Jump to content

సుర్జీత్ సేన్‌గుప్తా

వికీపీడియా నుండి
సుర్జీత్‌ సేన్‌గుప్తా
వ్యక్తిగత సమాచారం
జనన తేదీ (1951-08-30)1951 ఆగస్టు 30
జనన ప్రదేశం హూగ్లీ, పశ్చిమ బెంగాల్, భారతదేశం
మరణ తేదీ 2022 ఫిబ్రవరి 17(2022-02-17) (వయసు: 70)
మరణ ప్రదేశం కోల్‌కతా, పశ్చిమ బెంగాల్, భారతదేశం
ఆడే స్థానం వింగర్
సీనియర్ కెరీర్*
సంవత్సరాలు జట్టు Apps (Gls)
1971 కిడ్డర్‌పోర్
1972–1974 మోహన్ బగన్
1974–1980 తూర్పు బెంగాల్
1980–1981 మొహమ్మదన్ స్పోర్టింగ్
1981–1983 మోహన్ బగన్
జాతీయ జట్టు
1973–1979 భారత జాతీయ ఫుట్‌బాల్ జట్టు 14 (1)
  • Senior club appearances and goals counted for the domestic league only.
† Appearances (Goals).

సుర్జీత్‌ సేన్‌గుప్తా భారత ఫుట్‌బాల్ మాజీ ఆటగాడు. దేశంలోని అత్యుత్తమ వింగర్‌లలో ఆయన ఒకడు. ఆయన ఈస్ట్‌ బెంగాల్‌ లెజెండ్‌గా పేరుపొందాడు. 1970 ఆసియా క్రీడలలో కాంస్య పతకం సాధించిన భారత జట్టులో అతను సభ్యుడు. ఖిదిర్‌పూర్ క్లబ్‌లో తన ఫుట్‌బాల్ కెరీర్‌ను ప్రారంభించాడు.

1974లో టెహరాన్ లో జరిగిన ఆసియా క్రీడలు, 1978లో బ్యాంకాక్ లో జరిగిన ఆసియా క్రీడల్లో భారత జాతీయ ఫుట్‌బాల్ జట్టు తరఫున ఆడాడు. 1971, 1983ల మధ్య పన్నెండు సంవత్సరాల దేశీయ కెరీర్ లో, ఆయన కలకత్తా మూడు ఫుట్‌బాల్ క్లబ్ లైన మోహన్ బగాన్ ఎఫ్సి, ఈస్ట్ బెంగాల్ ఎఫ్సి, మహ్మదన్ స్పోర్టింగ్ క్లబ్ లకు ప్రాతినిధ్యం వహించాడు. ఆయన కాలంలోని అత్యుత్తమ ఫార్వర్డ్ లలో ఒకడిగా పరిగణించబడ్డాడు. ఈస్ట్ బెంగాల్ ఎఫ్సీకి ప్రాతినిధ్యం వహిస్తూ ఆయన ఐఎఫ్ఏ షీల్డ్, కలకత్తా ఫుట్‌బాల్ లీగ్ ఆరుసార్లు, డురాండ్ కప్ మూడుసార్లు గెలుచుకున్నాడు.

ఆయన 1974 నుండి 1980 వరకు ఈస్ట్ బెంగాల్ కు ఆడాడు. 1978-79 కాలంలో జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు.[1][2][3] 2018లో ఈస్ట్ బెంగాల్ నుండి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందుకున్నాడు.

ఆయన వింగర్‌గా ఆడాడు. వేగానికీ, పాసింగ్ రేంజ్ కూ ప్రసిద్ధి చెందాడు. ది హిందూ పత్రిక అతన్ని అతని సమకాలికుల్లో అత్యుత్తమ, సృజనాత్మక నాయకులలో ఒకరిగా పరిగణించింది.[4]

ప్రారంభ జీవితం

[మార్చు]

సుర్జీత్ సేన్‌గుప్తా 1951 ఆగస్టు 30న పశ్చిమ బెంగాల్ హూగ్లీ జిల్లా చక్ బజార్ లో జన్మించాడు.[5] అతని తండ్రి సుహాస్ సేన్‌గుప్తా డన్లప్ ఇండియాలో పనిచేసిన ఫుట్‌బాల్, క్రికెట్ ఆటగాడు. సుర్జీత్ హుగ్లీ బ్రాంచ్ స్కూల్లో చదువుకున్నాడు, అక్కడ అతన్ని కోచ్ అశ్విని భరత్ గుర్తించాడు. ఆ తరువాత, ఆయన హుగ్లీ మొహ్సిన్ కళాశాలలో చదువుకున్నాడు, అక్కడ రాబర్ట్ హడ్సన్ ఎఫ్సి తరఫున రెండవ డివిజనులో ప్రవేశం చేసాడు.[6]

