సురేంద్రపురి హనుమదీశ్వర ఆలయం
నల్లగొండ జిల్లాలోని యాదగిరి గుట్టకు సమీపంలో భువనగిరి మండలంలోని వడాయిగూడెం గ్రామ పరిధిలో ఈ ఆలయం ఉన్నది. ఈ ఆలయాన్ని కుందా సత్యనారాయణ, 1991లో అనారోగ్యం బారినపడి మృతిచెందిన తన చిన్న కుమారుడు సురేందర్ జ్ఞాపకార్థం సురేంద్రపురి పేరిట ఈ కళాధామాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా నిర్మించాడు.[1]
ప్రత్యేకతలు
[మార్చు]కళకు పెద్దపీట వేస్తూ కట్టిన ఈ దేవాలయంలో భారీ పంచముఖ హనుమంతుని విగ్రహం భక్తుల దృష్టిని ఇట్టే ఆకర్షిస్తుంది. ఈ విగ్రహం వెనుకనుండి చూస్తే పంచముఖ శివుడు దర్శనమిస్తాడు. ఈ దేవాలయ ముఖద్వారం త్రిమూర్తులతో వైభవంగా ఉంటుంది. ప్రపంచంలో మొట్టమొదటి సారిగా నవ గ్రహాలకు సతీ సమేతంగా, వాహన సమేతంగా, అధి దేవత, ప్రత్యధి దేవతల సమేతంగా విడివిడిగా 9 గుడులు కట్టినారు. పంచముఖ హనుమంతుడు, శివుడు, వెంకటేశ్వరస్వామి దేవాలయంలో కొలువుతీరి ఉన్నారు. దేవాలయంలోపల హుండీలను చాలా కళాత్మకంగా తీర్చిదిద్దారు. ఇవి కలశాలను పోలి ఉంటుంది. ఒక కలశం మీద అష్టలక్ష్ములను చెక్కితే, మరో కలశంమీద, వినాయకుడు, శివుడు, పార్వతి, కుమారస్వామి బొమ్మలను చెక్కారు. ఇక్కడ పుట్టమన్నుతో చేసిన శివలింగాలను అర్చించిన గ్రహదోశాలు తొలగుతాయని భక్తుల నమ్మకం.
అక్టోబర్ 2008 లో ఈ ప్రాగణానికి సందర్శకులను అనుమతించినప్పటికినీ, జనవరి 2009 వరకు మెరుగులుదిద్దుతూనే ఉన్నారు. ఫిబ్రవరి 8, 2009 న దీనిని ప్రారంభించారు
వేపచెట్టు లక్ష్మీస్వరూపం, రావి చెట్టు విష్ణు స్వరూపం. కనుక ఈ రెండు వృక్షాలకు పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అంతేకాక వేప, రావి చెట్లకు వివాహం చేస్తారు. వేపచెట్టు రాత్రింబవళ్లు ప్రాణవాయును ఇస్తుంది. కాబట్టి ఈ వృక్షానికి దగ్గరగా నివాసం ఏర్పాటు చేసుకుంటే మంచిది.
ప్రాశస్త్యం
[మార్చు]నల్లగొండ జిల్లాలోని యాదగిరి గుట్టకు సమీపంలో గల ఈ సురేంద్రపురి హనుమదీశ్వర ఆలయం తప్పక దర్శించదగిన క్షేత్రం. కళకు పెద్దపీట వేస్తూ కట్టిన ఈ దేవాలయంలో భారీ పంచముఖ హనుమంతుని విగ్రహం భక్తుల దృష్టిని ఇట్టే ఆకర్షిస్తుంది. ఈ విగ్రహం వెనుకనుండి చూస్తే పంచముఖ శివుడు దర్శనమిస్తాడు. ఈ దేవాలయ ముఖద్వారం త్రిమూర్తులతో వైభవంగా ఉంటుంది.
