సునీతా గోవారికర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సునీతా గోవారికర్
2012లో సునీతా గోవారికర్
జననం
సునీతా ముఖర్జీ

భారతదేశం
జాతీయతఇండియన్
ఇతర పేర్లుసునీత ఎ. గోవారికర్
వృత్తినటి, మోడల్, సినిమా నిర్మాత
జీవిత భాగస్వామిఅశుతోష్ గోవారికర్
పిల్లలు2
తల్లిదండ్రులు
  • దేబ్ ముఖర్జీ (తండ్రి)
  • మనీషా (తల్లి)
బంధువులుఅయాన్ ముఖర్జీ (సోదరుడు)

సునీతా గోవారికర్ భారతీయ మోడల్, సినిమా నిర్మాత.

నేపథ్యం[మార్చు]

ముంబైలో జన్మించిన సునీతా గోవారికర్ తండ్రి దేబ్ ముఖర్జీ, తల్లి మనీషా ఇద్దరూ నటులు.

మిథిబాయి కాలేజీ నుండి ఆనర్స్‌తో సైకాలజీలో బ్యాచిలర్ డిగ్రీని సునీతా గోవారికర్ పూర్తి చేసింది. ఆమె సుహానా వంట నూనె, నైసిల్ ప్రిక్లీ హీట్ పౌడర్, ప్రామిస్ టూత్‌పేస్ట్, ఫ్రూటీ వంటి బ్రాండ్‌లకు మోడల్‌గా చేసింది. ఆమె ఎయిర్ హోస్టెస్‌గా కూడా ఎయిర్ ఇండియాలో కొద్దికాలం పనిచేసింది.

వ్యక్తిగత జీవితం[మార్చు]

ఆమె భారతీయ చలనచిత్ర దర్శకుడు అశుతోష్ గోవారికర్‌ను వివాహం చేసుకుంది. ఈ దంపతులకు కోణార్క్ గోవారికర్, విశ్వాంగ్ గోవారికర్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆమె భారతీయ చలనచిత్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ సోదరి. ఇతను దేబ్ ముఖర్జీ రెండవ భార్య అమృత కుమారుడు.

ఫిల్మోగ్రఫీ[మార్చు]

నిర్మాతగా[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "13 Years Of Jodha Akbar: Sunita Gowariker Shares Interesting Facts On Jodha Akbar - Sakshi". web.archive.org. 2023-02-19. Archived from the original on 2023-02-19. Retrieved 2023-02-19.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)