సుమతి మురార్జీ
సుమతి మురార్జీ | |
---|---|
జననం | జమున 1909 మార్చి 13 |
మరణం | 1998 జూన్ 27 | (వయసు 89)
సుపరిచితుడు/ సుపరిచితురాలు | సింధియా ఆవిరి నావిగేషన్ కంపెనీ |
పురస్కారాలు | పద్మ విభూషణ్ (1971) |
నోట్సు | |
సుమతి మురార్జీ(ఆంగ్లం:Sumati Morarjee)(1909 మార్చి 13[2] - 1998 జూన్ 27[3]), భారత మొదటి షిప్పింగ్ మహిళగా జనాదరణ పొందిన భారత జాతీయ స్టీమ్ షిప్ యజమానులు సంఘం స్థాపకురాలు. 1971లో భారత ప్రభుత్వం ఈమె సమాజానికి అందిస్తున్న సేవలకు గాను రెండవ అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ అందజేసింది.
తొలినాళ్లలో
[మార్చు]సుమతి మురార్జీ బాంబే నగరంలో గోకుల్ దాస్ ప్రేమ బాయి దంపతులకు ఒక సంపన్న కుటుంబంలో జన్మించింది. ఆమెకు బృందావనంలో ప్రవహించే నది పేరున జమున అని పేరు పెట్టారు.
సింధియా స్టీమ్ నావిగేషన్ కంపెనీ
[మార్చు]సుమతి మురార్జీ 1923 సంవత్సరంలో తన 14వ ఏట నుండే ఏజెన్సీ కంపెనీ బాధ్యత నిర్వహించేది. దాదాపుగా 23 ఏళ్ల పాటు కంపెనీ నిర్మాణానికి వివిధ రకాలుగా ప్రణాళికలు నిర్వహించి 1946లో 6 వేల మంది ఉద్యోగులతో ఈ సంస్థ నిర్వహించేది. కాలక్రమేణా ఈ సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో సభ్యురాలిగా బాధ్యతలు చేపట్టింది, ఈ ప్రయాణంలో షిప్పింగ్ వ్యాపారానికి సంబంధించి చక్కటి నైపుణ్యం ఏర్పరచుకుంది. 1956లో భారత జాతీయ స్టీమ్ షిప్ యజమానుల సంఘానికి అధ్యక్షురాలిగా ఎన్నికైంది. ఈమె అధ్యక్షతన షిప్పింగ్ యజమానులు సంఘం 43 షిప్పింగ్ నాళాలతో 5,52,000 టన్నుల బరువును నిర్వహించే స్థాయికి చేరుకుంది.[4]
1979 నుండి 1987 వరకు మురార్జీ ఈ కంపెనీకి చైర్‌పర్సన్‌గా ఉంది, ఆ తరువాత ఈ సంస్థను ప్రభుత్వం తన హాయాంలోకి తీసుకుంది. 1992లో ప్రభుత్వం ఈమెను మళ్ళి సంస్థ చైర్‌పర్సన్‌గా నియమించింది.
సాధనలు, స్థాపనలు
[మార్చు]- ముంబైలోని జుహులో ఉన్న సుమతి విద్యా కేంద్ర పాఠశాల స్థాపన.
- 1965 లో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం(ఇస్కాన్) వ్యవస్థాపకుడు ఆచార్య స్వామి ప్రభుపాదకు సహాయం అందించింది.[5]
- 1970 లో లండన్‌లోని వరల్డ్ షిప్పింగ్ ఫెడరేషన్ ఉపాధ్యక్షురాలి పదవి.
- నరోత్తం మొరార్జీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ షిప్పింగ్ చైర్‌పర్సన్‌గా పనిచేసింది.
- భారతదేశ విభజన సమయంలో పాకిస్తాన్ నుండి సింధీలను తీసుకురావడంలో ఆమె కీలక పాత్ర పోషించింది.
- ఆధునిక భారతీయ షిప్పింగ్ కంపెనీలకు ఒక నమూనాను స్థాపించడానికి సహాయపడింది, ప్రపంచానికి వ్యాపార విలువలను అందించడమే కాకుండా భారతీయ సంస్కృతి అలాగే వారసత్వ ఆలోచనలను ప్రచారం చేయడానికి కూడా సహాయపడింది.
మరణం
[మార్చు]సుమతి మురార్జీ 89 సంవత్సరాల వయసులో 1998 జూన్ 27 న గుండెపోటు కారణంగా మరణించింది.
మూలాలు
[మార్చు]- ↑ Satyaraja Dasa. "Passage from India: Sumati Morarjee and Prabhupada's Journey West | Back to Godhead". Btg.krishna.com. Archived from the original on 2013-11-04. Retrieved 2012-07-09.
- ↑ Manabendra Nath Roy (1999). The Radical Humanist. Maniben Kara. p. 38. Retrieved 22 March 2016.
- ↑ Fairplay. Fairplay Publications Limited. June 1998. p. 62. Retrieved 22 March 2016.
- ↑ "SHIPPING BOSS TO OPEN NEW SERVICE". The Straits Times. 22 November 1971. p. 8. Retrieved 21 June 2012.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-11-04. Retrieved 2021-09-16.
బయటి లంకెలు
[మార్చు]- ప్రభుపాద సుమతి మురార్జీకి రాసిన ఉత్తరం Archived 2017-09-15 at the Wayback Machine