ప్రపంచంలో మొదటిసారిగా నవ గ్రహాలకు సతీ సమేతంగా, వాహన సమేతంగా, అధి దేవత, ప్రత్యధి దేవతల సమేతంగా విడివిడిగా తొమ్మిది ఆలయాలను ఇక్కడ నిర్మించారు. పంచముఖ హనుమంతుడు, శివుడు, వెంకటేశ్వరస్వామి ఈ దేవాలయంలో కొలువుతీరి ఉన్నారు. దేవాలయంలోపల హుండీలను చాలా కళాత్మకంగా కలశాలను పోలినట్లుగా తీర్చిదిద్దారు.
ఈ హుండీలలో ఒక కలశం మీద అష్టలక్ష్మీదేవిలను చెక్కితే... మరో కలశంమీద, వినాయకుడు, శివుడు, పార్వతి, కుమారస్వామి బొమ్మలను చెక్కారు. ఈ ఆలయంలో పుట్టమన్నుతో చేసిన శివలింగాలను అర్చించినట్లయితే గ్రహదోశాలు తొలగుతాయని భక్తుల నమ్మకం. వేపచెట్టు లక్ష్మీస్వరూపం, రావి చెట్టు విష్ణు స్వరూపం కనుక ఈ రెండు వృక్షాలకు హనుమదీశ్వర ఆలయంలో పూజాది కార్యక్రమాలు... వేప, రావి చెట్లకు వివాహం చేస్తుంటారు.
ఆంజనేయస్వామిని కొలిచిన వారికి మానసిక దౌర్భల్యం నశించి, మనోధైర్యం సిద్ధిస్తుంది. బుద్ధి, బలం, శక్తి, యశస్సు, ఆయురారోగ్యాలు చేకూరతాయి. వ్యాధుల నుంచి విముక్తి లభిస్తుంది. అవివాహితులకు కళ్యాణం ప్రాప్తి, నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతాయని ప్రజల ప్రగాఢ విశ్వాసం.
కళాధామం
[మార్చు]- ఇక్కడి కళాధామం చూడవలసినదేగాని, చెప్పనలవికాదు. ఈ కళాధామం దర్శించుటకు 350/- (July 2024 నాటి రేటు) ప్రవేశరుసుము చెల్లించవలెను. ఈ కళాధామం దర్శించుటకు రెండుగంటల సమయం పడుతుంది. లోపలకు కెమేరాలను అనుమతించరు. అమ్మవారి వాహనం సింహం నోటినుండి కళాధామంకు ప్రవేశమార్గం ఏర్పాటు ఉంటుంది. ఇక్కడ దేశవ్యాప్తంగా ఉన్నప్రధాన దేవాలయాల సూక్ష్మ రూపాలు ఉన్నాయి.
- విజయవాడ కనకదుర్గ ఆలయం
- షిర్డి సాయిబాబా గుడి
- తిరుమల వెంకటేశ్వర ఆలయం
మ్యూజియమ్‌లో ప్రదర్శిస్తున్నవి
[మార్చు]- లక్ష్మీనారాయణులతో మహాశివుడు,
- కాళీయమర్ధనము,
- సింహారూఢ అయిన భరతమాత,
- తమిళనాడు లోని రామేశ్వరుడు,
- తమిళనాడులోని వివేకానంద రాక్,
- గజేంద్ర మోక్ష సన్నివేశం గరుత్మంతున మీద మహావిష్ణువు ఆయనను వెన్నంటి ప్రియసతి లక్ష్మి, వారిని వెన్నంటి వస్తున్న ఆయుధాలు ముసలి చేత పీడింపబడుతున్న గజేంద్రుడు.
- ఇంద్రలోకము:- స్వర్గంలో సభతీరిన సచీదేవితో మహేంద్రుడు. దేవగురువు బృహస్పతి, నారదుడు, తుంబురుడు, అప్సరసలైన రంభ, ఊర్వశి, తిల్లోత్తమ, మేనక. అష్టదిక్పాలకులు.
