సురేష్ అంగడి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సురేష్ అంగడి
సురేష్ అంగడి


రైల్వే శాఖ సహాయ మంత్రి
పదవీ కాలం
30 మే 2019 – 23 సెప్టెంబర్ 2020
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ముందు మనోజ్ సిన్హా
తరువాత రావుసాహెబ్ దన్వే,
దర్శన జర్దోష్

లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
22 మే 2004 – 23 సెప్టెంబర్ 2020
ముందు అమర్ సింహ్ వసంతరావు పాటిల్
తరువాత మంగళ సురేష్ అంగడి
నియోజకవర్గం బెలగావి

వ్యక్తిగత వివరాలు

జననం (1955-06-01)1955 జూన్ 1
కేకే కొప్పా, కర్ణాటక, భారతదేశం
మరణం 2020 సెప్టెంబరు 23(2020-09-23) (వయసు 65)
న్యూఢిల్లీ, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి మంగళ సురేష్ అంగడి
సంతానం 2 (కుమార్తెలు)
Political offices
  • 2001-2004 : బెలగావి జిల్లా అధ్యక్షుడు, భారతీయ జనతా పార్టీ

సురేష్ చన్నబసప్ప అంగడి (1 జూన్ 1955 – 23 సెప్టెంబరు 2020) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయన 2004 నుండి 2019 వరకు వరుసగా నాలుగు సార్లు బెలగావి నియోజకవర్గంకు ఎంపీగా ఎన్నికై నరేంద్ర మోదీ మంత్రివర్గంలో కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రిగా పని చేశాడు.[2]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

సురేష్ అంగడి 1 జూన్ 1955న కర్ణాటక రాష్ట్రం, బెల్గాం సమీపంలోని కన్వి కర్వినకొప్ప గ్రామంలో చనబసప్ప, సోమవ్వ దంపతులకు జన్మించాడు. ఆయన బెలగావిలోని ఎస్.ఎస్.ఎస్ సమితి కాలేజ్ ఆఫ్ కామర్స్ నుండి కామర్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ, ఆ తర్వాత బెలగావిలోని రాజా లఖమగౌడ న్యాయ కళాశాల నుండి న్యాయ పట్టా అందుకున్నాడు.[3]

రాజకీయ జీవితం

[మార్చు]

సురేష్ అంగడి భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1996 నుండి 1999 వరకు బీజేపీ బెల్గాం జిల్లా ఉపాధ్యక్షుడిగా, 2000 నుండి 2004 వరకు బెల్గాం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యుడిగా పని చేశాడు. ఆయన 2004లో బెలగావి లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభకు ఎంపీగా ఎన్నికయ్యాడు. సురేష్ ఆ తర్వాత వరుసగా 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఎంపీగా ఎన్నికై 30 మే 2019న నరేంద్ర మోదీ మంత్రివర్గంలో కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.

మరణం

[మార్చు]

సురేష్ అంగడి 2020 సెప్టెంబర్ 11న కరోనా బారిన పడి ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆరోగ్య పరిస్థితి విషమించి 2020 సెప్టెంబర్ 23న మరణించాడు. ఆయనకు భార్య మంగల్‌, ఇద్దరు కుమార్తెలు స్ఫూర్తి, శారద ఉన్నారు.[4]

మూలాలు

[మార్చు]
  1. Lok Sabha (2022). "Suresh Angadi". Archived from the original on 5 September 2022. Retrieved 5 September 2022.
  2. Deccan Chronicle (1 June 2019). "3 ministers: Karnataka gets Namo blessings" (in ఇంగ్లీష్). Archived from the original on 5 September 2022. Retrieved 5 September 2022.
  3. "Union Minister Suresh Angadi an unbeatable MP from Belagavi for four terms". Deccan Herald (in ఇంగ్లీష్). 23 September 2020. Retrieved 24 September 2020.
  4. Sakshi (23 September 2020). "కరోనాతో కేంద్ర మంత్రి కన్నుమూత". Archived from the original on 10 September 2022. Retrieved 10 September 2022.