కుందా సత్యనారాయణ
కుందా సత్యనారాయణ | |
---|---|
జననం | కుందా సత్యనారాయణ 15 జూన్ 1938 |
మరణం | 13 జనవరి 2021 హైదరాబాద్ |
జాతీయత | భారతదేశం |
వృత్తి | పారిశ్రామికవేత్త |
జీవిత భాగస్వామి | హైమవతి |
పిల్లలు | శ్రీనివాస్, ప్రతాప్, సురేందర్, సూర్యకుమారి |
కుందా సత్యనారాయణ తెలంగాణ రాష్ట్రానికి చెందిన పారిశ్రామికవేత్త. ఆయన యాదాద్రి పుణ్యక్షేత్రంకి సమీపంలోని సురేంద్రపురి కుందా సత్యనారాయణ కళాధామం సృష్టికర్త.
జననం
[మార్చు]కుందా సత్యనారాయణ 15 జూన్ 1938లో తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, చింతకాని మండలం, బస్వాపురం గ్రామంలో జన్మించాడు.
సురేంద్రపురి నిర్మాణం
[మార్చు]కుందా సత్యనారాయణకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆయన మూడో కుమారుడు సురేంద్రబాబు 1991లో మరణించాడు. ఆయన జ్ఞాపకార్థం 1998లో యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం వడాయిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో 18 ఎకరాల స్థలం కొని ఆ ప్రాంతానికి సురేంద్రపురి ప్రాంగణంగా నామకరణం చేసి కాశీ నుంచి కన్యాకుమారి వరకు గల ఆలయాలన్నింటినీ ఒకే ప్రదేశంలో నిర్మించాడు. అక్టోబర్ 2008 లో ఈ ప్రాంగణానికి సందర్శకులను అనుమతించినప్పటికినీ, జనవరి 2009 లో పనులు పూర్తి చేసి ఫిబ్రవరి 8, 2009న ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నారాయణదత్ తివారీ ప్రారంభించాడు.
మరణం
[మార్చు]కుందా సత్యనారాయణ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్‌లోని తన స్వగృహంలో 13 జనవరి 2021న మరణించాడు. ఆయనకు భార్య హైమావతి, కుమారులు శ్రీనివాస్, ప్రతాప్, కుమార్తె సూర్యకుమారి ఉన్నారు.[1][2][3][4]
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (13 January 2022). "'సురేంద్రపురి' కుందా సత్యనారాయణ కన్నుమూత". Archived from the original on 14 జనవరి 2022. Retrieved 14 January 2022.
- ↑ NTV (13 January 2022). "'సురేంద్ర పురి' కుందా సత్యనారాయణ కన్నుమూత". Archived from the original on 14 జనవరి 2022. Retrieved 14 January 2022.
- ↑ 10TV (13 January 2022). "సురేంద్రపురి కుందా సత్యనారాయణ కన్నుమూత | Kaladhamam Surendrapuri Kunda Satyanarayana died" (in telugu). Archived from the original on 14 జనవరి 2022. Retrieved 14 January 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Eenadu (13 January 2022). "'సురేంద్రపురి' వ్యవస్థాపకుడు కుందా సత్యనారాయణ కన్నుమూత". Archived from the original on 14 జనవరి 2022. Retrieved 14 January 2022.