- తమిళనాడు లోని కన్యాకుమారి.
- సోమకాస్రుడి నుండి వేదములను రక్షించడానికి మత్స్యావతారము ఎత్తిన మహావిష్ణువు.
- కర్నాటకలోని శృంగేరిలోని శారదాంబతో జగత్గురు శంకరాచార్యుడు.
- అలంపురంలోని జోగులాంబ.
- మధ్యప్రదేశ్ లోని ఖజూరహా లోని చిత్రగుప్తుడు.
- కర్నాటకలోని ధర్మస్థలలోని శ్రీ మంజునాధుడు.
- ఆంధ్రప్రదేశంలోని విశాఖపట్నంలో ఉన్న కనకమహాలక్ష్మి.
- చిటికిన వ్రేలితో గోవర్ధన గిరిని ఎత్తిన శ్రీకృష్ణుడు.
- గోపికా వస్త్రాపహరణము.
- వశిష్టాశ్రమము.
- స్వర్ణసీతతో శ్రీరాముడు చేసిన అశ్వమేధయాగము.
- శ్రీకృఇష్ణ రాసలీలలు.
- వేదపురుషులైన ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేద వారి వారి భార్యలతో.
- తిరుమలలోని శ్రీవేంకటేశ్వరుడు.
- అలివేలు మంగాపురంలోని శ్రీ పద్మావతి అమ్మవారు.
- సింహాచలంలోని శ్రీ వరాహ నరశింహస్వామి.
- శ్రీ కాళహస్థిలోని శ్రీ కాళహస్తీశ్వరుడు.
- కర్నాటకలోని hora naaduలోని అన్నపూర్ణేశ్వరీ దేవి.
- కాణిపాకము వరసిద్ధి వినాయకుడు.
- హరిద్వార్, కాశి, కేదార్‌నాధ్, అమర్నాధ్.
- వెండి కొండ వద్ద దశకంఠుడు.
- బద్రాచలంలోని సీతారాములు.
- ఒర్రిస్సా లోని పూరి జగన్నాధ స్వామి.
- తమిళనాడు లోని ఆండాళ్ అమ్మవారు.
- తొమ్మిది రూపాలలో నరసింహస్వామి.
- పార్వతి, నందీశ్వరుడు, భాగీరధులతో గంగావతణ సమయంలో ఈశ్వరుడు.
- అఘాసురుని నోటి నుండి తన స్నేహితులను పిలుస్తున్న శ్రీ కృష్ణుడు.
- శ్రీకృష్ణుడి చేతిలోహతులైన రాక్షసులు.
- సందర్శకులుప్రవేశించ కలిగినంతగా తెరచిన నోటితో బకాసురుడు.
- మహిషాశుర మర్ధిని.
- మహారాష్ట్రా ముంబైలోని మహాలక్ష్మి, మహాశక్తి, మహా సరస్వతి.
- పశ్చిమబెంగాలులోని కొలకత్తాలోని మహాకాళి.
- మహారాష్ట్రలోని తుల్జాపూర్ లో ఉన్న భవానీమాత.
- మహారాష్ట్రలో ఉన్న సిరిడీలోని సాయిబాబా.
- గుజరాత్ లోని సోమనాధీశ్వరాలయంలోని సోమనాధుడు.
- మహారాష్ట్రంలోని పండరీపురంలోని పండరినాధుడు.
- తమిళనాడులోని మధురై లోని మీనాక్షి అమ్మవారు.
- కర్నాటక లోని మేంగుళూరు లోని మూకాంబికై.
- కర్నాటక లోని శరవణ బెల్గొళ లోని గోమటీశ్వరుడు.
- ఏనుగు నోటిలో నుండి ప్రవేశించిన తరువాత అష్టలక్ష్ముల దర్శనం.
- andhra pradeshలోని మంత్రాలయములో ఉన్న శ్రీరాఘవేంద్రుడు.
