సుబ్బరామన్ విజయలక్ష్మి
సుబ్బరామన్ విజయలక్ష్మి | |
---|---|
దేశం | భారతదేశం |
పుట్టిన తేది | చెన్నై, తమిళనాడు, భారతదేశం | 1979 మార్చి 25
టైటిల్ | ఇంటర్నేషనల్ మాస్టర్ (2001) ఉమెన్ గ్రాండ్ మాస్టర్ (2001) |
ఫిడే రేటింగ్ | 2332 (మార్చి 2020) |
అత్యున్నత రేటింగ్ | 2485 (అక్టోబరు 2005) |
ఎస్. విజయలక్ష్మి(జననం 1979 మార్చి 25) భారతీయ చెస్ క్రీడాకారిణి. ఆమె FIDE టైటిళ్ళు ఇంటర్నేషనల్ మాస్టర్ (IM), ఉమెన్ గ్రాండ్ మాస్టర్ (WGM) కలిగి ఉంది.[1] భారతదేశంలో ఈ టైటిల్స్ సాధించిన మొదటి మహిళా క్రీడాకారిణి. అంతేకాకుండా భారతదేశం తరఫున చెస్ ఒలింపియాడ్స్‌లో ఆమె అందరికంటే ఎక్కువ పతకాలు సాధించింది. ఆమె సీనియర్ టైటిల్‌తో సహా జాతీయ స్థాయిలో దాదాపు అన్ని ఏజ్ గ్రూపు టైటిల్‌లను గెలుచుకుంది.
కెరీర్
[మార్చు]1986లో తాల్ చెస్ ఓపెన్ ఆమె ఆడిన మొదటి టోర్నమెంట్. 1988లో, 1989లో U10 బాలికల విభాగంలో ఆమె భారత ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది. U12 విభాగంలో కూడా ఆమె రెండుసార్లు గెలిచింది.
వ్యక్తిగత జీవితం
[మార్చు]చెన్నైలో పుట్టిన ఆమె తండ్రి దగ్గరే చదరంగం ఆట నేర్చుకుంది.[2] ఆమె భారత గ్రాండ్ మాస్టర్ శ్రీరామ్ ఝాను వివాహం చేసుకుంది. ఆమె సోదరీమణులు సుబ్బరామన్ మీనాక్షి ఉమెన్ గ్రాండ్ మాస్టర్ కాగా సుబ్బరామన్ భానుప్రియ కూడా చెస్ క్రీడాకారిణే కావడం విశేషం.
అవార్డులు
[మార్చు]2000లో భారత ప్రభుత్వం ఆమెను అర్జున అవార్డుతో సత్కరించింది.
మూలాలు
[మార్చు]- ↑ Sagar Shah (25 March 2015). "Vijayalakshmi, India's first WGM". ChessBase. Retrieved 6 November 2015.
- ↑ D.K. Bharadwaj (13 May 2003). "A big boom in the brain game". Press Information Bureau, Government of India.