సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకనీ (పాట)
Appearance
(సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకనీ నుండి దారిమార్పు చెందింది)
"సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకనీ" | |
---|---|
రచయిత | సిరివెన్నెల సీతారామశాస్త్రి |
సంగీతం | శ్రీ |
సాహిత్యం | సిరివెన్నెల సీతారామశాస్త్రి |
ప్రచురణ | గాయం (1993) |
రచింపబడిన ప్రాంతం | ఆంధ్రప్రదేశ్ |
భాష | తెలుగు |
గాయకుడు/గాయని | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
చిత్రంలో ప్రదర్శించినవారు | రేవతి |
సురాజ్యమవలేని పాట 1993లో విడుదలైన గాయం చిత్రంలోని పాట. ఈ పాట రాసినందుకు సిరివెన్నెల సీతారామశాస్త్రి రాష్ట్రస్థాయిలో ఉత్తమ గీత రచయితగా నంది బహుమతి వచ్చింది. శ్రీ సంగీతం అందించిన ఈ పాటను ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం పాడాడు.[1][2][3]
పాటలోని సాహిత్యం
[మార్చు]పల్లవి:
సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకనీ
సుఖాన మనలేని వికాసమెందుకనీ
నిజాన్ని బలికోరే సమాజమెందుకనీ
అడుగుతోంది అదిగో ఎగిరే భరత పతాకం
చరణం 1:
ఆవేశంలో ప్రతి నిమిషం ఉరికే నిప్పుల జలపాతం
కత్తి కొనల ఈ వర్తమానమున బ్రతకదు శాంతి కపోతం
బంగరు భవితకు పునాది కాగల యువత ప్రతాపాలు
భస్మాసుర హస్తాలై ప్రగతికి సమాధి కడుతుంటే
శిరసు వంచెనదిగో ఎగిరే భరత పతాకం
చెరుగుతోంది ఆ తల్లి చరితను విశ్వవిజయాల విభవం || సురాజ్యమవలేని ||
పురస్కారాలు
[మార్చు]- సిరివెన్నెల సీతారామశాస్త్రి- ఉత్తమ గీత రచయితగా నంది పురస్కారాలు -1993
మూలాలు
[మార్చు]- ↑ "Gaayam Songs Download". Naa Songs. 2014-05-02. Retrieved 2020-12-22.
- ↑ SenSongs (2018-11-15). "Gaayam Songs Download |Jagapathi Babu's Gaayam Mp3 Songs". NaaSongs.Com.Co. Retrieved 2020-12-22.
- ↑ "Gaayam Mp3 Songs Free Download 1993 Telugu Movie". SenSongsMp3.Co.In. 2015-07-07. Archived from the original on 2021-03-05. Retrieved 2020-12-22.