- కురుక్షేత్రం, గీతోపదేశం, విశ్వరూపము.
- క్షీరసాగర మధనం.
- పంజాబు లోని అమృతసర్ లోని స్వర్ణదేవాలయము.
- ఉత్తరప్రదేశం లోని అలహాబాదు లోని త్రివేణి సంగమము.
- సతీదేవి శరీరాన్ని మోస్తూ.దక్షయజ్ఞాన్ని భగ్నంచేసిన శివుడు.
- మాయాదేవి స్వప్నంలో ఐరావతం.
- జ్యీతిర్లింగాలు.
- గణేశుడికి భారహం చెప్తున్న వేదవ్యాసుడు.
- ఉగ్రసేనుడు.
- అష్టదిక్పాలకులు తమతమ వాహనాల మీద భార్యలతో.
- అద్భుత ఉద్యానవనంలో జంటగా విహరిస్తున్న ప్రణయ దేవతలు.
- కేరళలోని శబరి మలైలోని అయ్యప్పస్వామి.
- నాగలోకము.
- ఉత్తర ప్రదేశంలోని అయోధ్యలో ఉన్న శ్రీ రామ దేవాలయము.
- మేడారంలోని సమ్మక్క సారక్క.
- కుబ్జికా దేవి.
- నవదుర్గలు.
- పద్మద్వీపంలోని సప్త మాతృకలు.
- పదకొండు శిరసులతో ఆంజనేయుడు.
- పాటల గృహలో రామ లక్ష్మణులను బలి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న అహిరావణ మహి రావణులు ఈగ రూపంలో ఉన్న వారి ప్రాణాలను సంహరించి రామ లక్ష్మణులను కాపాడిన హనుమంతుడు.
- అహిరావణ, మహిరావణుల నుండి రామలక్ష్మణులను కాపాడడానికి తనతోకతో గృహము నిర్మించి దానిలో రామలక్ష్మణులను ఉంచి కాపాడుతున్న హనుమంతుడు.
- పాండురాజు విదురుడు, శకుని ఇతరులతో కొలువుతీరి ఉన్న దృతరాష్ట్రుడు.
- శిల్పాలతో రామాయణము.
- శిల్పరూపములో హనుమ చరిత్ర.
- పద్మవ్యూహము.
ప్రదర్శన లోపలి దృశ్య సంగ్రహ వివరణ
[మార్చు]కుందా సత్యనారాయణ కళాధామము ఒక హిందూధర్మ శిల్పకళాప్రదర్శన ఆలయము. సందర్శకులను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్ళగలిగిన హిందూధర్మ ప్రదర్శన శాల అని నిర్వాహకుల మాటలలో వర్ణించ బడింది. ఇక్కడ భారతదేశంలోని పురాణ ప్రాముఖ్యం కలిగిన సన్ని వేశాలు, అలాగే పురాణ ప్రాముఖ్యం కల దేవాలయాల నమూనాలను చక్కని శిల్పాలుగా మలిచి వర్ణరంజింతంగా అలంకరించి చూపరులకు కను విందు చేస్తున్నారు. ఇక్కడ బ్రహ్మ లోకము, విష్ణు లోకము, కైలాసము, స్వర్గ లోకము, నరక లోకము, పద్మద్వీపము, పద్మలోకము దృశ్యరూపంలో చూడవచ్చు. పద్మవ్యూహము అనేక దేవతా రూపాలు చూడవచ్చు. రామాయణము, మహాభారతము, భాగవతము వంటి పుపాణేతిహాసాలలో చోటు చేసుకున్న దృశ్యాలను కళ్ళకు కట్టినట్లుగా మలచిన శిల్పాలతో దృశ్యాలుగా దర్శించ వచ్చు. మంధర పర్వత సాయంతో క్షీపసాగర మధనము చేస్తున్న దేవతలను రాక్షసులను కూర్మావతారములో ఉన్న విష్ణు మూర్తిని చూడవచ్చు. అలాగే గజేంద్ర మోక్ష