క్లబ్ కెరీర్

[మార్చు]

సుర్జీత్ సేన్‌గుప్తా 1971లో కిడ్డర్పూర్ క్లబ్ తరఫున దేశీయంగా అరంగేట్రం చేసాడు. ఆ తరువాత 1972, 1974ల మధ్య మోహన్ బగాన్ క్లబ్ కోసం ఆడాడు.[7] 1972 మేలో మోహన్ బగాన్ బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా ఉన్నాడు. అక్కడ వారు ఢాకా మొహమ్మదాన్ను ఓడించి ఢాకా XI చేతిలో ఓడిపోయారు.[8] ఆ తర్వాత 1974, 1980ల మధ్య ఆరు సీజన్లలో ఈస్ట్ బెంగాల్ ఎఫ్సీకి మారాడు. 1981, 1983ల మధ్య మోహన్ బగాన్ కు తిరిగి వచ్చాడు. దీనికి ముందు 1980, 1981ల మధ్య మొహమ్మదాన్ ఎస్సికి ప్రాతినిధ్యం వహించాడు.[9]

అతని ఉత్తమ అనుభవాలలో ఒకటి 1975 ఐఎఫ్ఏ షీల్డ్ ఫైనల్, దీనిలో అతను ఈస్ట్ బెంగాల్ కోల్‌కాతా ప్రత్యర్థి మోహన్ బగాన్ పై 5-0 తేడాతో విజయం సాధించాడు.[10] అతని విజయాలు చాలావరకు ఈస్ట్ బెంగాల్ ఎఫ్సితో ఉన్న సమయంలో వచ్చాయి. 1976 సంతోష్ ట్రోఫీ పశ్చిమ బెంగాల్ జట్టు కెప్టెన్ గా కూడా వ్యవహరించాడు.[10] పన్నెండు సంవత్సరాల దేశీయ కెరీర్ లో అతను కలకత్తా లోని మూడు ఫుట్​బాల్​ క్లబ్బులకు ప్రాతినిధ్యం వహించాడు. ఐఎఫ్ఏ షీల్డ్, కలకత్తా ఫుట్‌బాల్ లీగ్ ఆరుసార్లు, ఈస్ట్ బెంగాల్ ఎఫ్సి కోసం మూడుసార్లు డురాండ్ కప్ గెలుచుకున్నాడు.[11][12] ఆయన 2018లో ఈస్ట్ బెంగాల్ నుండి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందుకున్నాడు.[9]

అంతర్జాతీయ కెరీర్

[మార్చు]

1974లో కౌలాలంపూర్ వేదికగా జరిగిన మెర్డెకా కప్ థాయిలాండ్ తో జరిగిన మ్యాచ్ లొ భారత జాతీయ జట్టుతో ఆయన అరంగేట్రం చేసాడు.[13][14] 1974లో టెహరాన్ లో జరిగిన ఆసియా క్రీడలు, 1978లో బ్యాంకాక్ లో జరిగిన ఆసియా క్రీడలతో సహా 14 ఆటలలో అతను దేశానికి ప్రాతినిధ్యం వహించాడు.[15][16][17] 1974 మెర్డెకా కప్, సియోల్ లో జరిగిన 1977 ప్రెసిడెంట్స్ కప్ లో కూడా అతను దేశానికి ప్రాతినిధ్యం వహించాడు.[13]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఆయన శ్యామలి సేన్‌గుప్తాను వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు.[18] పదవీ విరమణ తరువాత అతను బెంగాలీ భాషా పత్రికలో స్పోర్ట్స్ ఎడిటర్ గా చేసాడు.[19] అతను పాడటం నేర్చుకున్నాడు, తన కొడుకుతో తబలా వాయించేవాడు.[18] ఈస్ట్ బెంగాల్ కోచ్, భారత ఫుట్‌బాల్ మాజీ క్రీడాకారుడు ప్రదీప్ కుమార్ బెనర్జీ బ్రెజిలియన్ ఫుట్‌బాల్ క్రీడాకారుడి పేరు మీద అతనికి సాక్రటీస్ అని పేరు పెట్టారు.[20]

మరణం

[మార్చు]

కరోనా బారినపడిన 71 ఏళ్ల సుర్జీత్‌ సేన్‌గుప్తా, 2022 ఫిబ్రవరి 17న కోల్‌కాతాలో మృతి చెందాడు.[21]

