుకుంది. ఢిల్లీలోని దిల్షాద్ గార్డెన్‌లో తన కుటుంబ సభ్యులతో కలిసి ఉండేది. ఆమెకు 11 ఏళ్లు ఉన్నప్పుడు, వారు ముంబైకి మకాం మార్చారు.[6] ఆమె కళ్యాణ్‌జీ అకాడమీలో చేరింది. అతని "లిటిల్ వండర్స్" ట్రూప్‌లో ప్రధాన గాయనిగా మారింది.[7]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

2002లో, 18 సంవత్సరాల వయస్సులో, ఆమె మ్యూజిక్ వీడియో పెహ్లా నాషా చేసాక దర్శకుడు, కొరియోగ్రాఫర్ బాబీ ఖాన్ ని వివాహం చేసుకుంది.[8][9] ఈ వివాహం తనకు, తల్లిదండ్రుల మధ్య విభేదాలకు దారితీసింది. ఒక సంవత్సరం తరవాత వారి వివాహబంధం విడాకులతో వీగిపోయింది.[10] ఆ తరువాత, తల్లిదండ్రులతో మళ్లి ఆమెకు సయోధ్య కుదిరింది.[11]

మేరీ అవాజ్ సునో కార్యక్రమం రోజుల నుండి స్నేహితుడైన సంగీత స్వరకర్త హితేష్ సోనిక్‌ ని ఆమె 2012 ఏప్రిల్ 24న గోవాలో తిరిగి వివాహం చేసుకుంది.[12][13] వారికి 2018 జనవరి 1న అబ్బాయి తేగ్ జన్మించాడు.[14]

మూలాలు

[మార్చు]
  1. "Happy Birthday Sunidhi Chauhan: 5 songs that prove the mastery of this versatile singer". The Indian Express (in ఇంగ్లీష్). 2017-08-14. Retrieved 2021-08-10.
  2. Gupta, Priya (30 July 2013). "I get crazily happy when I am nominated: Sunidhi Chauhan". The Times of India. Archived from the original on 30 October 2017. Retrieved 13 October 2015.
  3. Verma, Rene (5 August 2015). "Birthday Special: Sunidhi Chauhan's journey from a singer to a rockstar TV judge". India Today. Archived from the original on 13 November 2015. Retrieved 13 October 2015.
  4. Verma, Rene (5 August 2015). "Birthday Special: Sunidhi Chauhan's journey from a singer to a rockstar TV judge". India Today. Archived from the original on 13 November 2015. Retrieved 13 October 2015.
  5. Rao, Nilesh (31 October 2013). "My dad has been the guiding force in my life, says Sunidhi Chauhan". Mid-Day. Archived from the original on 22 December 2015. Retrieved 1 December 2015.
  6. Vijayakar, Rajiv (17 March 2013). "Reigning queen bees". Deccan Herald. Archived from the original on 22 December 2015. Retrieved 13 October 2015.
  7. Sen, Debarati S (27 February 2015). "Sunidhi Chauhan: Working with Sajid-Wajid is like working at home". The Times of India. Archived from the original on 31 October 2017. Retrieved 13 October 2015.
  8. Sunidhi Chauhan to tie the knot again. India Today. 12-03-2012.
  9. Fernandes, Vivek (5 April 2002). "Sunidhi Chauhan marries Bobby Khan". Rediff.com. Archived from the original on 4 March 2016. Retrieved 15 December 2015.
  10. "Sunidhi talks about her husband & divorce on Indian Idol 5". The Siasat Daily. 13 August 2010. Archived from the original on 15 December 2015. Retrieved 15 December 2015.
  11. Wilkinson, James (15 February 2010). "Sunidhi Chauhan in Dubai". Time Out. Times Out Dubai. Archived from the original on 22 December 2015. Retrieved 20 October 2015.
  12. Sinha, Divashri (9 August 2012). "Divorced young, found love again". The Times of India. Archived from the original on 10 March 2016. Retrieved 15 December 2015.
  13. "Sunidhi Chauhan's 'I do' date set". The Times of India. 23 April 2012. Archived from the original on 26 August 2014. Retrieved 15 December 2015.
  14. Thakur, Charu (2 January 2018). "Singer Sunidhi Chauhan blessed with a baby boy". India Today. Archived from the original on 10 January 2018. Retrieved 3 January 2018.