సన్నివేశాలను తడ్రూపంగా మలచిన దృశ్యాలను చూడవచ్చు. యుద్ధానికి సిద్ధంగా ఉన్న సేనల మధ్యలో 36 అడుగుల కృష్ణుడి విశ్వరూపదర్శనమును అతడికి భయభక్తులతో నమస్కరిస్తున్న అర్జునుడిని చూడవచ్చు. కాళీయుని పడగల మీద నాట్యమాడుతున్న శ్రీకృష్ణుడిని చూడ వచ్చు. గోవర్ధనోద్ధరణ, గోపికా వస్త్రాపహరణ, రాక్షసంహారము, రాసలీలా దృశ్యాలను తిలకించ వచ్చు. భవిష్య బ్రహ్మ అయిన హనుమ బాల్య సన్ని వేశాలను అతడు రామునుతో చేరిన పిదప జరిగిన సన్ని వేశాలను చూడ వచ్చు. హనుమ సువర్చల కల్యాణం, లంకాదహనం, అక్షయకుమారులను సంహరించడం, రామలక్ష్మణులను భుజము మీదకు ఎత్తుకుని యుద్ధ భూమిలో వారికి సహకరించడం, బ్రహ్మాస్త్రానికి కట్టుబడడం వాటిలో కొన్ని. హనుమ చేతి ప్రసాదాన్ని అతడి స్వహస్తాలతో తీసుకోవచ్చు. ఆవు నుండి పడుతున్న పాలతో చేసిన కాఫీని త్రాగవచ్చు. ఇలాంటి అపురూప దృశ్యాలను అనేకము చూసి సందర్శకులు అద్భుత అధ్యాత్మిక ఆనందాను భూతిని పొందవచ్చు.
చిత్రమాలిక
[మార్చు]-
ముందు నుండి కనపించే పంచ ముఖ హనుమ
-
వెనుక నుండి కనపించే పంచ ముఖ శివుడు
-
దేవాలయ ముఖద్వారం
-
హనుమదీశ్వరాలయం
-
కళాధామం/పద్మవ్యూహం ప్రవేశద్వారం వద్ద ఉన్న అమ్మవారి విగ్రహం
-
కళాధామం ముందుఉన్న కలశం
-
కళాధామం ముందుఉన్న శంఖురూపంలోని water fountain
-
నవగ్రహ ఆలయాలు
-
వేప రావి దంపతులు
-
సూర్య చంద్ర ముఖద్వారం
-
ప్రహారి గోడ
స్థల పురాణం
[మార్చు]రవాణా సౌకర్యాలు
[మార్చు]రాయ్ గిరి రైల్వేస్టేషను ఇక్కడికి చాలా దగ్గరలో ఉంది. యాదగిరి బస్టాండు కు హైద్రాబాదు, వరంగల్, నల్గొండ లనుండి చాలా బస్సులు కలవు.
వసతి సదుపాయాలు
[మార్చు]- శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆర్యవైశ్య నిత్యాన్నసత్ర సంఘం. Reg: 2393/1989 Ph: +91-8685-236670, +91-8685-236675 (toll gate దగ్గర ఉంటుంది ఈ సత్రం)
దగ్గరలోని దర్శనీయ స్థలాలు
[మార్చు]యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం
బయటి లింకులు
[మార్చు]- వికీమాపియా లో ఈ క్షేత్రాన్ని దర్శించండి.
- mythologicalmuseum ఈ ఆలయంవారి website
- కుందా సత్యనారాయణ విజ్ఞప్తి[permanent dead link]
మూలాలు
[మార్చు]- ↑ Telugu Native Planet (9 March 2019). "కోటి దేవతలు కొలువై ఉన్న సురేంద్రపురి చూడటం పూర్వ జన్మ సుకృతం". Archived from the original on 14 జనవరి 2022. Retrieved 14 January 2022.