సునీల్ రాణే
సునీల్ రాణే | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2019 అక్టోబర్ 24 - 2024 నవంబర్ 23 | |||
ముందు | వినోద్ తావ్డే | ||
---|---|---|---|
తరువాత | సంజయ్ ఉపాధ్యాయ్ | ||
నియోజకవర్గం | బోరివలి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | ముంబై, మహారాష్ట్ర, భారతదేశం | 1963 సెప్టెంబరు 3||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | వర్షా రాణే | ||
నివాసం | ముంబై, మహారాష్ట్ర, భారతదేశం | ||
పూర్వ విద్యార్థి | ముంబై విశ్వవిద్యాలయం | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
సునీల్ రాణే (జననం 3 సెప్టెంబర్ 1963) మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో బోరివలి శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
సునీల్ రాణే తండ్రి దత్తాత్రయ్ రాణే మహారాష్ట్ర ప్రభుత్వంలో మాజీ క్యాబినెట్ మంత్రి.[2][3]
జననం, విద్యాభాస్యం
[మార్చు]సునీల్ రాణే 1963 సెప్టెంబర్ 3న మహారాష్ట్ర రాష్ట్రం, ముంబైలోని వర్లీలో దత్తాత్రయ్ రాణే, కల్పనా రాణే దంపతులకు జన్మించాడు. ఆయన ముంబైలోని బాల్మోహన్ విద్యా మందిర్ లో పదవ తరగతి, డీజీ రూపారెల్ కళాశాల నుండి ఇంటర్మీడియట్ పూర్తి చేసి ముంబై యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్‌లో పట్టా అందుకున్నాడు.
రాజకీయ జీవితం
[మార్చు]సునీల్ రాణే 1998లో భారతీయ జనతా పార్టీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి భారతీయ జనతా పార్టీలో ముంబై యూనిట్‌కు ప్రధాన కార్యదర్శిగా, 1997 నుండి 2000 వరకు మహారాష్ట్ర రాష్ట్ర భారతీయ జనతా యువ మోర్చా ఉపాధ్యక్షుడిగా, 2004లో షెవ్రీ నియోజకవర్గం, 2014లో వర్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయి 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో బోరివలి శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి కుమార్ ఖిలారేపై 95,021 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4] ఆయన 1,23,712 ఓట్లతో విజేతగా నిలవగా, కుమార్ ఖిలారేకి 28,691 ఓట్లు వచ్చాయి.
మూలాలు
[మార్చు]- ↑ "Maharashtra Election 2019 Winners Full List: Check full list of winning candidates in Maharashtra Vidhan Sabha Chunav 2019". The Financial Express (in English). 25 October 2019. Archived from the original on 26 October 2022. Retrieved 26 October 2022.
{{cite web}}
: CS1 maint: unrecognized language (link) - ↑ India Today (21 October 2019). "Maharashtra Assembly election 2019: All dynasty candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 4 December 2024. Retrieved 4 December 2024.
- ↑ "The 10 BJP dynasts who have won in Maharashtra" (in ఇంగ్లీష్). Rediff. 24 October 2019. Archived from the original on 30 November 2024. Retrieved 30 November 2024.
- ↑ The Indian Express (24 October 2019). "Maharashtra election result 2019: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.