మూలాలు

[మార్చు]
  1. "Kolkatafootball.com :East Bengal League History: Indian Football Capital's News". kolkatafootball.com. Archived from the original on 12 February 2019. Retrieved 2019-02-11.
  2. "East Bengal FC » Historical squads". worldfootball.net. Archived from the original on 12 February 2019. Retrieved 2019-02-11.
  3. "East Bengal Club - The Official Site of East Bengal Club". eastbengalclub.co.in. Archived from the original on 8 November 2019. Retrieved 2019-02-11.
  4. Amitabha Das Sharma (17 February 2022). "Surajit Sengupta Passes Away at 71". The Hindu. Archived from the original on 17 February 2022. Retrieved 20 February 2022.
  5. "Surajit Sengupta, India Football Legend And 'Heartthrob' Of Fans, Dies At 70". Outlook India (in ఇంగ్లీష్). 18 February 2022. Archived from the original on 20 February 2022. Retrieved 20 February 2022.
  6. "Indian Football Great Surajit Sengupta Dies, Mamata Banerjee Leads Tributes | Football News". NDTVSports.com (in ఇంగ్లీష్). 18 February 2022. Archived from the original on 20 February 2022. Retrieved 20 February 2022.
  7. "IFA (WB) – Team: KIDDERPORE SC". ifawb.org. Indian Football Association. Archived from the original on 20 September 2022. Retrieved 17 September 2022.
  8. Alam, Masud (19 April 2022). "৭ কোটি মানুষের জন্য ভালোবাসা নিয়ে ঢাকায় এসেছিল মোহনবাগান" [Mohun Bagan came to Dhaka with love for 7 crore people]. www.prothomalo.com (in Bengali). Dhaka, Bangladesh: The Daily Prothom Alo. Archived from the original on 2 October 2022. Retrieved 19 October 2022.
  9. 9.0 9.1 "Surajit Sengupta, India Football Legend And 'Heartthrob' Of Fans, Dies At 70". Outlook India (in ఇంగ్లీష్). 18 February 2022. Archived from the original on 20 February 2022. Retrieved 20 February 2022.
  10. 10.0 10.1 Amitabha Das Sharma (17 February 2022). "Surajit Sengupta Passes Away at 71". The Hindu. Archived from the original on 17 February 2022. Retrieved 20 February 2022.
  11. "Surajit Sengupta, former East Bengal captain, passes away at 70 due to Covid-19". India Today (in ఇంగ్లీష్). 17 February 2022. Archived from the original on 17 February 2022. Retrieved 20 February 2022.
  12. "Former East Bengal captain Surajit Sengupta passes away". Sportstar - The Hindu. 17 February 2022. Archived from the original on 17 February 2022. Retrieved 17 February 2022.
  13. 13.0 13.1 "Surajit Sengupta, India Football Legend And 'Heartthrob' Of Fans, Dies At 70". Outlook India (in ఇంగ్లీష్). 18 February 2022. Archived from the original on 20 February 2022. Retrieved 20 February 2022.
  14. "East Bengal Football Club – Famous Players". www.eastbengalfootballclub.com. Archived from the original on 1 September 2009. Retrieved 25 February 2009.
  15. "Former East Bengal captain Surajit Sengupta passes away". Sportstar - The Hindu. 17 February 2022. Archived from the original on 17 February 2022. Retrieved 17 February 2022.
  16. "Sengupta passes away: সুরজিৎ চলে গেলেন স্মৃতির দেশে" [Surajit Sengupta passes away]. Anandabazar Patrika (in Bengali). 17 February 2022. Archived from the original on 17 February 2022. Retrieved 17 February 2022.
  17. "Former India midfielder and East Bengal legend Surajit Sengupta dies". The Telegraph. 17 February 2022. Archived from the original on 17 February 2022. Retrieved 17 February 2022.
  18. 18.0 18.1 Amitabha Das Sharma (17 February 2022). "Surajit Sengupta Passes Away at 71". The Hindu. Archived from the original on 17 February 2022. Retrieved 20 February 2022.
  19. "Surajit Sengupta, India Football Legend And 'Heartthrob' Of Fans, Dies At 70". Outlook India (in ఇంగ్లీష్). 18 February 2022. Archived from the original on 20 February 2022. Retrieved 20 February 2022.
  20. "Former India footballer Surajit Sengupta dies at 70 after Covid-19". Hindustan Times (in ఇంగ్లీష్). 17 February 2022. Archived from the original on 20 February 2022. Retrieved 20 February 2022.
  21. "మాజీ ఫుట్‌బాలర్‌ సుర్జీత్‌ మృతి". andhrajyothy. Retrieved 2022-02-18.